|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: తమిళ డైరెక్టర్‌తో బాలయ్య సినిమా! ఇక రికార్డులు బద్దలే!!

Published: 23-01-2026, 7:35 AM
షాకింగ్: తమిళ డైరెక్టర్‌తో బాలయ్య సినిమా! ఇక రికార్డులు బద్దలే!!
  • బాలయ్యకు తమిళ దర్శకుడు అదిక్ రవిచంద్రన్ కథ వినిపించారని సమాచారం!
  • అధిక్ రవిచంద్రన్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా బాలయ్యను మెప్పించిందట!
  • బాలయ్యకు వినిపించిన కథ లైన్ తెగ నచ్చేసిందట!
  • గ్రీన్ సిగ్నల్ ఇస్తే త్వరలోనే సినిమా పట్టాలెక్కే అవకాశం!

నందమూరి బాలకృష్ణ మరో సంచలనానికి తెర తీశారు. ఈసారి ఏకంగా తమిళ దర్శకుడితో సినిమా చేయబోతున్నారనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో వైరల్‌గా మారింది. అసలు ఏం జరుగుతోంది?

తమిళ దర్శకుడితో బాలయ్య బాబు?

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో ఇటీవ‌ల‌ అఖండ 2 తాండ‌వం వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఆశించిన‌మేర విజ‌యం సాధించ‌లేదు. తెలుగుతో పాటు పాన్ ఇండియా లెవ‌ల్ లో విడుద‌ల చేసిన ఈ సినిమా నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. త‌ర‌వాత బాల‌య్య గోపిచంద్ మ‌లినేని కాంబినేష‌న్ లో ఓ సినిమా తెర‌కెక్కుతోంది. భారీ యాక్ష‌న్ క‌థా చిత్రంగా ఈ సినిమా రాబోతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇది మార్చిలో విడుద‌ల కానుంద‌ని టాక్. కాగా ఇప్పుడు బాల‌య్యకు ఓ త‌మిళ ద‌ర్శ‌కుడు సైతం క‌థ‌ను వినిపించిన‌ట్టు స‌మాచారం అందుతోంది. త‌మిళ ద‌ర్శ‌కుడు అధిక్ ర‌విచంద్ర‌న్ బాల‌య్య‌కు ఓ క‌థ చెప్పార‌ట‌. అధిక్ ర‌విచంద్ర‌న్ తెర‌కెక్కించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా బాల‌య్య‌ను మెప్పించ‌గా అత‌డితో ఓ సినిమా చేయాల‌ని అనుకున్నార‌ట‌. ఈ నేప‌థ్యంలోనే బాల‌య్య‌కు ఓ క‌థ లైన్ వినిపించ‌గా తెగ‌న‌చ్చేసింద‌ని స‌మాచారం. ఇక బాల‌య్య ఈ క‌థ‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే త్వ‌ర‌లోనే వీరి కాంబినేష‌న్ లో సినిమా ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉంది.

‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాతో మెప్పించిన డైరెక్టర్

బాలయ్యకు స్టోరీ లైన్ వినిపించిన అదిక్

బాలయ్య కొత్త సినిమా గురించి వస్తున్న ఈ వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.