|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: బాలయ్య భక్తి సినిమా ఫ్లాప్ కి కారణం అదేనా? వైరల్ కామెంట్స్!

Published: 02-02-2026, 8:00 AM
షాకింగ్: బాలయ్య భక్తి సినిమా ఫ్లాప్ కి కారణం అదేనా? వైరల్ కామెంట్స్!
  • బాలకృష్ణ ‘పాండురంగడు’ మూవీపై తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు!
  • భక్తి సినిమాలో శృంగార సన్నివేశాలు ఉండటం వల్లే సినిమా ఫ్లాప్ అయిందని విమర్శలు!
  • టబు హీరోయిన్‌గా నటించడం, అసభ్యకర సన్నివేశాలే కొంప ముంచాయన్న విశ్లేషణలు!
  • మంచు విష్ణు ‘కన్నప్ప’ మూవీ కూడా అందుకే ఆడలేదని తమ్మారెడ్డి కామెంట్స్!

నందమూరి బాలకృష్ణ నటించిన ‘పాండురంగడు’ చిత్రం ఫ్లాప్ అవ్వడానికి గల కారణాలను ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ బయటపెట్టారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఆ వివరాల్లోకి వెళ్దాం!

బాలయ్య ‘పాండురంగడు’ మూవీ వెనుక అసలు నిజాలు

నందమూరి బాలకృష్ణ నటించిన గతంలో పౌరాణిక, జానపద చిత్రాల్లో నటించారు. అదే విధంగా ఆదిత్య 369 లాంటి సైన్స్ ఫిక్షన్ మూవీలో కూడా నటించారు. బాలయ్య తండ్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు పౌరాణిక చిత్రాలతో అప్పట్లో తిరుగులేని గుర్తింపు పొందారు. ఎన్టీఆర్ స్థాయిలో బాలయ్య పౌరాణిక, జానపద చిత్రాల్లో నటించలేదు కానీ కొన్ని సినిమాలు చేశారు.

అన్నమయ్య లాంటి భక్తి రస చిత్రం తెరకెక్కించిన రాఘవేంద్ర రావు ఆ తర్వాత శ్రీరామదాసు మూవీ తెరకెక్కించారు. అది కూడా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత బాలయ్యతో రాఘవేంద్ర రావు పాండురంగడు అనే మూవీ రూపొందించారు. అప్పట్లో ఎన్టీఆర్ పాండురంగ మహత్యం అనే చిత్రంలో నటించారు. అది సంచలన విజయం సాధించింది. ఆ సినిమా స్ఫూర్తితోనే రాఘవేంద్ర రావు బాలయ్యతో పాండురంగడు తెరకెక్కించారు.

టబు సీన్స్ వల్లే సినిమాకు దెబ్బ పడిందా?

కానీ ఈ చిత్రం విమర్శల పాలైంది. భక్తి కంటే ఈ మూవీలో బూతు ఎక్కువైంది అనే విమర్శలు వినిపించాయి. ముఖ్యంగా హీరోయిన్ టబు సన్నివేశాలు చాలా అసభ్యంగా ఉంటాయి. అందుకే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. భక్తి సినిమాని అలా చేస్తే ఇలాంటి రిజల్ట్ తప్పదు అంటూ తమ్మారెడ్డి భరద్వాజ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

పాండురంగడు చిత్రంలో బాలయ్య వ్యసనపరుడిగా, ఓ మహిళ మోజులో మునిగిపోయే వ్యక్తిగా నటించారు. అదే విధంగా శ్రీకృష్ణుడిగా కూడా కనిపించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దారుణంగాని రాశపరిచింది. మంచు విష్ణు నటించిన కన్నప్ప చిత్రంలో కూడా భక్తి లేదు. ఒక వారియర్ సినిమాలాగా తీశారు. అందుకే ఆ సినిమా కూడా ఆడలేదు అని తమ్మారెడ్డి అన్నారు.

తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు వైరల్!

తాను నేరుగా మోహన్ బాబుకి ఫోన్ చేసి అడిగినట్లు తమ్మారెడ్డి తెలిపారు. ఈ సినిమాని మీరు పట్టించుకున్నట్లు లేరు. పట్టించుకుని ఉంటే బాగానే ఉండేది అని మోహన్ బాబుతో తెలిపినట్లు తమ్మారెడ్డి అన్నారు.

బాలకృష్ణ సినిమా ఫ్లాప్ గురించి తమ్మారెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.