
📌 Key Points
- హనీ రోజ్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన గుర్తుతెలియని వ్యక్తి!
- కేరళలో షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరైన హనీ రోజ్
- హనీ రోజ్ నడుముపై చేయి వేసిన వ్యక్తిని లాగేసిన బౌన్సర్లు
- హనీ రోజ్‌కు మద్దతుగా నిలిచిన నెటిజన్లు, నిందితుడిపై ఆగ్రహం!
టాలీవుడ్ హీరోయిన్ హనీ రోజ్‌కు ఊహించని అనుభవం! ఆమెకు జరిగిన అవమానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉందా? అయితే ఈ వార్త చదవండి!
షాపింగ్ మాల్ ఓపెనింగ్‌లో హనీ రోజ్
అందాల తార హనీ రోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తెలుగులో చేసింది తక్కువ సినిమాల అయినప్పటికీ, పాపులారిటీ మాత్రం బాగానే దక్కించుకుంది. బోల్డ్ పాత్రలో ఎక్కువగా కనిపించే హనీ రోజ్, బాలయ్యతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే అలాంటి బాలయ్య హీరోయిన్ హనీ రోజ్ కు ఊహించని షాక్ తగిలింది. పబ్లిక్ అందరూ చూస్తుండగానే ఆమెను అడుగుపై ఓ అపరిచితుడు చేతులు వేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
నడుముపై చేయి వేసిన దుండగుడు.. వైరల్ వీడియో
కేరళలో సోమవారం ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరోయిన్ హనీ రోజ్ వెళ్లారు. అయితే హనీ రోజ్ వస్తున్న నేపథ్యంలో జనాలు కూడా అక్కడికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె నడుముపైన అసభ్యంగా ఓ అపరిచితుడు తాకాడు. దీంతో అతన్ని బౌన్సర్లు లాగేశారు. ఈ క్రమంలోనే దారుణమైన ఆ వీడియో బయటకు వచ్చింది. ఇది చూసిన నెటిజెన్స్ రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిన్ వస్తే అలా అసభ్యంగా తాకడం మన సాంప్రదాయం కాదని ఫైర్ అవుతున్నారు. జనాలు ఎక్కువగా ఉన్నప్పుడు సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు.
నెటిజన్ల ఆగ్రహం.. భద్రతపై ప్రశ్నలు!
A post shared by Pallavi Media (@pallavimedia)
హనీ రోజ్‌కు జరిగిన ఈ సంఘటన టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి. త్వరలో మరిన్ని వివరాలతో మీ ముందుకు వస్తాం.


