
నందమూరి బాలయ్య తన అల్లరి పనులకు, హాస్యానికి పేరుపొందారు. తాజాగా, సంయుక్త మీనన్ తో కలిసి ఏలూరులో జరిగిన జువెలరీ షాప్ ప్రారంభోత్సవంలో ఆయన చేసిన ఓ చిలిపి పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Key Points
బాలయ్య చిలిపి పనితో హీరోయిన్ సంయుక్త మీనన్ పగలబడి నవ్వింది.
ఏలూరులోని కొత్త జువెలరీ షాప్ ప్రారంభోత్సవంలో ఈ ఘటన జరిగింది.
బాలయ్య మొబైల్ గాల్లోకి విసిరి క్యాచ్ చేయడం వైరల్ అయింది.
సంయుక్త మీనన్ బాలయ్య కాళ్ళకు పడి ఆశీర్వాదం తీసుకుంది.
ఏలూరులో జువెలరీ షాప్ ప్రారంభం
టాలీవుడ్ అగ్ర హీరో, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలయ్య ( Nandamuri Balayya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల్లోనే కాదు బయట కూడా చాలా యాక్టివ్ గా కనిపిస్తారు. అల్లరి పనులు చేస్తూ వైరల్ అవుతూ ఉంటారు. అప్పుడప్పుడు కోపం వస్తే.. ఫ్యాన్స్ ను ఒక ఆట ఆడుకుంటారు. ఈ నేపథ్యంలోనే బాలయ్యకు సంబంధించిన వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా బాలయ్య చేసిన ఓ అల్లరి పని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హీరోయిన్ సంయుక్త మీనన్ ( Sanyukta Menon) అలాగే నందమూరి బాలయ్య ఇద్దరు కలిసి ఏలూరు నగరంలో కొత్తగా ఏర్పాటు చేసిన జువెలరీ షాప్ ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా… ప్రెస్ మీట్ పెట్టి ఇద్దరు మాట్లాడారు. అయితే హీరోయిన్స్ సంయుక్త మాట్లాడే సమయంలో… అక్కడే ఉన్న ఓ మొబైల్ తీసుకొని… గాల్లోకి ఎగిరేసి మరి క్యాచ్ పట్టాడు బాలయ్య. దీంతో అక్కడ ఉన్న వాళ్ళతో పాటు హీరోయిన్ కూడా… పగలబడి నవ్వేసింది. దీంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది.
బాలయ్య చిలిపి, హీరోయిన్ ప్రతిస్పందన
ఇక అంతకుముందు ఇదే ఏలూరు జువెలరీ షాప్ లో… నందమూరి బాలయ్య ఆశీర్వాదం తీసుకుంది హీరోయిన్ సంయుక్త మీనన్. ఆయన కాళ్లపై పడి.. ఆశీర్వాదం తీసుకుంది. దీంతో వెంటనే ఆమెకు ఆశీర్వాదం కూడా ఇచ్చారు నందమూరి బాలయ్య. ఆ వీడియో కూడా ఇప్పుడు వైరల్ గా మారింది. అలా నందమూరి బాలయ్య మరోసారి సోషల్ మీడియాలో.. హల్ చల్ చేస్తున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలు
Love his carefree attitude 😂 pic.twitter.com/azSePLHx8z
బాలయ్య యొక్క చిలిపితనం మరియు సంయుక్త మీనన్ ప్రతిస్పందన సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియోలు ఆయన అభిమానులకు మరింత ఆనందాన్నిచ్చాయి.


