
📌 Key Points
- బాలయ్య కూతురు తేజస్విని డ్యాన్స్ వీడియోతో సోషల్ మీడియాలో సెన్సేషన్. ఆమె టాలెంట్ కు ఫ్యాన్స్ ఫిదా.
- ఇంత టాలెంట్ ఉందా అని నందమూరి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వీడియో క్షణాల్లో వైరల్.
- జ్యువెలరీ యాడ్ తర్వాత డ్యాన్స్‌తో తేజస్విని మరోసారి అభిమానులను మెప్పించింది. బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శన.
- భవిష్యత్తులో తేజస్విని సినీ ఎంట్రీపై జోరుగా చర్చలు. నందమూరి అభిమానుల ఆశలు రెట్టింపు.
నందమూరి అభిమానులకు ఇది నిజంగా షాకింగ్ న్యూస్! మాస్ మహారాజు బాలయ్య కూతురు తేజస్వినిలో ఇంత టాలెంట్ దాగుందా? తాజాగా ఆమె చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ వీడియో చూస్తే మీరు సైతం ఆశ్చర్యపోతారు!
తేజస్విని టాలెంట్ కు నెటిజన్లు ఫిదా!
Tejeswini Nandamuri : ఒకప్పుడు సైలెంట్ గా మీడియాకు, సోషల్ మీడియాకు దూరంగా ఉండే బాలకృష్ణ రెండో కూతురు తేజస్విని గత కొన్నాళ్ల నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తేజస్విని ఇప్పటికే నిర్మాతగా, క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా సినీ పరిశ్రమలో పనిచేస్తుంది. ఆల్రెడీ బాలయ్య బాబు చేసిన అన్‌స్టాపబుల్ షోకి కూడా తేజస్విని పనిచేసింది.
ఇటీవల కొన్ని రోజుల క్రితం తేజస్విని ఓ జ్యువెల్లరీ యాడ్ లో నటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. నందమూరి రక్తం కదా అందుకే యాక్టింగ్ కూడా ఇంత ఈజీగా చేసేసింది, కానీ ఇన్నాళ్లు ఎందుకు దాచేసింది అనుకున్నారు. తేజస్విని సినిమాల్లో కూడా నటించొచ్చు అన్నారు ఫ్యాన్స్. నటిస్తారు అని వార్తలు వచ్చాయి. తాజాగా తేజస్విని ఓ డ్యాన్స్ వీడియో తన సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ అవుతుంది.
నటన తర్వాత డ్యాన్స్ తో రచ్చ!
తేజస్విని తాజాగా తన సోషల్ మీడియాలో మరో వ్యక్తితో కలిసి చేసిన డ్యాన్స్ వీడియోని పోస్ట్ చేసింది. ఇందులో తేజస్విని డ్యాన్స్ అదరగొట్టేసింది. తేజస్వినిలో ఈ ట్యాలెంట్ కూడా ఉందా అని నందమూరి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈ రేంజ్ లో డ్యాన్స్ చేస్తే ఎందుకు ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్నారు అని ఫ్యాన్స్ వీడియో కింద కామెంట్స్ చేస్తున్నారు.
సినిమాల్లోకి ఎంట్రీ ఖాయమా?
మొన్న యాక్టింగ్, ఇవాళ డ్యాన్స్.. మొత్తానికి బాలకృష్ణ కూతురు తేజస్విని కూడా తన ట్యాలెంట్స్ తో నందమూరి అభిమానులను మెప్పిస్తుంది. ఏదో ఒకరోజు సినిమా స్క్రీన్ పై తేజస్విని కనిపించినా ఆశ్చర్యపోనవసరం లేదు. మీరుకూడా బాలయ్య కూతురు తేజస్విని డ్యాన్స్ వీడియో చూసేయండి..
తేజస్విని డ్యాన్స్ వీడియో నిజంగా అదుర్స్! ఆమెలోని ఈ కొత్త టాలెంట్ నందమూరి అభిమానులకు పండగే. భవిష్యత్తులో తేజస్విని సినీ ప్రయాణం ఎలా ఉంటుందో చూడాలి. మరిన్ని ఆసక్తికర అప్‌డేట్‌ల కోసం చూస్తూ ఉండండి!


