|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బన్ బటర్ జామ్ రివ్యూ.. తెలుగులో వచ్చిన తమిళ సూపర్ హిట్ రొమాంటిక్ కామెడీ మూవీ మెప్పించిందా?

Published: 21-08-2025, 9:11 AM
బన్ బటర్ జామ్ రివ్యూ.. తెలుగులో వచ్చిన తమిళ సూపర్ హిట్ రొమాంటిక్ కామెడీ మూవీ మెప్పించిందా?

తమిళంలో సూపర్ హిట్ అయిన బన్ బటర్ జామ్ తెలుగులో విడుదలైంది. రాజు జయమోహన్, ఆధ్య ప్రసాద్, భవ్య త్రిఖ నటించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎలా ఉందో తెలుసుకుందాం. ఇద్దరు ఇంటర్ విద్యార్థుల ప్రేమకథ, వారి కుటుంబాల ప్లాన్లు ఈ సినిమాలో చూడవచ్చు.

Key Points

1

తమిళంలో సూపర్ హిట్ అయిన రొమాంటిక్ కామెడీ.

2

యువతకు నచ్చే లవ్ ట్రాక్ మరియు ఎమోషనల్ సీన్స్.

4

ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకర్షణీయంగా ఉంటుంది.

కథాంశం: ప్రేమ, పెళ్లి, మరియు కుటుంబాల మధ్య సంఘర్షణ

ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతుండటం ఇటీవల చాలా సాధారణంగా మారింది. ఈ క్రమంలోనే తమిళం లో సూపర్ హిట్‌గా నిలిచిన రొమాంటిక్ కామెడీ చిత్రం బన్ బటర్ జామ్ తెలుగులో థియేట్రికల్ రిలీజ్ కానుంది.

రాజు జెయమోహన్ హీరోగా ఆధ్య ప్రసాద్, భవ్య త్రిఖ హీరోయిన్లు గా నటించిన బన్ బటర్ జామ్ సినిమాకు రాఘవ్ మిర్‌దత్ దర్శకత్వం వహించారు. రెయిన్ ఆఫ్ ఎరోస్, సురేష్ సుబ్రమణియన్ నిర్మించిన ఈ సినిమాను తెలుగులో శ్రీ విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సీహెచ్ సతీష్ కుమార్ విడుదల చేస్తున్నారు.

అయితే, ఆగస్ట్ 22న థియేటర్లలో విడుదల కానున్న బన్ బటర్ జామ్ ప్రీమియర్ షోలు రెండు రోజుల ముందుగానే పడ్డాయి. మరి ఈ సినిమా మెప్పించిందా లేదా అనేది నేటి బన్ బటర్ జామ్ రివ్యూ లో తెలుసుకుందాం.

మధుమిత (ఆధ్య ప్రసాద్) చంద్రు (రాజు జెయమోహన్) ఇద్దరు ఇంటర్ చదువు పూర్తి చేస్తారు. ఓ పెళ్లిలో చంద్రు, మధుమిత తల్లిదండ్రులు కలుసుకుని క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారు. ఈ మధ్య కాలంలో ప్రేమ, అరేంజ్‌డ్ మ్యారేజ్‌లు కానీ ఏవి నిలబడట్లేదు, వెంటనే విడిపోతున్నారని మాట్లాడుకున్న వాళ్లు ఓ ప్లాన్ వేస్తారు.

నటన మరియు దర్శకత్వం: యువతకు కనెక్ట్ అయ్యే కథనం

లవ్, అరేంజ్ మ్యారేజ్ అనేది తెలియకుండా చేయాలని మధుమిత తల్లి (దేవదర్శిన), చంద్రు తల్లి (శరణ్య) ఓ స్కెచ్ వేస్తారు. అందుకోసం చంద్రు పక్కింట్లోకే మధుమిత కుటుంబం దిగుతుంది. కట్ చేస్తే ఇంజినీరింగ్‌లో చంద్రు, నందిని (భవ్య త్రిఖ) ప్రేమలో పడతారు. నందినిని చంద్రు బెస్ట్ ఫ్రెండ్ శ్రీనివాస్ (మైఖేల్ తంగదురై) కూడా లవ్ చేస్తుంటాడు.

మరోవైపు మధుమిత కూడా ఆకాష్ (వీజే పప్పు) అనే అబ్బాయిని ప్రేమిస్తుంది. ఇంకోవైపు ఒకరంటే మరొకరికి పడని చందు, మధుమితలను కలిపేందుకు వారి పేరెంట్స్ తెగ ప్రయత్నాలు చేస్తారు. ఆ తర్వాత ఏమైంది? పేరెంట్స్ ప్లాన్ వర్కౌట్ అయిందా? ఎవరి ప్రేమ పెళ్లి వరకు చేరుకుంటుంది? ఎవరు బ్రేకప్ చెప్పకుంటారు? అనేది తెలియాలంటే బన్ బటర్ జామ్ చూడాల్సిందే.

బన్ బటర్ జామ్.. ఇదొక రొమాంటిక్ లవ్ కామెడీ జోనర్ మూవీ. ఈ సినిమాలో యూత్‌కు కనెక్ట్ అయ్యే లవ్ ట్రాక్, ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఓవైపు కామెడీతో నవ్విస్తూనే మరోవైపు ఎమోషన్‌తో కట్టిపడేశారు. అప్పటివరకు నవ్వించే పాత్రలు చివరిలో కంటతడి పెట్టించడం హృద్యంగా ఉంటుంది.

ఇక చంద్రు, మధుమిత తల్లులు మధ్య వచ్చే కామెడీ ట్రాక్ ఫస్టాఫ్ అంతా హాయిగా నవ్విస్తుంది. ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్ బాగుంటుంది. ఊహించని విధంగా ఉండటమే కాకుండా నవ్విస్తుంది. లవ్ పెయిర్స్‌గా నటించిన వారి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. లవ్‌లో వచ్చే కామెడీ ట్విస్టులు ఆకట్టుకుంటాయి.

ముగింపు: ఒక హృద్యమైన రొమాంటిక్ కామెడీ అనుభవం

అలాగే, బ్రేకప్ ఎమోషన్స్ కూడా చాలా పెయిన్‌గా రాసుకున్నారు. లవ్, ఫ్రెండ్షిప్, కామెడీ, ఎమోషన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా యూత్‌కు నచ్చే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. కొన్ని చోట్ల వచ్చే గే ట్రాక్ బాగుంది. సెకండాఫ్‌లో కొంత సాగదీసినట్లు, అక్కడే కథ నడిచినట్లు అనిపిస్తుంది.

ఇక క్లైమాక్స్‌ను దాదాపుగా ఊహించేలానే తెరకెక్కించారు. అప్పటివరకు జరిగిన దాన్ని నాలుగైదు డైలాగ్స్‌తో రక్తి కట్టించారు. చివరిలో ఏ మెసేజ్ ఇచ్చారు. సినిమాలో విజువల్స్ బాగున్నాయి. సంగీతం ఓకే. తెలుగు డబ్బింగ్ సాంగ్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలు రిచ్‌గానే ఉన్నాయి. ఇక నటీనటుల పర్ఫామెన్స్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు తమ పాత్రల్లో అదరగొట్టారు.

ముఖ్యంగా తల్లి పాత్రల్లో దేవ దర్శన, శరణ్య బాగా అలరించారు. వారి కామెడీ యాక్టింగ్‌తో ఫస్టాఫ్ సాగిపోతుంది. అలాగే, రాజు జెయమోహన్ వెర్సటాలిటీ చూపిస్తా ఆకట్టుకున్నాడు. ఆధ్య ప్రసాద్, భవ్య త్రిఖ గ్లామర్‌తోపాటు క్యూట్‌గా అట్రాక్ట్ చేశారు. పాత్రల్లో మెప్పించారు.

వీజే పప్పు చివరిలో ఎమోషన్‌తో పిండేసే పర్ఫామెన్స్ చూపించాడు. డైరెక్టర్ టేకింగ్ బాగుంది. అయితే, తెలుగు డబ్బింగ్ కొన్ని చోట్ల మిస్ అయింది. ఇక ఫైనల్‌గా చెప్పాలంటే టైటిల్‌కు సంబంధం లేకపోయినా కామెడీ, లవ్, ఎమోషన్ అన్నింటి కలయికతో బన్ బటర్ జామ్ ‘ఫన్’ ఇస్తుంది.

చివరిగా, బన్ బటర్ జామ్ ఒక సరైన రొమాంటిక్ కామెడీ చిత్రం. యువతకు కనెక్ట్ అయ్యే కథ, నటన, మరియు దర్శకత్వం ఈ సినిమాను విశేషంగా చేస్తున్నాయి. మీరు కూడా ఈ సినిమాను చూడండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.