
📌 Key Points
- డిసెంబర్ 5న విడుదల కావాల్సిన అఖండ 2 ఆర్థిక కారణాల వల్ల వాయిదా పడింది.
- 14 రీల్స్ సంస్థ బాధ్యతారహితంగా ప్రవర్తిస్తుందని బండి సరోజ్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
- అఖండ 2 వాయిదా వల్ల డిసెంబర్ 12న విడుదలయ్యే సినిమాల పబ్లిసిటీ ఖర్చులు పెరుగుతాయి.
- బండి సరోజ్ కీలక పాత్రలో నటించిన ‘మొగ్లీ’ సినిమా డిసెంబర్ 12న విడుదల కానుంది.
అఖండ 2 సినిమా వాయిదా పడటంతో నటుడు బండి సరోజ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 రీల్స్ సంస్థ బాధ్యతారహితంగా వ్యవహరించిందని, అభిమానులు, పరిశ్రమను ఇబ్బందులకు గురిచేసిందని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
అఖండ 2 వాయిదా: అభిమానుల నిరాశ
Bandi Saroj Kumar : కొన్ని సందర్భాలలో పెద్ద సినిమాలు వస్తున్నాయి అంటే విపరీతంగా ఎదురు చూడటం అనేది ప్రేక్షకులు అలవాటు చేసుకుంటారు. వాస్తవానికి ఆ సినిమా రిలీజ్ డేట్ కి వాళ్ళకున్న పనులన్నీ కూడా పక్కన పెట్టుకొని మరి కొన్ని రోజులు ముందు నుంచే ప్లాన్ చేసుకుంటారు. సీనియర్ టాప్ హీరో బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అఖండ సినిమా తర్వాత చేసిన అన్ని సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాయి.
ఈ తరుణంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన సినిమా అఖండ 2. డిసెంబర్ 5న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తుంది అని అధికారికంగానే ప్రకటించారు. పాన్ ఇండియా స్థాయిలో సినిమా విడుదలవుతుంది కాబట్టి అదే రేంజ్ లో ప్రమోషన్స్ కూడా చేశారు. కాసేపట్లో ప్రీమియర్ షోలు మొదలవుతాయి అనుకునే తరుణంలో వాళ్లకు ఉన్న కొన్ని ఆర్థిక లావాదేవీలు వలన సినిమాను వాయిదా వేసేసారు. అయితే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇప్పటికే క్లారిటీ లేదు. దీనిపైన నటుడు దర్శకుడు బండి సరోజ్ ట్విట్టర్ వేదికగా 14 రీల్స్ సంస్థ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు.
14 రీల్స్ సంస్థ అత్యంత బాధ్యత రహితంగా ప్రవర్తిస్తుంది. ఏదోకటి కన్ఫర్మ్ చేస్తే, 12కి రిలీజ్ అవ్వాల్సిన సినిమాల పబ్లిసిటీ ఖర్చులు మిగులుతాయి కదా. ఏ అనౌన్స్మెంట్ ఇవ్వకుండా అటు అభిమానుల్ని, ఇటు సినిమా ఇండస్ట్రీ నీ, మరో పక్క డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ నీ అందరికీ నిద్రలు లేకుండా చేసి ఏం సాధిస్తున్నారు. చెడ్డ పేరు తప్ప. బాధ్యత ఉండాలిగా. అంటూ ట్వీట్ చేస్తూ అఖండ రిలీజ్ డేట్ పైన ప్రశ్నించారు.
14 రీల్స్ సంస్థపై బండి సరోజ్ ఆగ్రహం
Most irresponsible behaviour from @14ReelsPlus ఏదోకటి కన్ఫర్మ్ చేస్తే, 12కి రిలీజ్ అవ్వాల్సిన సినిమాల పబ్లిసిటీ ఖర్చులు మిగులుతాయి కదా. ఏ అనౌన్స్మెంట్ ఇవ్వకుండా అటు అభిమానుల్ని, ఇటు సినిమా ఇండస్ట్రీ నీ, మరో పక్క డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ నీ అందరికీ నిద్రలు లేకుండా చేసి ఏం…
— Saroj (@publicstar_bsk) December 8, 2025
సందీప్ రాజ్ దర్శకత్వంలో రోషన్ కనకాల నటించిన సినిమా మొగ్లీ. బండి సరోజ్ కీలక పాత్రలో సినిమాలో కనిపించారు. ముఖ్యంగా టీజర్ మరియు ట్రైలర్ లో కూడా బండి సరోజ్ స్క్రీన్ ప్రజెన్స్ అదిరిపోయింది. అయితే ఈ సినిమాను డిసెంబర్ 12న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కూడా జరిపారు.
“మొగ్లీ” విడుదలపై అఖండ 2 ప్రభావం
మరోవైపు ఈ సినిమా డిసెంబర్ 12న వస్తుంది అని కాన్ఫిడెంట్ గా చిత్ర యూనిట్ చెప్పలేక పోతుంది. దీనికి కారణం ఏంటంటే అదే రోజు అఖండ 2 సినిమా రిలీజ్ అయితే మిగతా సినిమాలన్నీ వాష్ అవుట్ అయిపోతాయి. ఎందుకంటే కాంబినేషన్ అలాంటిది మరోవైపు ఆ సినిమా మీద విపరీతమైన అంచనాలు కూడా ఉన్నాయి కాబట్టి చిన్న సినిమాలేవి పెద్దగా బాక్స్ ఆఫీస్ వద్ద కనిపించవు. అలానే థియేటర్స్ విషయంలో కూడా లోటు వస్తుంది.
ఈ తరుణంలోనే బండి సరోజ్ అఖండ సినిమా రిలీజ్ డేట్ గురించి తన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే 14 రీల్స్ సంస్థ కి ఇంకా కోర్ట్ ఇష్యులు కొనసాగుతున్నాయి అని వార్తలు కూడా మరోవైపు వస్తున్నాయి ఈ తరుణంలో సినిమా రిలీజ్ డేట్ పైన వాళ్లకి కూడా ఒక క్లారిటీ లేకుండా పోయింది. దీనిపైన స్పష్టమైన క్లారిటీ ఎప్పుడు వస్తుందో ఎవరు అంచనా కూడా వేయలేకపోతున్నారు.
ఇలాంటి అనూహ్య వాయిదాలు సినిమా పరిశ్రమ, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, ముఖ్యంగా అభిమానులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ముందుగానే సరైన సమాచారం ఇవ్వకపోవడం వల్ల అనవసర గందరగోళం ఏర్పడుతుంది.


