|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Bandi Saroj Kumar: వంద మెసేజ్లు పెట్టిన బండి సరోజ్ ఈవెంట్లకు రాడు, సందీప్ సంచలన కామెంట్స్

Published: 13-12-2025, 9:48 PM
Bandi Saroj Kumar: వంద మెసేజ్లు పెట్టిన బండి సరోజ్ ఈవెంట్లకు రాడు, సందీప్ సంచలన కామెంట్స్
  • బండి సరోజ్ కుమార్ జూనియర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి దర్శకుడిగా మారారు.
  • మౌగ్లీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లలో సరోజ్ కనిపించకపోవడంపై ప్రశ్నలు తలెత్తాయి.
  • సందీప్ రాజ్ మాట్లాడుతూ, వంద మెసేజ్‌లు పెట్టినా సరోజ్ ఈవెంట్లకు రారని తెలిపారు.
  • సరోజ్ కొంచెం ఇంట్రోవర్ట్ అని హీరో రోషన్ దీనిపై వివరణ ఇచ్చారు.

దర్శక నటుడు బండి సరోజ్ కుమార్ ఈవెంట్లలో కనిపించకపోవడంపై ప్రముఖ దర్శకుడు సందీప్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కనీసం వంద మెసేజ్‌లు పెట్టినా సరోజ్ ఈవెంట్‌లకు రాడని సందీప్ పేర్కొన్నారు. దీనిపై హీరో రోషన్ స్పందిస్తూ, సరోజ్ ఇంట్రోవర్ట్ అని వివరించారు. ఈ వార్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

బండి సరోజ్ కుమార్ ప్రస్థానం: జూనియర్ ఆర్టిస్ట్ నుండి దర్శకుడిగా

Bandi Saroj Kumar: కొంతమంది దర్శకులు ఇండస్ట్రీలో తమను తాము ప్రూవ్ చేసుకోవాలి అనే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలానే ఇంకొంతమంది కూడా సాధారణమైన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చి హీరో అవ్వాలి అనే ఆశలతో కూడా ఉంటారు. అలా హీరో అవ్వాలి అనుకునే ఇంటెన్షన్ తో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు బండి సరోజ్. జూనియర్ ఆర్టిస్టుగా కెరియర్ స్టార్ట్ చేసిన సరోజ్ తనకంటూ ఎవరో పాత్రలు రాయరు అనే క్లారిటీ తెచ్చుకొని దర్శకుడుగా మారాడు.

అయితే చాలా తక్కువ ఏజ్ లోనే చాలా విషయాలపైన అవగాహన సంపాదించుకున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మల్టీ టాలెంటెడ్ పర్సన్ సరోజ్. ఏకంగా 12 క్రాఫ్ట్ లు సూర్యాస్తమయం అనే సినిమాకి చేశాడు. అయితే చాలామంది సెలబ్రిటీలతో తన ప్రయాణాన్ని కొనసాగించాడు బండి సరోజ్. అనుకున్నవేవీ సరిగ్గా వర్కౌట్ కాకపోవడం వలన డైరెక్ట్ గా ఆడియన్స్ కి దగ్గరవుతాం అనే ఉద్దేశంతో యూట్యూబ్ వేదికగా సినిమాలు చేయడం మొదలుపెట్టాడు.

కళ నాది వెల మీది అనే కాన్సెప్ట్ తో తన షార్ట్ ఫిలిమ్స్ యూట్యూబ్ లో విడుదల చేశాడు. ఆ సినిమాలకు మంచి ఆదరణ కూడా లభించింది చాలామంది ఫ్యాన్స్ కూడా అతనికి వచ్చేసారు. మౌగ్లీ సినిమాలో నోలన్ అనే పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మినహాయిస్తే ఎక్కడా కూడా బయట సరోజ్ కనిపించలేదు. దాని గురించి ఆసక్తికర ప్రశ్న దర్శక నిర్మాతలకు ఎదురైంది.

ఈవెంట్లకు గైర్హాజరుపై సందీప్ సంచలన వ్యాఖ్యలు

మౌగ్లి సినిమా సక్సెస్ ప్రెస్ మీట్ ఒక ప్రముఖ విలేకర్ బండి సరోజ్ కుమార్ ఎక్కడా కూడా ఎందుకు కనిపించట్లేదు అని అడిగితే సందీప్ రాజ్. దానికి క్లారిటీ ఇచ్చారు నేను కనీసం ఆయనకి ఒక వంద మెసేజ్లు పెడతా కానీ ఆయన రారు అని ముందే చెప్పేశారు. వెంటనే హీరో రోషన్ మాట్లాడుతూ ఆయన కొంచెం ఇంట్రోవర్ట్ అన్ని సందర్భాల్లో బయటకు రాలేరు అంటూ కవర్ చేశాడు.

సరోజ్ కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా చాలామంది తన మాటలకు ముందు గట్టిగా అరవడం మొదలుపెట్టారు. అలానే కొంతమంది సెలబ్రిటీస్ కూడా అదే విషయాన్ని ఎక్కువగా ప్రస్తావించారు. ఇక మౌగ్లి సినిమాలో కూడా అతని పాత్రే కీలకంగా ఉంది అనే కామెంట్స్ బయట కూడా వినిపిస్తున్నాయి.

మౌగ్లీ సినిమా, సరోజ్ పాత్ర, రోషన్ వివరణ

సరోజ్ కు సహాయక పాత్రలు చేయడం పెద్దగా ఇష్టం ఉండదు. కానీ ఈ సినిమా చేయడానికి అసలైన కారణం ఏంటి అనేది సినిమా చూస్తే అర్థమవుతుంది అని సినిమా రిలీజ్ కి ముందే అతను చెప్పారు. అయితే సినిమా చూసిన తర్వాత కూడా అతని చెప్పిన మాటలు కరెక్టే అనిపించాయి. ఈ సినిమాలో ఉన్న బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ సరోజ్.

మొత్తం మీద, బండి సరోజ్ కుమార్ ప్రవర్తనపై వచ్చిన ఈ కామెంట్స్, అతని వ్యక్తిత్వం, కెరీర్ గురించి ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. ఇంట్రోవర్ట్ అయినా సరోజ్ తన కళ ద్వారా అభిమానులకు మరింత దగ్గరవ్వాలని సినీ వర్గాలు ఆశిస్తున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.