
📌 Key Points
- నటుడిగా, నిర్మాతగా పేరుపొందిన బండ్ల గణేష్ ‘బండ్ల గణేష్ బ్లాక్ బాస్టర్స్’ పేరుతో రెండో నిర్మాణ సంస్థను ప్రారంభించారు.
- గతంలో పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో ‘టెంపర్’ సహా భారీ విజయాలు సాధించారు.
- కొత్త బ్యానర్ ద్వారా హృదయాలను హత్తుకునే, సంపూర్ణ నిజాయితీతో కూడిన కథలను అందించడమే లక్ష్యమని ట్వీట్ చేశారు.
- రెండో బ్యానర్ ప్రారంభంతో బండ్ల గణేష్ ఇకపై పూర్తిస్థాయి నిర్మాతగా కొనసాగుతారా అనే చర్చ జరుగుతోంది.
నటుడిగా, నిర్మాతగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్.. ‘బండ్ల గణేష్ బ్లాక్ బాస్టర్స్’ పేరుతో తన రెండో నిర్మాణ సంస్థను ప్రారంభించారు. హృదయాలను కదిలించే కథలతో ముందుకు వస్తానని ఆయన ట్వీట్ చేశారు. ఈ పరిణామం ఆయన పూర్తిస్థాయి నిర్మాతగా మారబోతున్నారా అనే చర్చకు దారితీసింది.
బండ్ల గణేష్ కొత్త బ్యానర్ ప్రకటన
Bandla Ganesh:నిర్మాతగా, నటుడిగా తనకంటూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు బండ్ల గణేష్. ముఖ్యంగా కమెడియన్ గా పలు చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. ఆ తర్వాత నిర్మాతగా కూడా పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఇకపోతే ఎన్టీఆర్ తో చివరిగా టెంపర్ సినిమాను నిర్మించిన ఈయన.. మళ్లీ సినిమాలలో కనిపించలేదు.ఈ మధ్యకాలంలో పలు ఈవెంట్లో పాల్గొంటూ సందడి చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి తోడు మొన్నామధ్య దీపావళి సందర్భంగా సెలబ్రిటీలు అందరిని ఆహ్వానించి, పెద్ద ఎత్తున తన ఇంట్లో పార్టీ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవిని ముఖ్యఅతిథిగా ఆహ్వానించడమే కాకుండా ఆయన కోసం సపరేటుగా సింహాసనం కూడా తయారు చేయించి మరీ వార్తల్లో నిలిచారు బండ్ల గణేష్.
ఇకపోతే సినిమాల్లోకి రావాలి అని, మళ్ళీ నిర్మాతగా సినిమాలు నిర్మించాలని ఎస్కేఎన్ లాంటి నిర్మాతలు కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ మాటలను ఇప్పుడు బండ్ల గణేష్ నిజం చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా మరో ప్రొడక్షన్ హౌస్ ను ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. బండ్ల గణేష్ బ్లాక్ బాస్టర్స్ పేరుతో ఒక నిర్మాణ సంస్థను ప్రారంభిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇదివరకే పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ ను స్థాపించి.. ఆ బ్యానర్లో చివరిగా టెంపర్ సినిమాను నిర్మించారు బండ్ల గణేష్. అయితే ఇప్పుడు మరో కొత్త బ్యానర్ ను ప్రారంభించడంతో పాత బ్యానర్ లో సినిమాలు చేయరా? ఇక కొత్త బ్యానర్ లోనే సినిమాలు చేస్తారా ? అంటూ అభిమానులు, నెటిజన్స్ తమ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అయితే ఇక ఫుల్ టైం నిర్మాతగా కొనసాగుతారేమో చూడాలి.
ఇకపోతే కొత్త బ్యానర్ స్థాపించినట్లు.. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ.. ఎక్స్ వేదికగా ఇలా తెలియజేశారు బండ్ల గణేష్.” అపారమైన గర్వంతో నా రెండవ బ్యానర్ అయిన బండ్ల గణేష్ బ్లాక్ బాస్టర్స్ ప్రారంభాన్ని ప్రకటిస్తున్నాను. ముఖ్యంగా హృదయాన్ని హత్తుకునే సంపూర్ణ నిజాయితీతో కూడిన సినిమాకి మద్దతు ఇవ్వడానికి ఈ కొత్త బ్యానర్ ను స్థాపించాను. ఇకపై హద్దులు దాటి హృదయాలను కదిలించే సున్నితమైన కథలను మీకు చెబుతాను” అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం బండ్ల గణేష్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఆయన కొత్త బ్యానర్ ప్రారంభించిన సందర్భంగా పలువురు నెటిజన్స్, సెలబ్రిటీలు బండ్ల గణేష్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
‘బండ్ల గణేష్ బ్లాక్ బాస్టర్స్’ లక్ష్యం ఏంటి?
1996లో వినోదం అనే సినిమా ద్వారా నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఈయన.. ఎన్నో చిత్రాలలో కమెడియన్ గా నటించి తనకంటూ మంచి గుర్తింపును అందుకున్నారు. ముఖ్యంగా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈయన తన నిర్మాణ సంస్థ ద్వారా పలు చిత్రాలు కూడా నిర్మించారు .అందులో గబ్బర్ సింగ్ సినిమాకి ఉత్తమ చిత్రంగా సినీ ‘మా’ అవార్డు కూడా లభించింది.
#BandlaGanesh ‘s Second Banner BANDLA GANESH BLOCKBUSTERS (BG BLOCKBUSTERS)
Congratulations and All the best to @ganeshbandla Gaaru pic.twitter.com/71AFFFtlbJ
నిర్మాతగా భవిష్యత్ ప్రణాళికలు
— BIG TV Cinema (@BigtvCinema) December 30, 2025
మొత్తంగా, బండ్ల గణేష్ కొత్త బ్యానర్ ప్రకటన సినీ వర్గాల్లో ఆసక్తిని రేపింది. ‘బండ్ల గణేష్ బ్లాక్ బాస్టర్స్’ నుండి ఎలాంటి చిత్రాలు వస్తాయో, ఆయన పూర్తిస్థాయి నిర్మాతగా స్థిరపడతారో వేచి చూడాలి. ఇది ఆయన కెరీర్లో ఒక ముఖ్యమైన మలుపు.


