|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దుమ్మురేపిన బండ్ల గణేష్: ‘పాయ పాయ’ సాంగ్‌తో ఊర్రూతలూగించే స్టెప్పులు! ప్రోమో రిలీజ్!

Published: 16-01-2026, 9:15 AM
దుమ్మురేపిన బండ్ల గణేష్: 'పాయ పాయ' సాంగ్‌తో ఊర్రూతలూగించే స్టెప్పులు! ప్రోమో రిలీజ్!
  • బండ్ల గణేష్ స్టెప్పులతో ‘పాయ పాయ’ సాంగ్ ప్రోమో విడుదల.
  • శివాజీ, లయ ప్రధాన పాత్రల్లో ‘సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసిని’ చిత్రం.
  • ఈ సినిమాలో పృథ్వీరాజ్, ఇమ్మానుయేల్, రఘుబాబు తదితరులు నటిస్తున్నారు.
  • త్వరలోనే పూర్తి లిరికల్ వీడియో విడుదల కానుంది.

టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ ‘పాయ పాయ’ పాట ప్రోమోతో సందడి చేస్తున్నారు. ‘సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసిని’ చిత్రం నుంచి విడుదలైన ఈ ప్రోమోలో బండ్ల గణేష్ స్టెప్పులతో అదరగొట్టారు. ఈ చిత్రంలో శివాజీ, లయ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

‘పాయ పాయ’ సాంగ్‌లో బండ్ల గణేష్ స్టెప్పులు అదుర్స్!

Paya paya song : టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కమెడియన్ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న బండ్ల గణేష నిర్మాతగా మారి స్టార్ హీరోలతో సూపర్ సక్సెస్ సినిమాలను అందుకొని నిర్మాతగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందారు. పవన్ కళ్యాణ్ ,ఎన్టీఆర్ ,రవితేజ వంటి హీరోలతో నటించి మంచి సక్సెస్ అందుకున్న ఈయన తదుపరి ఎలాంటి సినిమాలను చేయకుండా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ఇండస్ట్రీకి సంబంధించిన అంశాల గురించి మాట్లాడుతూ నిత్యం వార్తల్లో ఉంటారు. ఇకపోతే తాజాగా సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసిని(sampradayini suppini suddapoosani ) అనే సినిమా నుంచి బండ్ల గణేష్ (Bandla Ganesh)కి సంబంధించిన ఒక పాట ప్రోమో విడుదల చేశారు “పాయ పాయ” (Paya paya song)అంటూ సాగిపోయే ఈ పాటకు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

ఈ ప్రోమోలో భాగంగా బండ్ల గణేష్ అద్భుతమైన స్టెప్పులతో అదరగొట్టారని చెప్పాలి. అయితే పూర్తి లిరికల్ వీడియో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఈ పాటకు సంబంధించిన ప్రోమోని షేర్ చేస్తూ బండ్ల గణేష్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఇలా బండ్ల గణేష్ డాన్స్ చూసిన అభిమానులు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసిన అనే సినిమా విషయానికి వస్తే.. సినీ నటుడు శివాజీ (Sivaji)ఈటీవీ విన్ తో కలిసి సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసిని అనే సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే.

‘సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసిని’ మూవీ విశేషాలు

ఈ సినిమాలో శివాజీ ,లయ ప్రధాన పాత్రలలో నటించబోతున్నారు. శివాజీ పంచాయతీ సెక్రెటరీ శ్రీరామ్ అనే పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే .ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇందులో శివాజీ నడుచుకుంటూ వెళుతుండగా రోహన్ సెల్ఫీ దిగుతూ ఉన్న పోస్టర్ ఎంతో ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాలో పృథ్వీరాజ్, ఇమ్మానుయేల్, రఘు బాబు ,రోహన్, ధన్ రాజ్ వంటి తదితరులు నటించబోతున్నారు. అయితే ఈ సినిమా నుంచి తాజాగా పాయ పాయ అంటూ విడుదల చేసిన ఈ సాంగ్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

https://twitter.com/ganeshbandla/status/2012126214664962529?s=20

శివాజీ, లయల ప్రధాన పాత్రలు

ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే మరిన్ని వివరాలను అధికారకంగా తెలియచేయనున్నారు. ఇక శివాజీ విషయానికొస్తే ఈయన ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ ఎంత బిజీగా ఉన్నారు. ఇదివరకే ఈ టీవీ విన్ తో కలిసి శివాజీ 90’S అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకోవడంతో తిరిగి ఈటీవీ విన్ వారితో ఈ సినిమాకు కమిట్ అయ్యారు. ఇక ఈ సినిమాకి సుధీర్ శ్రీ రామ్ దర్శకుడిగా వ్యవహరించబోతున్నారు.శ్రీ శివాజీ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ సినిమా రెండో సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

బండ్ల గణేష్ తన డ్యాన్స్ తో మరోసారి వార్తల్లో నిలిచారు. ‘సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసిని’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.