
📌 Key Points
- చిరంజీవి సినిమా సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ అయింది.
- అనిల్ రావిపూడిని ‘తోపులకే బాపు’ అని బండ్ల గణేష్ కొనియాడారు.
- ఈ సినిమాలో వెంకటేష్ గెస్ట్ రోల్ లో నటించారు.
- సినిమా విడుదలైన ఆరు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది.
టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్, చిరంజీవి నటించిన ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా విజయంపై స్పందించారు. డైరెక్టర్ అనిల్ రావిపూడిని ప్రశంసిస్తూ, సినిమా బ్లాక్ బస్టర్ అని కొనియాడారు.
అనిల్ రావిపూడిపై బండ్ల గణేష్ ప్రశంసలు
Bandla Ganesh: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న బండ్ల గణేష్(Bandla Ganesh) ఇటీవల కాలంలో సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సినిమాలకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇక బండ్ల గణేష్ మెగా అభిమాని అనే విషయం మనకు తెలిసిందే. మెగా హీరోలు చిరంజీవి పవన్ కళ్యాణ్ వంటి వారి సినిమాలు విడుదలవుతున్నాయి అంటే బండ్ల గణేష్ చేసే హడావిడి మాములుగా ఉండదు.
ఇక ఇటీవల మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) సంక్రాంతి పండుగ సందర్భంగా మన శంకర్ వరప్రసాద్ గారు (MSVPG film)అనే సినిమాకు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా విడుదలకు ముందు చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన సంగతి తెలిసింది. అయితే ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో తాజాగా ఈయన మరోసారి ఎక్స్ వేదికగా స్పందిస్తూ డైరెక్టర్ అనిల్ రావిపూడి పై పెద్ద ఎత్తున ప్రశంశలు కురిపించారు. బండ్ల గణేష్ చిరంజీవి, అనిల్ రావిపుడి వెంకటేష్ ఉన్న ఫోటోని షేర్ చేస్తూ.. మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా కేవలం సంక్రాంతి బ్లాక్ బస్టర్ మాత్రమే కాదు.. బాక్స్ ఆఫీస్ కింగ్ కూడా.
చిరంజీవి సినిమా బ్లాక్ బస్టర్
అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి స్వాగ్ అండ్ స్టైల్ తో పెద్ద ఎత్తున ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నారు. అనిల్ రావిపూడి ఒక మెజీషియన్ . తోపు కాదు.. తోపులకే అనిల్ బాపు. ఈ సినిమాలో వెంకటేష్ గెస్ట్ కూడా అదిరిపోయింది. చిరంజీవి వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. ఇక ఈ సినిమాని ఎవరు ఆపలేరు చిత్ర బృందానికి ప్రత్యేక శుభాకాంక్షలు అంటూ బండ్ల గణేష్ అనిల్ రావిపూడి పై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తూ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి
బ్రేక్ ఈవెన్ సాధించిన సినిమా
ఇక ఈ సినిమా కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాటలో పయనిస్తోంది . ఈ సినిమాకు షైన్ స్క్రీన్ బ్యానర్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లపై సాహు గారపాటి సుస్మిత కొణిదెల నిర్మాతలుగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా నయనతార నటించిన సందడి చేశారు. ఇక ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ వెంకి గౌడ అనే పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటి రోజు నుంచి అద్భుతమైన కలెక్షన్లను రాబట్టడంతో సునాయసంగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసింది. చిరంజీవికి చాలా రోజుల తర్వాత ఇలాంటి హిట్టు పడటంతో మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా 9వ సినిమా కావటం విశేషం. ఇలా వరుసగా తొమ్మిది సినిమాలు సక్సెస్ అయిన నేపథ్యంలో అనిల్ రావిపూడి పై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.
చిరంజీవి, వెంకటేష్ కాంబినేషన్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయని బండ్ల గణేష్ అన్నారు. సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి విజయవంతంగా నడుస్తుండటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.


