
మహేష్ బాబు – రాజమౌళి సినిమా ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలై వైరల్ అయ్యింది. మహేష్ ఎద్దుపై త్రిశూలంతో ఉన్న లుక్ బెల్లంకొండ శ్రీనివాస్ ‘సాక్ష్యం’ సినిమా సీన్‌ను గుర్తుచేస్తుందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. గతంలో పవన్ కళ్యాణ్, గోపీచంద్ వంటి హీరోలు కూడా ఎద్దుల సీన్స్‌లో కనిపించారు.
Key Points
మహేష్ బాబు రాజమౌళి సినిమా టైటిల్ లాంచ్ జరిగింది.
ఎద్దుపై త్రిశూలంతో మహేష్ బాబు ఫస్ట్ లుక్ వైరల్.
బెల్లంకొండ శ్రీనివాస్ 'సాక్ష్యం' సీన్‌తో పోలిక వైరల్.
పవన్ కళ్యాణ్, గోపీచంద్, చిరంజీవి కూడా ఎద్దు సీన్స్ చేశారు.
మహేష్ బాబు రాజమౌళి సినిమా ఫస్ట్ లుక్
Bellamkonda Sreenivas : ఇటీవల మహేష్ బాబు – రాజమౌళి వారణాసి సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్లో టైటిల్ గ్లింప్స్ తో పాటు మహేష్ బాబు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసారు. ఈ ఫస్ట్ లుక్ లో మహేష్ ఎద్దుపై కూర్చొని త్రిశూలం పట్టుకొని ఉగ్రంగా విలన్స్ మీదకు వెళ్లినట్టు ఉంది. ఈ పోస్టర్ వైరల్ గా మారడంతో మహేష్ లుక్ అదిరింది అని ఫ్యాన్స్ సంతోషించారు.(Bellamkonda Sreenivas)
అయితే పలువురు నెటిజన్లు ఇది మా బెల్లం బాబు ఎప్పుడో చేసేసాడు అని అంటున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ సాక్ష్యం సినిమాలో ఎద్దు మీద కూర్చొని త్రిశూలం పట్టుకొని విలన్ మీదకు వెళ్తాడు. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ వీడియో షేర్ చేస్తూ మహేష్ కంటే ముందే బెల్లం బాబు చేసాడు ఈ సీన్ అని అంటున్నారు.
బెల్లంకొండ శ్రీనివాస్ సాక్ష్యం సీన్ పోలిక
గతంలో పవన్ కళ్యాణ్ బంగారం సినిమాలో, ఇటీవల గోపీచంద్ భీమా సినిమాలో ఎద్దుల మీద కూర్చొని వచ్చిన సీన్స్ ఉన్నాయి. ఇక ఎద్దుతో ఫైట్ అయితే చిరంజీవి, నాగార్జున.. పలువురు హీరోలు ఎప్పుడో చేసేసారు. అయితే అచ్చు గుద్దినట్టు మహేష్ లాగే బెల్లంబాబు కూడా ఎద్దు మీద త్రిశూలం పట్టుకొని రావడంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
ఎద్దుతో పోరాడిన ఇతర హీరోలు
మహేష్ బాబు లుక్ వైరల్ అవ్వడమే కాకుండా, బెల్లంకొండ శ్రీనివాస్‌తో పోలిక కొత్త చర్చకు దారితీసింది. ఎద్దు సీన్లు తెలుగు సినిమాలో కొత్త కాకపోయినా, ఈ పోలికతో ఆసక్తికరమైన సంభాషణకు తెరలేపింది.


