|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రేమ వివాహం! హీరోయిన్ కాదు కానీ.. లాయర్ కూతురుతో ఏడడుగులు!!

Published: 08-03-2026, 7:35 AM
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రేమ వివాహం! హీరోయిన్ కాదు కానీ.. లాయర్ కూతురుతో ఏడడుగులు!!
  • బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డిల నిశ్చితార్థం ఘనంగా జరిగింది.
  • హైదరాబాద్‌లో జరిగిన వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.
  • సాయి శ్రీనివాస్ త్వరలో కావ్య రెడ్డిని వివాహం చేసుకోనున్నారు.
  • కావ్య రెడ్డి తాత జడ్జి కాగా, తండ్రి లాయర్ కావడం విశేషం.

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు సాయి శ్రీనివాస్ త్వరలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్నారు. ఆయన తన ప్రేయసి కావ్య రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.

సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి నిశ్చితార్థం

Bellamkonda Srinivas: ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ (Bellamkonda Suresh) తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాయి శ్రీనివాస్ (Sai Srinivas) ‘అల్లుడు శీను’ సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.. మొదటి సినిమాతోనే సమంత( Samantha) లాంటి స్టార్ హీరోయిన్ తో నటించే అవకాశాన్ని అందుకొని.. సక్సెస్ కూడా సొంతం చేసుకున్నారు. ఇక ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేస్తున్నారు కానీ స్టార్ హీరో రేంజ్ లో అవకాశాలు తలుపు తట్టలేదు. అలాగని ఆయన ఆ స్టేటస్ ను సొంతం చేసుకో లేకపోవడంతో అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా రాక్షసుడు సినిమాతో రీమేక్ హిట్ అందుకున్న ఈయన.. రీసెంట్గా వచ్చిన భైరవం, కిష్కింధపురి సినిమాలు మాత్రం అనుకున్నంత స్థాయిలో విజయాన్ని అందించలేదు.

అలా కెరియర్ పరంగా కాస్త వెనుకబడిన సాయి శ్రీనివాస్.. ఇప్పుడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు.. ఈ నేపథ్యంలోనే తన ప్రేయసి కావ్యా రెడ్డితో ఆయన నిశ్చితార్థం చేసుకున్నారు. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న కావ్య రెడ్డితో ఆయన కొత్త జీవితం ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు ఈరోజు ఉదయం హైదరాబాదులో ఈ శుభకార్యం జరగగా.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ నుండి సంయుక్త మీనన్ , Samyuktha Menon), దర్శకుడు బోయపాటి శ్రీను(Boyapati Srinu) తదితరులు ఈ వేడుకకు హాజరై కాబోయే నూతన జంటను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వేడుకకు హాజరైన టాలీవుడ్ ప్రముఖులు

కావ్య రెడ్డి బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే.. ఈమెకు ఇండస్ట్రీ తో సంబంధం లేదు. ఈమె తాత జడ్జి కాగా తండ్రి లాయర్. వీళ్లది కూడా హైదరాబాద్.. శ్రీనివాస్ ,కావ్య కుటుంబాలకు ముందు నుంచే పరిచయం ఉండడంతోనే ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందని, ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్నామని ఇటీవల శ్రీనివాస్ బయటపెట్టారు. ఇక బహుశా ఈ ఏడాది ఆఖరిలో వీళ్ళ పెళ్లి ఉండే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా తన ప్రేయసితో ఇప్పుడు సాయి శ్రీనివాస్ ఏడడుగులు వేయబోతున్నారు. ఈ మేరకు జరిగిన నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ విషయానికి వస్తే.. నిర్మాత కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన అంతకుముందు లాస్ ఏంజెల్స్ లోని లీ స్ట్రాస్ బర్గ్ థియేటర్ అండ్ ఫిలిం ఇన్స్టిట్యూట్ , ముంబైలోని బారీ జాన్ యాక్టింగ్ స్టూడియోలో నటన కోర్సు పూర్తి చేశారు. వియత్నాంలో మార్షల్ ఆర్ట్స్ , స్టంట్స్ లో ప్రొఫెషనల్ శిక్షణ కూడా పొందారు. అల్లుడు శీను చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన ప్రకాష్ రాజ్ తో పాటు అరంగేట్రం చేశారు. ఇందుకు ఉత్తమ తొలి పురుష నటుడి విభాగంలో ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు.

కావ్య రెడ్డి నేపథ్యం

#BellamkondaSrinivas & #KavyaReddy 👏Engaged today! Wishing the couple a lifetime of happiness…❤️ #Wedding #Tollywood #entertainment #Trending #Bigtv #Bigtvcinema pic.twitter.com/x8BhvxvDEL

— BIG TV Cinema (@BigtvCinema) March 8, 2026

సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డిల జంట చూడముచ్చటగా ఉంది. వారి వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని ఆశిద్దాం. త్వరలో వీరి పెళ్లికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.