
📌 Key Points
- బెంగళూరు ఐటీ ఉద్యోగిని అంజలి నెలవారీ ఖర్చు రూ.71 వేలు.
- ఆమె ఖర్చుల్లో అద్దె (రూ.28 వేలు), ట్రిప్‌లు (రూ.15-20 వేలు) ప్రధానం.
- నెటిజన్లు పొదుపు చేయమని సలహాలివ్వగా, కొందరు ఆమెకు మద్దతు పలికారు.
- బెంగళూరులో పెరుగుతున్న జీవన వ్యయంపై మరోసారి చర్చకు దారితీసింది.
బెంగళూరులో జీవన వ్యయంపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఒక ఐటీ ఉద్యోగిని తన నెలవారీ ఖర్చు రూ.71 వేలని వెల్లడించిన వీడియో వైరల్ కావడంతో, నగరంలో పెరుగుతున్న ఆర్థిక భారం, యువత ఖర్చుల అలవాట్లు, ప్రభుత్వ విధానాలపై ప్రజల అభిప్రాయాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.
బెంగళూరు టెకీ ఖర్చుల వివరాలు: నెలకు రూ.71 వేలు ఎలా?
బెంగళూరు నగరంలో జీవన వ్యయం (Cost of Living) పై సోషల్ మీడియాలో మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. అంజలి అనే ఐటీ ఉద్యోగిని తన నెలవారీ ఖర్చుల వివరాలను వివరిస్తూ పోస్ట్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అట్లాసియన్ (Atlassian) కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఆమె.. గత మే నెలలో తనకు ఏకంగా రూ.71 వేలు ఖర్చయిందని, బెంగళూరు లాంటి నగరంలో ఇదేమంత పెద్ద మొత్తం కాదని పేర్కొనడం హాట్ టాపిక్‌గా మారింది.
తన ఆఫీసులోనే బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అలాగే రవాణా కోసం క్యాబ్ సదుపాయం ఉన్నప్పటికీ ఈ స్థాయిలో ఖర్చు కావడం గమనార్హం. అద్దె.. 1 BHK ఫ్లాట్ రెంట్, మెయింటెనెన్స్ కోసం నెలకు రూ.28,000. టూర్లు.. వీకెండ్స్‌లో 3- 4 రోజుల ట్రిప్‌ల కోసం రూ.15,000 నుంచి రూ.20,000. వీకెండ్ ఖర్చులు.. బయట భోజనం, షాపింగ్ కోసం రూ.12,000 నుంచి రూ.15,000. ఆహారం.. రాత్రి భోజనం వండేందుకు కుక్, కిరాణా సరుకులకు కలిపి సుమారు రూ.7,000. జిమ్, వైఫై, సబ్‌స్క్రిప్షన్లకు రూ.3,000, కరెంట్, నీటి బిల్లులకు రూ.1,000.. ఖర్చు చేస్తున్నట్లు టెకీ వెల్లడించింది.
నెటిజన్ల భిన్నాభిప్రాయాలు: పొదుపు వర్సెస్ ఎంజాయ్
A post shared by Anjali 🐥 (@anjaliclickss)
భవిష్యత్తు కోసం పొదుపు చేయండి: నెటిజన్‌లు
పెరుగుతున్న జీవన వ్యయం: ప్రభుత్వానికి సవాల్?
ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ‘ఈమె కేవలం ఖర్చు పెట్టడానికే పుట్టింది’, ‘ఆమె పెట్టే ఖర్చు.. బెంగళూరులో చాలా మంది నెలాఖరు జీతం’, ‘మేము కేవలం రూ.10 వేలతోనే బతికేస్తున్నాం’ అంటూ ఆశ్చర్యం, సెటైర్లు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా భవిష్యత్తు కోసం పొదుపు చేయాలని సలహాలు ఇస్తున్నారు. మరికొందరు మాత్రం ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. బెంగళూరులో పెరిగిన అద్దెలు, జీవన ప్రమాణాల దృష్ట్యా మంచి లొకేషన్‌లో ఉండేవాళ్లకి ఆ ఖర్చు సమంజసమేనని అభిప్రాయపడుతున్నారు. ఆర్థికంగా ఎలాంటి బాధ్యతలు లేని యువత, డబ్బును దాచుకోవడం కంటే ఇలా ఎంజాయ్ చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ఈ ఘటనతో మరోసారి బెంగళూరులో పెరుగుతున్న జీవన వ్యయం, యువ ఉద్యోగుల ఖర్చు అలవాట్లపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
బెంగళూరులో జీవన వ్యయం పెరుగుదల యువత ఆర్థిక స్థితిగతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ చర్చ ప్రభుత్వాలు నగరాల్లో మెరుగైన జీవన ప్రమాణాలను, సరసమైన వసతిని అందించాల్సిన ఆవశ్యకతను మరోసారి గుర్తుచేస్తుంది.


