
📌 Key Points
- భద్రాచలం అభివృద్ధికి రూ. 586 కోట్లు కేటాయింపు, మొదటి దశలో రూ. 351 కోట్లు విడుదల.
- గోదావరి ఘాట్ అభివృద్ధికి రూ. 75 కోట్లు, ఆలయ సముదాయానికి రూ. 180 కోట్లు.
- 2027 మార్చి 31 నాటికి మొదటి దశ పనులు పూర్తి చేయాలని లక్ష్యం.
- రామవరంలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం.
భద్రాచలానికి మహర్దశ పట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం రూ. 586 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. మొదటి విడతగా రూ. 351 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధులతో ఆలయ పరిసరాలు, గోదావరి ఘాట్‌ను అభివృద్ధి చేయనున్నారు.
మొదటి దశలో చేపట్టే అభివృద్ధి పనులు
భద్రాచలానికి మహర్దశ వచ్చేసింది…! ఇక పట్టణంతో పాటు ఆలయ రూపురేఖలు మారనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయగా….మొత్తం రూ. 586 కోట్లతో అభివృద్ధ పనులు చేపట్టాలని నిర్ణయించింది. 3 విడతల్లో ఈ నిధులను ఖర్చు చేయనుంది. ఈ క్రమంలో మొదటి విడత పనుల కోసం రూ. 351 కోట్లు మంజూరు అయ్యాయి.ఈ మేరకు బుధవారం పరిపాలనాపరమైన అనుమతులు మంజూరయ్యాయి.
మొదటిదశలో గోదావరి ఘాట్ అభివృద్ధి, ఆలయ పరిసరాల విస్తరణ, మౌలిక వసతుల మెరుగుదల వంటి పనులు చేస్తారు. ఇందులో గోదావరి ఘాట్‌కు రూ.75 కోట్లు, ఆలయ సముదాయానికి రూ.180 కోట్లు, పరిసరాల అభివృద్ధికి రూ.96 కోట్లు కేటాయించారు. రెండో దశలో ఆలయం సమీపంలో అభివృద్ధి పనులు, మూడో దశలో భద్రాచలం పట్టణ సమగ్ర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ సహజత్వానికి ఏమాత్రం భంగం కలగకుండా అభివృద్ధి పనులు జరగుతాయి. ఇదే అంశంపై ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పూర్తిగా ఆగమ శాస్త్రానుసారం చేపట్టాలని సూచించారు.
గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేయాలనే లక్ష్యం
ఇక మొదటి దశ అభివృద్ధి పనులు ఈ ఏడాదిలోనే మొదలవుతాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గత ఏడాది భద్రాచలం పర్యటనకు వెళ్లిన సందర్భంగా సమగ్ర అభివృద్ధికి హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా అధికారులు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయగా…. తాజాగా నిధులు విడుదలయ్యాయి.
వచ్చే గోదావరి పుష్కరాల నాటికి చేయగలిగిన పనులను ముందుగా గుర్తించి పూర్తి చేస్తారు. గోదావరి పుష్కరాల ప్రణాళికలకు అనుగుణంగా ఆలయ సమీపంలోని పుష్కర ఘాట్ల నిర్మాణం, అభివృద్ధి పనులు జరగుతాయి. 2027 మార్చి 31 నాటికి తొలిదశ అభివృద్ధి పనులు పూర్తి చేసే లక్ష్యంతో పనులు ముందుకెళ్తాయి. పుష్కరాలు ముగిసిన అనంతరం మిగతా పనులు పూర్తి చేసేందుకు కూడా ఇప్పుడే ప్రణాళికలు, అంచనాలు సిద్ధం చేయనున్నారు.
రామవరంలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు
భద్రాచలాన్ని తెలంగాణలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక హబ్‌గా మార్చాలని సర్కార్ యోచిస్తోంది. భద్రాచలం సమీపంలోని రామవరంలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం భారీగా నిధులు కేటాయించటంతో… స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా మంత్రులతో పాటు దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
భద్రాచలం అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. నిధుల విడుదల, ప్రణాళికల రూపకల్పన వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే భద్రాచలం ఆధ్యాత్మిక కేంద్రంగా రూపాంతరం చెందనుంది.


