|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సెప్టెంబర్ 7న భాద్రపద పౌర్ణమి, ఆ రోజు ప్రత్యేక యాదృచ్ఛికం.. తులసికి సంబంధించి ఈ పరిహారాలు పాటించండి.. డబ్బు కొరత ఉండదు!

Published: 04-09-2025, 1:08 AM
సెప్టెంబర్ 7న భాద్రపద పౌర్ణమి, ఆ రోజు ప్రత్యేక యాదృచ్ఛికం.. తులసికి సంబంధించి ఈ పరిహారాలు పాటించండి.. డబ్బు కొరత ఉండదు!

సెప్టెంబర్ 7న భాద్రపద పౌర్ణమి. ఈ పవిత్ర దినాన తులసి పూజ చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. ధనవృద్ధి, సమస్యల నివారణకు ఈ పరిహారాలు ఉపయోగపడతాయి.

Key Points

1

తులసి మొక్కకు నీళ్ళు పోసి, నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయండి.

2

11 తులసి ఆకులపై 'శ్రీ' అని రాసి విష్ణుమూర్తికి సమర్పించండి.

4

వెండి నాణేన్ని తులసి మొక్క దగ్గర పెట్టి, తరువాత పర్సులో ఉంచుకోండి.

భాద్రపద పౌర్ణమి పూజా విధానం

హిందూ క్యాలెండర్ ప్రకారం ఈసారి భాద్రపద పౌర్ణమి సెప్టెంబర్ 7, ఆదివారం నాడు వచ్చింది. ఆ రోజు స్నానం చేసిన తర్వాత సత్య నారాయణ స్వామిని ఆరాధించడం మంచిది. సత్యనారాయణ స్వామి కథ కూడా చదువుకోవచ్చు. భాద్రపద పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామిని పూజించడంతో పాటుగా లక్ష్మీదేవిని ఆరాధిస్తే కూడా మంచిది.

భాద్రపద పౌర్ణమి నాడు ప్రదోషకాలంలో లక్ష్మీదేవిని, చంద్రుడిని పూజిస్తే శుభ ఫలితాలను పొందవచ్చు. అదే రోజు తులసి పూజ చేస్తే కూడా విశేష ఫలితాలను పొందవచ్చు. తులసిని లక్ష్మీదేవిగా భావిస్తారు. భాద్రపద పౌర్ణమి నాడు తులసి మొక్క దగ్గర పూజ చేయడం వలన సంతోషం, ప్రశాంతత, ధనం, సంపద లభిస్తాయి. సమస్యలన్నిటిని తొలగించుకోవచ్చు.

లక్ష్మీదేవిని పౌర్ణమి నాడు పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి. ఎవరికైనా అప్పులు ఉన్నా, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నవారైనా పౌర్ణమి నాడు పరిహారాలను పాటించడం మంచిది.

భాద్రపద పౌర్ణమి నాడు తులసి మొక్కకు నీళ్లు అందించండి. అదే విధంగా తులసి మొక్క ఎదుట నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి సమస్యలన్నిటిని ఇంటి నుంచి తొలగిస్తుంది. ఆర్థిక బాధలు ఉండవు. పేదరికం నుంచి కూడా బయటపడవచ్చు.

తులసి పూజా ప్రయోజనాలు

ఎప్పటి నుంచో వ్యాపారంలో లాభాలు కలగకుండా ఉంటున్నట్లయితే 11 తులసి ఆకులను తీసుకుని పసుపుతో వాటిపై “శ్రీ” అని రాయండి. వీటిని విష్ణుమూర్తికి సమర్పించండి. ఈ విధంగా పాటించడం వలన విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అనుగ్రహం లభించి వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఆర్థికపరంగా బాగుంటుంది.

తులసి మొక్క ఎదుట కూర్చుని ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ మంత్రాన్ని పఠించండి. ఈ మంత్రాన్ని పఠించడం వలన శుభ ఫలితాలు ఎదురవుతాయి. సమస్యలు తొలగిపోతాయి. ‘ఓం నమో నారాయణాయ’ అనే మంత్రాన్ని కూడా పఠించవచ్చు. ఏ మంత్రాన్ని పఠించినా కోరిన కోరికలు నెరవేరుతాయి. ఆర్థికపరంగా సమస్యలు తొలగిపోతాయి.

4.వెండి నాణేన్ని పెట్టండి

భాద్రపద పౌర్ణమి నాడు దీపం వెలిగించిన తర్వాత ఒక వెండి నాణేన్ని తులసి మొక్క దగ్గర పెట్టండి. ఆ తర్వాత రోజు ఆ నాణాన్ని తీసి పర్సులో లేదా మీ దగ్గర ఉంచుకోండి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి శుభ ఫలితాలను తీసుకువస్తుంది.

ఆర్థిక సమస్యలకు పరిహారాలు

5.పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టండి

పౌర్ణమి నాడు పాలతో పరమాన్నం తయారు చేసి అందులో తులసి ఆకులను కూడా వేసి లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి నైవేద్యంగా పెట్టండి. ఆ తర్వాత ఈ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ తినండి. దీంతో ప్రశాంతత కలుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు తొలగిపోతాయి. ప్రేమానురాగాలు పెరుగుతాయి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

భాద్రపద పౌర్ణమి నాడు తులసి పూజతో లక్ష్మీదేవి, విష్ణుమూర్తి అనుగ్రహం పొందండి. ఈ పరిహారాలతో ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి పొందవచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.