
ముగ్గురు హీరోల కలయికతో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘భైరవం’ ఓటీటీ రిలీజ్ కు సమాయమవుతోంది. మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలుసుకుందాం.
Key Points
మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోలుగా నటించిన భైరవం సినిమా జూలై 18న ఓటీటీలో రిలీజ్.
జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్.
తెలుగుతో పాటు హిందీలోనూ ఈ సినిమా అందుబాటులో ఉంటుంది.
తమిళ చిత్రం గరుడన్ నుండి స్ఫూర్తి పొందిన ఈ యాక్షన్ డ్రామా సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడింది.
భైరవం ఓటీటీ రిలీజ్ డేట్
మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ భైరవం ఓటీటీ రిలీజ్ కు సమయం ఆసన్నమవుతోంది. ఈ పవర్ ప్యాక్డ్ యాక్షన్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. డిజిటల్ ప్రీమియర్ కు ఈ సినిమా రెడీ అవుతోంది. ఈ తెలుగు యాక్షన్ డ్రామా సినిమా మే 30న థియేటర్లలో రిలీజైంది.
యాక్షన్ థ్రిల్లర్ భైరవం సినిమా ఓటీటీ డేట్ లాక్ అయింది. ఈ సినిమా జూలై 18న ఓటీటీ లో రిలీజ్ కానుంది. జీ5 ఓటీటీలో ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ అవుతుంది. ఈ మేరకు జీ5 ఓటీటీ ప్లాట్ ఫామ్ సోషల్ మీడియాలో స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది. హైదరాబాద్ లోని ఐకానిక్ ప్లేస్ లపై భైరవం పోస్టర్లతో ఈ వీడియో రూపొందించింది. చివరగా హుస్సేన్ సాగర్ వాటర్ పై జూలై 18 భైరవం మూవీ అని వీడియో ముగించింది.
జీ5 లో భైరవం స్ట్రీమింగ్
భైరవం సినిమా రెండు భాషల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీలోనూ ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఆడియన్స్ కు అందుబాటులోకి రానుంది. విజయ్ కనకమేడల డైరెక్షన్ లో వచ్చిన భైరవం సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధమోహన్ నిర్మించారు. తమిళంలో 2024లో వచచిన గరుడన్ సినిమా ఆధారంగా భైరవం తెలుగులో రూపొందించారు.
శీను (బెల్లంకొండ సాయి శ్రీనివాస్), గజపతి వర్మ (మంచు మనోజ్), వరద (నారా రోహిత్) ముగ్గురు చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. ఊరిలో వారాహి అమ్మవారి గుడికి చెందిన భూములను మంత్రి (శరత్ లోహితాస్య) కాజేయాలని ప్రయత్నిస్తాడు. కానీ, దానికి అడ్డంగా ముగ్గురు ప్రాణ స్నేహితులు ఉంటారు. ఆ గుడికి ధర్మకర్తగా ఉన్న గజపతి నాయనమ్మ నాగరత్నమ్మ (జయసుధ) అకస్మాత్తుగా చనిపోతుంది.
సినిమా కథాంశం
దాంతో గజపతి దగ్గర పనిచేసే శీను గుడికి ధర్మకర్త అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు శీను ధర్మకర్త ఎలా అయ్యాడు? ఎందుకు అయ్యాడు? గుడి భూములు కాజేసేందుకు మంత్రి వేసిన స్కెచ్ ఏంటీ? ఒక తల్లి బిడ్డలుగా ప్రాణంగా పెరిగిన ముగ్గురు స్నేహితుల మధ్య రగులుకున్న చిచ్చు ఏంటీ? చివరికీ ఏమైంది? అనే ఆసక్తికర విషయాలు తెలియాలంటే భైరవం చూడాల్సిందే.
చివరగా, భైరవం సినిమా జూలై 18న జీ5 ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు ప్రకటించడం జరిగింది. ఈ మూవీని తెలుగు మరియు హిందీ భాషల్లో చూడవచ్చు.


