
📌 Key Points
- 80 ఏళ్ల వయస్సులో భారతీరాజా చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు.
- వారం రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్న భారతీరాజా ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన.
- ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి యాజమాన్యం ప్రకటన.
- అనవసరమైన వదంతులు నమ్మవద్దని అభిమానులకు ఆసుపత్రి విజ్ఞప్తి.
ప్రముఖ దర్శకుడు భారతీరాజా ఆరోగ్యంపై అభిమానులలో ఆందోళన నెలకొంది. ఇటీవల చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయన వారం రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఆసుపత్రి వర్గాలు ఆయన క్షేమంగా ఉన్నారని, అనవసర వదంతులు నమ్మవద్దని ప్రకటన విడుదల చేశాయి.
స్టార్ డైరెక్టర్ భారతీరాజా సినీ ప్రస్థానం
సినిమాలో గ్రామీణతను, సహజమైన హ్యూమన్ ఎమోషన్స్ ను కొత్తగా పరిచయం చేసిన దర్శకులలో భారతీరాజా ఒకరు. 16 ఏళ్ల వయసు తెలుగు సినిమాను తమిళంలో 16 వయదినిలే’ సినిమాగా తెలరకెక్కించి… దర్శకుడిగా అరంగేట్రం చేశాడు భారతీ రాజా. తొలి సినిమాలోనే రజనీకాంత్, కమల్ హాసన్, శ్రీదేవి లాంటి స్టార్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు.
ఆ తర్వాత వరుసగా హిట్ సినిమాలు అందించి తనకంటూ ఓ ప్రత్యేక శైలిని సృష్టించుకున్నారు. ‘కిళక్కే పోగుం రైల్’, ‘అలైగళ్ ఓయవదిల్లై’, ‘ముదల్ మరియాదై’ లాంటి సినిమాలతో తమిళ సినిమా గతిని మార్చారు. రాధిక, రాధ, కార్తీక్ లాంటి ఎందరో నటీనటులను పరిచయం చేసిన ఘనత కూడా ఆయనదే.
వ్యక్తిగత విషాదం నుండి ఆసుపత్రి చేరిక
దర్శకుడిగానే కాకుండా, నటుడిగా కూడా మారి ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు. ఇటీవల ‘తిరు సినిమాలో ధనుష్‌కు తాతగా నటించి మెప్పించారు. వయసును మించిన ఆయన నటన అనుభవాన్ని చూసి అంతా షాక్ అయ్యారు.
ఈ క్రమంలో, భారతీరాజా ఏకైక కుమారుడు, నటుడు, దర్శకుడు మనోజ్ భారతీరాజా గత మార్చిలో ఆకస్మికంగా మరణించడం ఆయన్ని తీవ్ర వేదనకు గురిచేసింది. ఆ బాధ నుంచి కోలుకోవడానికి మలేషియాలోని కూతురి ఇంట్లో కొన్ని నెలలు విశ్రాంతి తీసుకుని, తర్వాత చెన్నైకి తిరిగి వచ్చారు.
భారతీరాజా ఆరోగ్యంపై తాజా అప్‌డేట్
ప్రస్తుతం 80 ఏళ్లు దాటిన భారతీరాజా అనారోగ్యంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. వారం రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. అనవసరమైన వదంతులు నమ్మవద్దని అభిమానులను కోరింది.
మొత్తానికి భారతీరాజా ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి ప్రకటనతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆయన త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని సినీ ప్రముఖులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఆయన క్షేమం పట్ల అందరికీ ధీమా కలిగింది.


