|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

భయంగా ఉంది… అయినా సిద్ధమే : సల్మాన్‌ ఖాన్‌ (‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’)

Published: 18-07-2025, 5:21 AM
భయంగా ఉంది... అయినా సిద్ధమే : సల్మాన్‌ ఖాన్‌ ('బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్')

గాల్వాన్ లోయ యుద్ధం నేపథ్యంలో రూపొందుతున్న ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ చిత్రంలో సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. లడక్‌లోని చలిలో చిత్రీకరణ చేయాల్సి ఉండటం గురించి ఆయన తన భావాలను వ్యక్తం చేశారు.

Key Points

1

సల్మాన్ ఖాన్ 'బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్' లో ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు.

2

లడక్ లో 20 రోజుల షూటింగ్, 8 రోజులు కఠినమైన చలిలో షూట్.

4

గణతంత్ర దినోత్సవం లేదా రంజాన్ సందర్భంగా సినిమా విడుదల కావచ్చు.

సల్మాన్ ఖాన్ యొక్క కొత్త సినిమా

గాల్వాన్‌ లోయలో 2020లో భారత్‌–చైనా సైనికుల మధ్య జరిగిన యుద్ధం, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంతో రూపొందుతున్న చిత్రం ‘బ్యాటిల్‌ ఆఫ్‌ గాల్వాన్‌’. ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌(Salman khan ) హీరోగా నటిస్తున్నారు. ఇందులో ఆర్మీ ఆఫీసర్‌ పాత్రలో కనిపిస్తారు సల్మాన్‌. అలాగే ఈ చిత్రంలోని మరో కీలక పాత్రలో నటి చిత్రాంగద సింగ్‌ కనిపిస్తారు.

ఈ సినిమాకు సంబంధించి తన ప్రిపరేషన్‌ గురించి సల్మాన్‌ ఖాన్‌ తాజాగా మాట్లాడుతూ– ‘‘నా గత చిత్రం ‘సికందర్‌’ యాక్షన్‌ మూవీ. ‘బ్యాటిల్‌ ఆఫ్‌ గాల్వాన్‌’ డిఫరెంట్‌ మూవీ. ఇందులో చాలా యాక్షన్‌ అయితే ఉంది. కానీ గత చిత్రాలతో పోల్చినప్పుడు ఈ చిత్రం పూర్తిగా విభిన్నమైంది. ఈ సినిమా కోసం చాలా శ్రమిస్తున్నాను. ప్రతి రోజూ వర్కౌట్స్‌ చేస్తున్నాను. ఈ తరహా కష్టాన్ని ఈ సినిమా డిమాండ్‌ చేస్తుంది.

కష్టతరమైన చిత్రీకరణ

త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించనున్నాం. కష్టమైన లొకేషన్స్‌లో షూట్‌ చేయాల్సి ఉంది. లడక్‌లో దాదాపు ఇరవై రోజుల షూటింగ్‌ ప్లాన్‌ చేశాం. ఇందులో ఎనిమిది రోజులు గడ్డకట్టే చలిలో షూటింగ్‌ చేయాల్సి ఉంది. ఈ విషయం తలచుకుంటే నాకు భయంగా ఉంది. కానీ ఇందులో నేనే నటించడానికి సిద్ధంగా ఉన్నాను. ఫిజికల్‌ గా ఈ సినిమా కష్టమైనప్పటికీ ఈ జర్నీ నాకో మంచి మెమొరీ’’ అని పేర్కొన్నారు.

విడుదల తేదీ

ఇక అపూర్వ లిఖియా దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను సల్మాన్‌ ఖాన్‌ ఫిల్మ్స్‌ నిర్మిస్తోంది. అనుకున్న ప్రకారం ఈ సినిమా షూటింగ్‌ పూర్తయితే వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్‌. ఒకవేళ కుదరకపోతే… సల్మాన్‌ ఖాన్‌ ఫేవరెట్‌ సీజన్‌ రంజాన్‌ సందర్భంగా ఈ సినిమా విడుదల కావొచ్చు.

లడక్‌లోని కఠినమైన పరిస్థితుల్లో చిత్రీకరణ చేసినప్పటికీ, సల్మాన్ ఖాన్ తన పాత్రకు పూర్తిగా సిద్ధమయ్యారు. గణతంత్ర దినోత్సవం లేదా రంజాన్ సందర్భంగా ఈ చిత్రం విడుదల కానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.