
📌 Key Points
- కంగనా ఫ్లర్ట్ చేసినా అక్షయ్ ఖన్నా పట్టించుకోలేదని కంగనా వెల్లడి.
- షూటింగ్ సెట్‌లో అక్షయ్‌తో సరసమాడేందుకు ప్రయత్నించిన కంగనా.
- అక్షయ్ ఖన్నా చాలా సైలెంట్ పర్సన్ అని కంగనా వ్యాఖ్యానించింది.
- మిగతా హీరోల కన్నా అక్షయ్ చాలా ప్రత్యేకమని కంగనా తెలిపింది.
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఒక సంచలన విషయాన్ని బయటపెట్టింది. ఒకానొక నటుడిని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించినా ఆయన ఏమాత్రం పట్టించుకోలేదని తెలిపింది. ఆ నటుడు మరెవరో కాదు అక్షయ్ ఖన్నా. ఈ విషయం ప్రస్తుతం వైరల్ అవుతోంది.
కంగనా ఫ్లర్ట్‌ను పట్టించుకోని హీరో ఎవరు?
Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) అంటే తెలియని వారు ఉండరు. తన నటనతోనే కాదు, తన మాటలతో కూడా సెన్సేషన్ క్రియేట్ చేయడం ఆమె నైజం. అలాంటి కంగనా రనౌత్ రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా హీరోలే హీరోయిన్ల వెంట పడతారని వింటుంటాం, కానీ ఒక నటుడిని ఇంప్రెస్ చేయడానికి తాను ప్రయత్నించినా ఆయన అస్సలు పట్టించుకోలేదని కంగనా స్వయంగా వెల్లడించింది. ఆ నటుడు మరెవరో కాదు, విలక్షణ నటుడు అక్షయ్ ఖన్నా (Akshaye Khanna). ఇంతకు ముందు వచ్చిన ‘ఛావా’, ఇటీవల విడుదలైన ‘ధురంధర్’ సినిమాలలో విలన్‌గా నటించిన అక్షయ్ ఖన్నా నటనకు ప్రేక్షకులు ఫిదా అయిన విషయం తెలిసిందే. హీరో పాత్రకు ఎంత పేరు వచ్చిందో.. అక్షయ్ పాత్రకు కూడా అంతే రెస్పాన్స్ రావడం విశేషం. మరి తెరపై అంత పవర్ ఫుల్ విలన్‌గా కనిపించే అక్షయ్ ఖన్నా.. నిజ జీవితంలో మాత్రం చాలా సైలెంట్ పర్సన్ అని అంటోంది కంగనా రనౌత్.
అక్షయ్ ఖన్నా గురించి కంగనా ఏమన్నారంటే?
నేను ఫ్లర్ట్ చేసినా కూడా పట్టించుకోని వ్యక్తిత్త్వం తనది అంటూ ఓ సంచలన విషయాన్ని కంగనా బయటపెట్టింది. అక్షయ్ ఖన్నాతో పాటు ఇతర నటీనటులు ఉన్న ఒక మూవీ సెట్‌లో కంగనా అతనితో సరసమాడేందుకు ప్రయత్నించిదట. అవును ఈ విషయం స్వయంగా ఆమెనే చెప్పుకొచ్చింది. ‘‘షూటింగ్ సెట్‌లో అక్షయే ఖన్నాతో మాటలు కలపడానికి, ఆయనతో కొంచెం సరసమాడి ఇంప్రెస్ చేయడానికి ట్రై చేశాను. కానీ ఆయన నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. నన్నసలు పట్టించుకోనే లేదు’’ అని కంగనా నవ్వుతూ చెప్పుకొచ్చింది. తాను ఇప్పటివరకు పనిచేసిన హీరోల్లో అక్షయే ఖన్నా చాలా భిన్నమైన వ్యక్తి అని, ఆయనది ఒక ప్రత్యేకమైన ప్రపంచమని ఆమె ప్రశంసించింది. అంతేకాదు, తను ఫ్లర్ట్ చేస్తే పట్టించుకోని ఏకైక హీరో అతనేనని కంగనా ప్రశంసలు కురిపించింది. ప్రస్తుతం ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో కంగనా ఈ విషయాలను చెప్పుకొచ్చింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కంగనా కామెంట్స్
నిజమే, బాలీవుడ్ అంటే పార్టీ కల్చర్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఎప్పుడూ అక్షయ్ ఖన్నా పార్టీల్లో కనిపించలేదు. అలాగే పబ్లిసిటీకి కూడా ఆయన దూరంగా ఉంటారు. షూటింగ్ ఉంటే సెట్‌కి రావడం, తన పని తాను చేసుకోవడం తప్ప.. అనవసరమైన హడావిడి ఆయనకు నచ్చదని ఆయన తోటి నటీనటులు కూడా చెబుతున్నారు. వినోద్ ఖన్నా కుమారుడిగా సినీ రంగ ప్రవేశం చేసినా, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అక్షయ్. ఆయన చేసిన ప్రతి సినిమాలో అద్భుతమైన నటనను కనబరిచి, సైలెంట్‌గానే స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంటున్నారు. ఇప్పుడు కంగనా చెప్పిన మ్యాటర్ విన్న తర్వాత, అక్షయ్ ఖన్నా క్రేజ్ మరింత పెరుగుతుందనడంలో అతిశయోక్తి లేదు. అన్నట్టు, డ్యాన్స్ విషయంలోనూ ఆయన పేరు ఆ మధ్య బాగా వైరలైంది.
కంగనా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అక్షయ్ ఖన్నా వ్యక్తిత్వం గురించి ఆమె చేసిన ప్రశంసలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వారిద్దరి మధ్య జరిగిన ఈ సంఘటన సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


