|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీలోకి భైరవం: 7.1 నుంచి 5కి పడిపోయిన రేటింగ్- స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Published: 04-07-2025, 3:43 AM
ఓటీటీలోకి భైరవం: 7.1 నుంచి 5కి పడిపోయిన రేటింగ్- స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

టాలీవుడ్‌లో ముగ్గురు హీరోలతో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘భైరవం’ సినిమా ఓటీటీలోకి వస్తున్న విషయం తెలిసిందే. IMDb రేటింగ్ 7.1 నుండి 5కి పడిపోయినప్పటికీ, ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అంచనాలు ఉన్నాయి.

Key Points

1

ముగ్గురు హీరోల యాక్షన్ థ్రిల్లర్ 'భైరవం' ఓటీటీలోకి!

2

IMDb రేటింగ్ 7.1 నుండి 5కి పడిపోవడం విశేషం.

4

జూలై రెండో వారంలో రిలీజ్ అవ్వనున్నట్లు సమాచారం.

భైరవం ఓటీటీ విడుదల తేదీ

టాలీవుడ్‌లోని ముగ్గురు హీరోలు కలిసిన నటించిన సినిమా భైరవం. మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , నారా రోహిత్ నటించిన మల్టీ స్టారర్ సినిమా భైరవం తమిళ సూపర్ హిట్ మూవీ గరుడన్‌కు రీమేక్‌గా తెలుగులో వచ్చిన విషయం తెలిసిందే.

విభిన్న చిత్రాలతో దర్శకుడిగా మంచి ప్రతిభ కనబర్చిన విజయ్ కనకమేడల భైరవం సినిమాకు దర్శకత్వం వహించారు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధా మోహన్ భైరవం సినిమాను భారీగా నిర్మించారు. భైరవం సినిమాలో ముగ్గురు హీరోలు ప్రధాన పాత్రలు పోషించారు.

వీరితోపాటు భైరవం సినిమాలో అదితి శంకర్, ఆనంది, దివ్వా పిళ్లై హీరోయిన్స్‌గా చేశారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించిన భైరవం సినిమా వరల్డ్ వైడ్‌గా మే 30న థియేటర్లలో విడుదలైంది. అయితే, భైరవం సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. సినిమా స్టోరీ రొటీన్‌గా ఉన్న టేకింగ్‌లో కాస్తా కొత్తదనం కనిపించిందన్నారు.

IMDb రేటింగ్ తగ్గుదల

అలాగే, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ యాక్టింగ్ బాగుందని, మంచు మనోజ్‌ ను కొత్తగా చూస్తారని, నారా రోహిత్ ఎప్పుడ లేనంత సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని ప్రశంసలు వచ్చాయి. అయితే, థియేట్రికల్ రిలీజ్ తర్వాత భైరవం సినిమాకు ఐఎమ్‌డీబీలో పదికి 7.1 రేటింగ్ ఉండేది. కానీ, ఇప్పుడు అది 5కి పడిపోయింది.

అంటే, ప్రస్తుతం భైరవం సినిమాకు ఐఎమ్‌డీబీ లో 10కి 5 రేటింగ్ ఉంది. ఇక తాజాగా భైరవం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది. జీ5లో భైరవం ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. భైరవం ఓటీటీ రిలీజ్‌పై కమింగ్ సూన్ అంటూ జీ5 సంస్థ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది.

ఇదే నెల జూలైలో భైరవం ఓటీటీ రిలీజ్ కానుంది. జూలై రెండో వారంలో భైరవం ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే, ఇవాళ, లేదా రేపు భైరవం ఓటీటీ రిలీజ్ డేట్‌ను కూడా జీ5 ప్లాట్‌ఫామ్ ప్రకటించే ఛాన్స్ ఉంది.

సినిమా కథాంశం

ఇక భైరవం కథలోకి వెళితే.. శీను (బెల్లంకొండ సాయి శ్రీనివాస్), గజపతి వర్మ (మంచు మనోజ్), వరద (నారా రోహిత్) ముగ్గురు చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. ఊరిలో వారాహి అమ్మవారి గుడికి చెందిన భూములను మంత్రి (శరత్ లోహితాస్య) కాజేయాలని ప్రయత్నిస్తాడు.

కానీ, దానికి అడ్డంగా ముగ్గురు ప్రాణ స్నేహితులు ఉంటారు. ఆ గుడికి ధర్మకర్తగా ఉన్న గజపతి నాయనమ్మ నాగరత్నమ్మ (జయసుధ) అకస్మాత్తుగా మరణిస్తుంది. దీంతో గజపతి దగ్గర పనిచేసే శీను గుడికి ధర్మకర్త అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే భైరవం కథ.

చివరగా, భైరవం సినిమా జీ5 లో త్వరలోనే ప్రసారం కానుంది. జూలై రెండో వారంలో రిలీజ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.