
గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగింది. బాలు మరియు మీనా పెళ్లి వేడుకలు జరుగుతాయి. ప్రభావతి వారి సంతోషాన్ని చూసి ఎలా కుళ్లుకుంటుందో తెలుసుకుందాం.
Key Points
బాలు, మీనా పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతాయి.
ప్రభావతి, మనోజ్, రోహిణి వేడుకలను చూసి కుళ్లుకుంటారు.
మీనా శృతికి బంగారు గాజులు ఇస్తుంది.
బాలు, మీనా పెళ్లి వేడుకలు
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 507వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. బాలు, మీనా తొలి పెళ్లిరోజు వేడుకలు ఘనంగా జరుపుతారు. అయితే ఈ సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ జరిగాయి. వాళ్ల సెలబ్రేషన్స్ చూసి ప్రభావతి, మనోజ్, రోహిణి, సంజూలాంటి వాళ్లు కుళ్లుకుంటారు. శృతి తల్లి మరింత అవమానిస్తుంది.
బాలు, మీనా పెళ్లి రోజు సెలబ్రేషన్స్
గుండె నిండా గుడి గంటలు బుధవారం (సెప్టెంబర్ 10) ఎపిసోడ్ బాలు, మీనా పెళ్లి రోజు సెలబ్రేషన్స్ తో మొదలవుతాయి. ప్రభావతి వేధింపులను ఏడాది భరించిన మీనా గ్రేటే అంటూ కామాక్షి, శృతి, రోహిణి అంటారు. ఆ తర్వాత బాలు, మీనా కిందికి రాగానే శృతి వాళ్లకు గ్రాండ్ వెల్కమ్ చెబుతుంది. ప్రభావతి మాత్రం ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడం చూసి లోలోపల కుళ్లుకుంటుంది. కనీసం ఈ ఒక్క రోజైనా కొడుకు, కోడలును మనస్ఫూర్తిగా దీవించమని భార్యకు సత్యం క్లాస్ పీకుతాడు. బాలు, మీనా హీరో హీరోయిన్లంటూ పొగుడుతాడు.
మీనాకు శృతి తల్లి బంగారు గాజులు.. శృతికే వేసిన మీనా
ఆ తర్వాత వాళ్ల సెలబ్రేషన్స్ మొదలవుతాయి. అప్పుడే శృతి తల్లి శోభ వస్తుంది. తాను ఫోన్ చేసి పిలిచినట్లు ప్రభావతి చెబుతుంది. మీనాకు పెళ్లి రోజు గిఫ్ట్ అంటూ బంగారు గాజులు ఇస్తుంది. అది చూసి ప్రభావతి నోరెళ్లబెడుతుంది. మీనాకు బంగారం అంటే ఇష్టమనే తాను తీసుకొచ్చినట్లు చెబుతుంది.
ప్రభావతి కుట్రలు
పూలమ్ముకునే దానికి బంగారు గాజులా అంటూ కామాక్షితో ప్రభావతి అంటుంది. కానీ మీనా మాత్రం వాటిని తీసుకొని తనకు బంగారం అంటే మోజు లేదని, ఇవి తన చేతుల కంటే శృతికే బాగుంటాయంటూ ఆమెకు తొడుగుతుంది. అదీ మీనా అంటే అంటూ బాలు, సత్యం పొగుడుతారు.
బాలుకి సంజూ డ్రైవర్ జాబ్.. తిప్పి కొట్టిన బాలు
ఆ తర్వాత రవి, శృతి కూడా బాలు, మీనాలకు గిఫ్ట్ ఇస్తారు. వాళ్లిద్దరూ కలిసి ఉన్న ఫొటో ఫ్రేమ్ గిఫ్ట్ గా ఇస్తే దానిని చూసి ఇద్దరూ చాలా మురిసిపోతారు. ఇక సంజూ తాను కూడా గిఫ్ట్ తెచ్చానంటాడు. అది చూసి చెక్కు తెచ్చాడేమో.. ఎన్ని లక్షలో అని రోహిణి, మనోజ్ అనుకుంటారు. ఓ లెటర్ బాలు చేతిలో పెడతాడు. అతడు ఏంటిది అని అడుగుతాడు. వాడికి ఇంగ్లిష్ రాదు అంటూ మనోజ్ తీసుకొని చదువుతాడు. బాలుకి పర్సనల్ డ్రైవర్ ఉద్యోగం ఇచ్చాడని, నెలకు రూ.50 వేల జీతమని చెబుతాడు. అది విని ప్రభావతి తెగ మురిసిపోతుంది.
తనకు నమ్మకంగా చేసే పనోడు కావాలని, అందుకే ఈ ఆఫర్ ఇచ్చానని సంజూ అంటాడు. కానీ బాలు వద్దంటాడు. తాను మరొకరి కింద పని చేయబోనని, తన కారు తాను నడుపుకుంటానని అంటాడు. అటు సత్యం, సుశీల కూడా బాలుని సపోర్ట్ చేస్తారు. రూ.50 వేల ఉద్యోగం వదులుకుంటావా అంటూ ప్రభావతి మండిపడుతుంది. చెల్లి దగ్గర డ్రైవర్ గా పని చేయడానికి నామోషీయా అని సంజూ అంటాడు. ఆడపడచు దగ్గర పనోడిగా పని చేయడానికి కూడా తాను సిద్ధమే అని బాలు తిప్పి కొడతాడు.
సోఫాలో కూర్చొని కింద పడిన సంజూ
సంజూ యొక్క ఆఫర్
ఆ తర్వాత సంజూ సోఫాలో కూర్చోడానికి వెళ్లి కింద పడిపోతాడు. ఎప్పుడో తాతల కాలం నాటి సోఫాలు ఉన్నాయని చెప్పొచ్చు కదా అని మౌనికపై అరుస్తాడు. అది చూసిన శృతి తల్లి శోభ మీరెలాగూ కొత్త సోఫాలు కొనలేరు కానీ తాను కొని పంపిస్తానని అనడంతో సత్యం, బాలు మండిపడతారు. కొత్త సోఫాలు కొనేంత స్థలం ఈ చిన్న ఇంట్లో లేదని అంటారు. అవసరం లేదని చెప్పడంతో శోభ కోపంతో వెళ్లిపోతుంది.
బాలు, మీనాలను ఆకాశానికెత్తిన రవి, శృతి, సత్యం
ఆ తర్వాత బాలు, మీనాల గురించి ఒక్కొక్కరు మాట్లాడాలని శృతి అడుగుతుంది. మనోజ్, రోహిణి వాళ్ల గురించి మాట్లాడానికి ఏముంటుంది అంటూ వాళ్లను అవమానించేలా మాట్లాడతారు. కానీ రవి, శృతి, సత్యం మాత్రం బాలు, మీనాలను ఆకాశానికెత్తుతారు. తన చెఫ్ భాషలో వంటలతో పోలుస్తూ అన్నా, వదినల గురించి రవి చెబుతాడు. అసలు తాము కలిసి ఉండటానికి వీళ్లిద్దరే కారణమని శృతి అంటుంది. వాళ్లది ఆ దేవుడు చేసిన పెళ్లి అని సత్యం అంటాడు.
అటు మౌనిక కూడా అన్నయ్య, వదినల సంసారం చూసి అసలు భార్యాభర్తలంటే ఇలా ఉండాలని, తామూ అలాగే ఉండాలని అనుకుంటున్నట్లు చెబుతుంది. అది విని సంజూకి మరింత మండుతుంది. ఇక వెళ్దామంటాడు. కారు దాకా వెళ్లిన బాలు.. బావకు డోరు తీసి మర్యాద చేస్తాడు. అతడు గర్వంతో పొంగిపోతుంటే కావాలని డోరు వేయడంతో అతని చేతి వేళ్లు నలుగుతాయి. నిన్ను ఎవరు ఏమన్నా నాతో చెప్పు నేను చూసుకుంటానంటూ మౌనికతో అంటాడు. నా చెల్లిని ఏమైనా అన్నావో అంటూ సంజూకి గట్టి వార్నింగ్ ఇవ్వడంతో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ఈ ఎపిసోడ్ లో బాలు, మీనా జీవితంలో కొత్త మలుపులు, ప్రభావతి యొక్క కుట్రలు మరియు సంజూ యొక్క ప్రణాళికలు చూడవచ్చు. తదుపరి ఎపిసోడ్ ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి ఎదురు చూద్దాం.


