|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సింగర్ దారుణం: డ్యాన్సర్‌ను జనంలోకి విసిరివేత! భోజ్‌పురి సింగర్‌పై కేసు నమోదు!

Published: 15-03-2026, 10:05 PM
సింగర్ దారుణం: డ్యాన్సర్‌ను జనంలోకి విసిరివేత! భోజ్‌పురి సింగర్‌పై కేసు నమోదు!
  • భోజ్‌పురి సింగర్ ధనంజయ్ శర్మ ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో డ్యాన్సర్‌ను జనాల్లోకి విసిరేశాడు.
  • మహిళ అని చూడకుండా అసభ్యకరంగా తాకి, డాన్సర్‌ను పైకి ఎత్తి విసిరేయడంతో ఆమెకు గాయాలయ్యాయి.
  • ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు సింగర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
  • సింగర్ ధనంజయ్ శర్మపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.

భోజ్‌పురి సింగర్ ధనంజయ్ శర్మ ఓ వివాదంలో చిక్కుకున్నారు. బీహార్‌లో జరిగిన ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో ఆయన ఓ లేడీ డాన్సర్‌ను జనాల్లోకి విసిరేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సింగర్ ధనంజయ్ శర్మ వివాదాస్పద చర్య

భోజ్‌పురి (Bhojpuri) సింగర్ ధనంజయ్ శర్మ ( Dhananjay Sharma) వివాదంలో చిక్కుకున్నాడు. బీహార్ లాంటి రాష్ట్రాలలో ఫేమస్ అయిన ధనంజయ్ శర్మ, చాలా కార్యక్రమాలలో పాటలు పాడుతూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే అతడు బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. అయితే ఇందులో భాగంగానే బీహార్ లో ఓ ప్రైవేట్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా జనాలు విపరీతంగా వచ్చారు. ఈ కార్యక్రమానికి భోజ్ పురి సింగర్ ధనంజయ్ శర్మ స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. ఈ నేపథ్యంలోనే పాటలు పాడుతూ, ఆయన చేసిన ఓ పని వివాదంగా మారింది. స్టేజ్ పైన డ్యాన్స్ చేస్తున్న ఓ లేడీ డాన్సర్ ను పైకి ఎత్తి జనాల్లో పడేశాడు ధనంజయ్ శర్మ. మహిళ అని చూడకుండా అసభ్యకరంగా టచ్ చేస్తూ.. ఆమెను లిఫ్ట్ చేశాడు. ఆ తర్వాత అందరూ మగాళ్లు ఉండగా వాళ్లపైన ఆ లేడీ డాన్సర్ ను విసిరేశాడు.

లేడీ డాన్సర్‌కు గాయాలు, నెటిజన్ల ఆగ్రహం

దీంతో ఆ లేడీ డ్యాన్స‌ర్ కు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. దీంతో అక్క‌డ ఉన్న వాళ్లు కూడా షాక్ అయ్యారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇక దీనిపై నెటిజెన్స్ సీరియస్ అవుతున్నారు. సింగర్ గా పేరుగాంచిన ధనంజయ్ శర్మకు కొంచెం కూడా బుద్ధి లేదని ఫైర్ అవుతున్నారు. లేడీ డాన్సర్ అని చూడకుండా, పబ్లిక్ సిటీ కోసం ఇలాంటి పనులు చేస్తారా ? అని మండిపడుతున్నారు. మహిళలంటే అతడికి ఎలాంటి గౌరవం లేదని విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ సంఘటన వైరల్ అయిన నేపథ్యంలో సింగర్ ధనంజయ్ శర్మపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు. కాగా భోజ్‌పురి స్టేజ్ లపై గతంలో కూడా ఇలాంటి అసభ్యకరమైన ప్రవర్తనలు చేశాడట సింగర్ ధనంజయ్ శర్మ.

ధనంజయ్ శర్మపై కేసు నమోదు

A post shared by Patna Press (@patna.press)

ఈ ఘటన సింగర్ ధనంజయ్ శర్మ పట్ల తీవ్ర విమర్శలకు దారితీసింది. మహిళల పట్ల గౌరవం లేని ఇలాంటి చర్యలను ఖండించాలని నెటిజన్లు కోరుతున్నారు. దీనిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.