|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: బిచ్చగాడు కాంబో మళ్ళీ వచ్చేసింది! ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మంచు విష్ణు!

Published: 20-03-2026, 1:05 PM
షాకింగ్: బిచ్చగాడు కాంబో మళ్ళీ వచ్చేసింది! ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మంచు విష్ణు!
  • విజయ్ ఆంటోని, శశి కాంబోలో సెన్సేషనల్ హిట్ ‘బిచ్చగాడు’ చిత్రం రీ రిలీజ్ కి సిద్ధం!
  • ‘నూరు సామి’ తెలుగులో ‘వంద దేవుళ్లు’గా విడుదల.. భారీ అంచనాలు!
  • ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన మంచు విష్ణు.. మూవీ టీమ్ కి శుభాకాంక్షలు!
  • భావోద్వేగాలతో కూడిన కుటుంబ కథ చిత్రం.. పోస్టర్ విడుదల చేసిన వెంటనే వైరల్!

విజయ్ ఆంటోని, శశి ల బ్లాక్ బస్టర్ కాంబినేషన్ మరోసారి టాలీవుడ్ లో సంచలనం సృష్టించడానికి వస్తోంది. వారి కలయికలో వచ్చిన ‘వంద దేవుళ్లు’ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కావడంతో అంచనాలు పెరిగిపోయాయి.

బ్లాక్ బస్టర్ కాంబో మళ్ళీ ఒకే ఫ్రేమ్ లో!

విజయ్ ఆంటోని కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రం ‘బిచ్చగాడు’. శశి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 2016 రిలీజై మంచి సక్సెస్‌ను అందుకుంది. తన తల్లి ప్రాణాల కోసం ఓ బిలియనీర్ 48 రోజుల పాటు బిచ్చగాడిగా మారే కథాంశంతో, భావోద్వేగాలతో ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడిగా ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో విజయ్ ఆంటోని, డైరెక్టర్ శశి కాంబోకు మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు ఇన్నేళ్లకు ఈ కాంబో మరోసారి పట్టాలెక్కుతోంది. విజయ్ ఆంటోని, డైరెక్టర్ శశి కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ చిత్రం ‘నూరు సామి’. ఇది తెలుగులో ‘వంద దేవుళ్లు’గా రాబోతున్నది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను హీరో మంచు విష్ణు తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. ‘ఇది నిజమైన భావోద్వేగాలతో కూడిన కుటుంబం యొక్క ప్రయాణం. వారు జీవించిన జీవితం ఇదే. వందదేవుళ్లు ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ పోస్టర్ హృదయాన్ని హత్తుకునేలా ఉంది .. విజయ్ఆంటోనీ, దర్శకుడు శశి, హీరోయిన్ స్వాసిక అండ్ చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు’ అని తెలిపాడు. రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

మంచు విష్ణు ప్రశంసలు.. ఫస్ట్ లుక్ అదిరింది!

భావోద్వేగాల ప్రయాణం.. ‘వంద దేవుళ్లు’ విశేషాలు

‘వంద దేవుళ్లు’ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.