|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బిగ్ బాస్ ఇమ్ము గర్ల్‌ఫ్రెండ్‌తో ఫొటో.. ప్రేమలో మునిగిపోయిన ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Published: 02-01-2026, 12:30 AM
బిగ్ బాస్ ఇమ్ము గర్ల్‌ఫ్రెండ్‌తో ఫొటో.. ప్రేమలో మునిగిపోయిన ఎమోషనల్ పోస్ట్ వైరల్!
  • జబర్దస్త్ కమెడియన్, బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇమ్ము తన గర్ల్‌ఫ్రెండ్‌తో ఫొటో షేర్ చేశాడు.
  • ఆమెకు థాంక్స్ చెబుతూ రాసిన ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్.
  • గతంలో ఆమెను బాధపెట్టినందుకు క్షమాపణలు, జీవితాంతం సంతోషంగా ఉంటామని ఇమ్ము క్యాప్షన్.
  • నెటిజన్లు “క్యూట్ పెయిర్” అని కామెంట్ చేయగా, త్వరలో ఆమెను చూపిస్తానని ఇమ్ము రిప్లై.

బిగ్ బాస్ కంటెస్టెంట్, కమెడియన్ ఇమ్మాన్యుయేల్ తన లవ్ స్టోరీని మరోసారి తెరపైకి తెచ్చారు. తాజాగా తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ, ఆమెకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపాడు. ఈ భావోద్వేగ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇమ్ము ప్రేమ కథ ఆరంభం

కమెడియన్ ఇమ్మాన్యుయేల్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్‌ షోలో ఎంతగానో నవ్వించిన ఆయనకు బిగ్ బాస్ సీజన్-9‌లో కంటెస్టెంగ్‌గా వెళ్లే అవకాశం వచ్చింది. అలా హౌస్‌లోకి అడుగుపెట్టిన ఆయన తన మార్క్ కామెడీతో ఆడియన్స్‌ని ఒక రేంజ్‌లో ఆకట్టుకున్నాడు. కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు బిగ్ బాస్ పెట్టిన ప్రతి టాస్కుల్లో కూడా తన హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాడు. దీంతో ఈ సీజన్ విన్నర్ అతనే అని చాలామంది ఫిక్స్ అయ్యారు. కానీ, బ్యాడ్ లక్ ఆయన కేవలం టాప్ 5తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఇదిలా ఉంటే.. ఇమ్ము హౌస్‌లో ఉన్నప్పుడే తన లవ్ గురించి చెప్పిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో బయటికి వచ్చాక రీసెంట్‌గా తన గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఫొటో పెట్టిన అతను తాజాగా ఆమెతో ఉన్న మరో ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. తాజాగా ఇమ్ము తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. అందులో ఇద్దరు ఎదురెదురుగా సోఫాలో కూర్చున్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘థాంక్యూ వేస్ట్ అమ్మా.. నా జీవితంలోకి వచ్చినందుకు, నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్నందుకు థాంక్స్. నాకు తెలుసు గతంలో నేను నిన్ను చాలా బాధపెట్టాను అని.. కానీ ఈ ఏడాది నుంచి ఇద్దరం ఇంకా స్ట్రాంగ్‌గా ఉండి జీవితాంతం సంతోషంగా ఉండాలని దేవుడిని కోరుకుంటున్నాను. ఇకపై నీకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటానని మాటిస్తున్నాను.

గర్ల్‌ఫ్రెండ్‌తో ఇమ్ము భావోద్వేగ పోస్ట్

నేను అడగకుండానే దేవుడు నాకు ఇచ్చిన అతి పెద్ద బహుమతి నువ్వే.. నా జీవితంలో నీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. ఎల్లప్పుడూ నాకు అండగా నిలబడి అపారమైన ప్రేమను పంచినందుకు థాంక్యూ సో మచ్.. అండ్ ఐ లవ్ యు సో మచ్ బుజ్జి ఫెలో’ అంటూ క్యాప్షన్ జోడించాడు. దీంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే షేర్ చేసిన ఫొటోలో ఆమె ముఖాన్ని దాచడం అభిమానులకు మరింత ఆసక్తిని పెంచింది. దీంతో క్యూట్ పెయిర్ అని, వదినను ఎప్పుడు చూపిస్తావ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేయడంతో దానికి త్వరలోనే చూపిస్తానని ఇమ్మాన్యుయేల్ రిప్లై ఇచ్చాడు.

నెటిజన్ల రియాక్షన్: క్యూట్ పెయిర్

పెళ్లిపై ఓపెన్ అయిన ఆషికా రంగనాథ్.. అలాంటి క్వాలిటీస్ ఉన్నవాడే కావాలి!

ఇమ్ము ప్రేమపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘క్యూట్ పెయిర్’ అంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. త్వరలోనే తన గర్ల్‌ఫ్రెండ్‌ను పూర్తిగా పరిచయం చేస్తానని ఇమ్ము ప్రకటించడంతో అభిమానుల ఆసక్తి మరింత పెరిగింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.