
బిగ్ బాస్ 9 తెలుగు నుంచి తొమ్మిదో వారం ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. ఫోక్ సింగర్ రాము రాథోడ్ స్వచ్ఛందంగా హౌస్‌ను వీడగా, నటుడు సాయి శ్రీనివాస ఓటింగ్ ద్వారా బయటకొచ్చాడు. వారిద్దరి రెమ్యూనరేషన్, ఎవరు ఎక్కువ సంపాదించారో ఈ కథనంలో తెలుసుకుందాం.
Key Points
బిగ్ బాస్ 9 తెలుగు తొమ్మిదో వారంలో ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు.
ఫోక్ సింగర్ రాము రాథోడ్ స్వీయ నిర్ణయంతో హౌస్ వీడగా, సాయి శ్రీనివాస ఓటింగ్ ద్వారా ఎలిమినేట్ అయ్యాడు.
సాయి శ్రీనివాస నాలుగు వారాలకు రూ. 8 లక్షలు ఆర్జించినట్లు తెలుస్తోంది.
రాము రాథోడ్, సాయి శ్రీనివాసల రెమ్యూనరేషన్ ఒకేలా ఉన్నా, రాము రూ. 10 లక్షలు ఎక్కువ సంపాదించాడు.
బిగ్ బాస్ 9 తెలుగు డబుల్ ఎలిమినేషన్
బిగ్ బాస్ 9 తెలుగు నుంచి తొమ్మిదో వారం ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. ఫోక్ సింగర్ రాము రాథోడ్ సెల్ఫ్‌గా ఎవిక్ట్ అయితే.. సినిమా నటుడు సాయి శ్రీనివాస ఓటింగ్ ద్వారా ఎలిమినేషన్‌కు గురయ్యాడు. కంటెస్టెంట్‌గా వచ్చిన రాము రాథోడ్, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన సాయి శ్రీనివాస బిగ్ బార్ రెమ్యూనరేషన్ ఎంతో చూద్దాం.
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్‌లో ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ప్రతి వారం ఒకరి ఎలిమినేట్ అవుతారని తెలిసిన విషయమే. అయితే, కొన్ని సార్లు డబుల్ ఎలిమినేషన్ కూడా ఉంటుంది. అది కూడా పెద్ద ట్విస్ట్ ఏం కాదు. కానీ, సెల్ఫ్‌గా ఎలిమినేట్ అవడం అనేది ఊహించని పరిణామం.
కానీ, ఇంట్లోవాళ్లు గుర్తొస్తున్నారని, వాళ్లను వదిలి ఉండలేకపోతున్నాను కన్నీటి పర్యంతం అయిన రాము రాథోడ్ సొంతంగా ఎలిమినేట్ అయి హౌజ్‌ను వీడాడు. రాను రాను బొంబాయికి పాటతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఫోక్ సింగర్ రాము రాథోడ్ బిగ్ బాస్ తెలుగు 9లోకి సెప్టెంబర్ 7న కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు.
రాము రాథోడ్ స్వచ్ఛంద నిష్క్రమణ
ఇక అక్టోబర్ 12న ప్రారంభమైన బిగ్ బాస్ 9 తెలుగు 2.O గ్రాండ్ లాంచ్ జరిగింది. ఈ లాంచ్‌లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అందరూ ఎంట్రీ ఇచ్చారు. వారిలో సినిమా నటుడు సాయి శ్రీనివాస (Sreenivasa Sayee) కూడా ఉన్నాడు.
బిగ్ బాస్ తెలుగు 9 తొమ్మిదో వారం నామినేషనేట్ అయిన ఏడుగురిలో సాయి శ్రీనివాస కూడా ఉన్నాడు. అతని తొలి రోజు నుంచే అతి తక్కువగా ఓటింగ్ నమోదు అవుతూ వచ్చింది. వీకెండ్ వచ్చేసరికి కూడా సాయి శ్రీనివాస బిగ్ బాస్ ఓటింగ్ లో పెద్దగా మార్పు లేకుండా పోయింది.
సాయి శ్రీనివాస, రాము రాథోడ్ రెమ్యూనరేషన్
ఈ లెక్క బిగ్ బాస్ హౌజ్‌లో నాలుగు వారాలు ఉన్న సాయి శ్రీనివాస మొత్తంగా రూ. 8 లక్షలు సంపాంచినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఫోక్ సింగర్ రాము రాథోడ్, నటుడు సాయి శ్రీనివాస ఇద్దరికి బిగ్ బాస్ రెమ్యూనరేషన్ ఒకేలా ఉంది.
కానీ, సాయి శ్రీనివాస వైల్డ్ కార్డ్ గా రావడంతో తక్కువ వారాలు ఉన్నాడు. దాని వల్ల సాయి శ్రీనివాస కంటే రాము రాథోడ్ దాదాపుగా రూ. 10 లక్షలు ఎక్కువ సంపాదించినట్లు తెలుస్తోంది.
బిగ్ బాస్ హౌస్ నుండి తొమ్మిదో వారంలో రాము రాథోడ్, సాయి శ్రీనివాస నిష్క్రమించారు. వారి రెమ్యూనరేషన్ వివరాలు అభిమానులలో ఆసక్తి రేకెత్తించాయి. రాము ఎక్కువ కాలం ఉండటంతో సాయి కంటే అధిక మొత్తం ఆర్జించినట్లు వెల్లడైంది.


