|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బిగ్ బాస్ 9: కప్పు గెలిచినంతే ఇమ్మాన్యుయేల్ సంపాదన.. లెక్కలు తెలిస్తే షాక్!

Published: 21-12-2025, 6:44 AM
బిగ్ బాస్ 9: కప్పు గెలిచినంతే ఇమ్మాన్యుయేల్ సంపాదన.. లెక్కలు తెలిస్తే షాక్!
  • బిగ్ బాస్ 9 టైటిల్ గెలవని ఇమ్మాన్యుయేల్, టాప్ 3లోనూ లేడు.
  • విన్నర్‌కు ఏమాత్రం తగ్గని భారీ రెమ్యునరేషన్ అందుకున్నాడు.
  • 15 వారాలకు గాను దాదాపు రూ.34 లక్షల రెమ్యునరేషన్ సంపాదించాడు.
  • ఆరంభంలో ఫేవరెట్ అయినా, గేమ్ దూరం కావడంతో ఓటింగ్ తగ్గింది.

బిగ్ బాస్ 9 ముగింపు దశకు చేరుకుంది. విన్నర్ ఎవరు అనే ఉత్కంఠ కొనసాగుతుండగా, ఇమ్మాన్యుయేల్ రెమ్యునరేషన్ వార్త అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కప్పు గెలవకపోయినా, విజేతకు ఏమాత్రం తగ్గకుండా అతను ఎంత సంపాదించాడో తెలుసుకుందాం.

విన్నర్‌కు సమానంగా ఇమ్మాన్యుయేల్ రెమ్యునరేషన్

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ సీజన్ 9 మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ సీజన్ విన్నర్ ఎవరో తెలియబోతుంది. ఆ క్షణం కోసం చాలా మంది అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే టాప్ 2 కూడా సెట్ అయిపోయింది. తనూజ, కళ్యాణ్ మధ్య గట్టి పోటీ నడిచింది. కానీ, వార్ మాత్రం వన్ సైడ్ అయిపొయింది అనే చెప్పాలి. ఇక బిగ్ బాస్ స్టేజి పైకి వచ్చి నాగార్జున చెప్పడం మాత్రమే మిగిలిపోయింది. అయితే, ఓపక్క బిగ్ బాస్ సీజన్ 9 (Bigg Boss 9 Telugu)విన్నర్ ఎవరు అనే చర్చ నడుస్తూ ఉంటే, మరోపక్క ఇమ్మాన్యుయేల్ ఫ్యాన్స్ మాత్రం కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు. విన్నర్ అవ్వాల్సిన ఇమ్మాన్యుయేల్ కనీసం టాప్ 3లో కూడా లేకుండా ఎలిమినేట్ అయ్యాడు అంటూ బాధపడుతున్నారు.

Peddi: పెద్ది షూటింగ్ నుంచి ఫోటోస్ లీక్ .. వైరల్ అవుతున్న రామ్ చరణ్ మాసీ లుక్

ఇమ్మాన్యుయేల్ వారం వారీ, మొత్తం సంపాదన

అయితే, కేవలం గెలువలేదనే మాటే తప్పా రెమ్యునరేషన్ లో మాత్రం విన్నర్ గా ఈక్వల్ గా తీసుకున్నాడట ఇమ్మాన్యుయేల్. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం మేరకు వారానికి రూ.2.25 లక్షల చొప్పున రెమ్యునరేషన్ తీసుకున్నాడట ఇమ్మాన్యుయేల్. మొత్తంగా 15 వారాల పాటు అతను ఆడియన్స్ ను తన ఆటతో ఆకట్టుకున్నాడు. కాబట్టి, 15 వారాలకు గాను మొత్తంగా రూ.34 లక్షల వరకు రెమ్యునరేషన్ గా సంపాదించాడట ఇమ్మాన్యుయేల్. ఇది చాలా ఎక్కువ అనే చెప్పాలి. బిగ్ బాస్ విన్నర్ కి ఇస్తున్న ప్రైజ్ మనీ రూ.50 లక్షలుగా అనౌన్స్ చేశాడు నాగార్జున.

గేమ్ దూరం కావడమే ఓటమికి కారణమా?

ఆలెక్కన చూసుకుంటే విన్నర్ కి ఏమాత్రం తీసిపోకుండా రెమ్యునరేషన్ తీసుకున్నాడు ఇమ్మాన్యుయేల్. ఆ విషయంలో అతను హ్యాపీ అనే చెప్పాలి. నిజానికి, బిగ్ బాస్ సీజన్ 9 మొదలైనప్పుడు ఇమ్మాన్యుయేల్ విన్నర్ అని చాలా మంది అనుకున్నారు. తన కామెడీ సెన్స్ తో చాలా ఎంటర్టైన్ చేశాడు. కానీ, రాను రాను ఆ కామెడీకి దూరం అవుతూ వచ్చాడు. ఆలాగే గేమ్ కి కూడా దూరం అయ్యాడు. అది ఆడియన్స్ కి నచ్చలేదు. అందుకే, ఇమ్మాన్యుయేల్ కి తక్కువగా వోటింగ్ పడింది అనే చెప్పాలి. ఎలాగైతేనేం విన్నర్ కి తగ్గట్టుగా భారీగా రెమ్యునరేషన్ సంపాదించాడు ఇమ్మాన్యుయేల్.

మొత్తానికి, బిగ్ బాస్ 9 టైటిల్ గెలుచుకోకపోయినా, రెమ్యునరేషన్ విషయంలో ఇమ్మాన్యుయేల్ విజేతకు ఏమాత్రం తీసిపోలేదు. భారీ మొత్తంలో సంపాదించి ఆర్థికంగా విజయం సాధించాడు. ఇది అతనికి గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.