
బిగ్ బాస్ తెలుగు 9లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ దివ్య ఎలిమినేషన్ గండంలో పడింది. తనూజను టార్గెట్ చేయడం, భరణిపై ఆధిపత్యం చెలాయించడం ఆమెకు తీవ్ర వ్యతిరేకతను తెచ్చింది. తన ప్రవర్తన మార్చుకోకపోతే వచ్చే వారం ఆమెకు గండం తప్పదని విశ్లేషకులు అంటున్నారు.
Key Points
బిగ్ బాస్ 9లో దివ్య ప్రస్తుతం డేంజర్ జోన్‌లో ఉంది.
తనూజను టార్గెట్ చేయడం, భరణిపై పెత్తనం మైనస్ పాయింట్లుగా మారాయి.
భరణి, తనూజ స్నేహాన్ని దివ్య జీర్ణించుకోలేకపోవడం స్పష్టం.
ఆమె ప్రవర్తనలో మార్పు లేకపోతే వచ్చేవారం ఎలిమినేషన్ ఖాయం.
దివ్యకు ఎలిమినేషన్ గండం?
తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ (Bigg Boss Telugu 9)లో పది మంది మిగిలారు. వారిలో నుంచి ఒకరు (గౌరవ్) ఈరోజు ఎపిసోడ్‌లో ఎలిమినేట్ కానున్నారు. అంటే తొమ్మిది మంది మిగలనున్నారు. వచ్చేవారం వీరందరి కుటుంబసభ్యులు ఇంట్లోకి అడుగుపెట్టనున్నారు. అయితే ఈ వారం డేంజర్ జోన్‌లో నిఖిల్, గౌరవ్‌తో పాటు దివ్య కూడా ఉంది. తాజా ప్రోమోలోనూ అదే చూపించారు.
ఆ రెండింటి వల్లే.. నిఖిల్‌ను నిన్ననే పంపించేయగా నేడు గౌరవ్, దివ్య ( Divya Nikhita )ను నిల్చోబెట్టారు. వీరిలో ఒకరే ఎలిమినేట్ అని నాగ్ ప్రకటించాడు. షూటింగ్ ఆల్‌రెడీ ముగియడంతో వెళ్లిపోయేది గౌరవ్ అని అందరికీ తెలిసిపోయింది. అయితే వైల్డ్ కార్డ్‌గా వచ్చిన దివ్యకు ఓట్లు తక్కువ పడి డేంజర్ జోన్‌లో ఉండటానికి రెండే రెండు కారణాలున్నాయి. ఒకటి తనూజను టార్గెట్ చేయడం, రెండు భరణిపై పెత్తనం చెలాయించడం.
తనూజ, భరణితో వైరం
ఆ గేమ్ కొంప ముంచింది గత వారం కెప్టెన్సీ గేమ్‌లో తనూజను తీసేయనని మాటిచ్చి ఆమెను సైడ్ చేయడంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. నాగార్జున ఎదుట దోషిలా నిలబడాల్సి వచ్చింది. ఇక భరణి ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనేది ఆర్డర్లేస్తోంది. అతడు చేసింది ఏదైనా నచ్చకపోతే చాలు ఒకటే నస పెడుతోంది. ఎపిసోడ్‌లో ఆ సీన్లు కొన్ని ఎత్తేస్తున్నారు కానీ లైవ్ చూసేవాళ్లకు మాత్రం పిచ్చెక్కిపోతోంది.
తనూజపై కుళ్లు? ఈ బంధాల్లో చిక్కుకుని బలైపోయిన భరణి.. తనూజ, దివ్యకు దూరంగా ఉండాలనుకున్నాడు. తనూజ దూరంగానే మెదులుతోంది, కానీ దివ్య మాత్రం ఫెవికాల్‌లా అతుక్కుపోయింది. పైగా ఈ వారం తనూజ కెప్టెన్ అయినప్పుడు భరణి సంతోషంతో ఆమెను ఎత్తుకున్నాడు. అది కూడా చూసి సహించలేకపోయింది దివ్య. నేను కెప్టెన్ అయినప్పుడు ఎందుకు ఎత్తుకోలేదు? అన్న ప్రశ్న లేవనెత్తింది. ఆమె సరదాగా అన్నా, సీరియస్‌గా అన్నా తనకు తనూజ అంటే ఈర్ష్య అని జనాలు బలంగా నమ్మారు.
ఆటతీరు మార్చుకోకుంటే అంతే!
గండం బీబీ రాజ్యంలో కొన్ని సీక్రెట్ టాస్క్‌లు చేసినప్పటికీ ఆ క్రెడిట్ అంతా సుమన్‌కే పోయింది. అయినదానికి, కానిదానికి నోరేసుకుని పడిపోవడం కూడా తనకు మైనస్ అయింది. తన తీరు మార్చుకోకపోతే, మంచి ఎపిసోడ్ పడకపోతే మాత్రం వచ్చేవారం దివ్య ఎలిమినేట్ అవడం ఖాయం. మరి తనను తాను ఎలా కాపాడుకుంటుందో చూడాలి!
దివ్య తన ఆటతీరును, ప్రవర్తనను మార్చుకోకపోతే బిగ్ బాస్ ప్రయాణం ముగియడం ఖాయం. మరి తనను తాను ఎలా నిరూపించుకుని, ప్రేక్షకుల ఆదరణ తిరిగి పొందుతుందో చూడాలి.


