
బిగ్ బాస్ 9 షో గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ సీజన్‌లో భరణి కూడా పాల్గొంటున్నాడు. అతనికి మద్దతుగా నాగబాబు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో నెటిజన్ల నుంచి విభిన్న స్పందనలు వస్తున్నాయి.
Key Points
బిగ్ బాస్ 9 గ్రాండ్ గా ప్రారంభం.
నాగబాబు భరణికి మద్దతు ప్రకటించడం.
భరణికి బిగ్ బాస్ 9 ద్వారా గుర్తింపు లభించే ఆశ.
బిగ్ బాస్ 9 గ్రాండ్ ప్రారంభం
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్ బాస్ తొమ్మిదో సీజన్(Bigg Boss 9) ఆదివారం గ్రాండ్ గా ప్రారంభం అయింది . ఈ సారి కూడా హోస్ట్ గా కింగ్ నాగార్జుననే వ్యవహరించాడు . మొత్తం 15 మంది హౌస్ లోకి వెళ్లారు . సోషల్ మీడియాలో నిన్న మొన్నటిదాక చక్కర్లు కొట్టిన లిస్టులో ఉన్న వాళ్లే .. ఇప్పుడు హౌస్ లోకి అడుగుపెట్టారు . ఇమ్మాన్యుయేల్, రీతూ చౌదరి, తనూజ, సుమన్ శెట్టి, రాము రాథోడ్ , భరణి , శ్రేష్ట వర్మ , సంజనా గల్రానీ , ఆశాశైనీలు సెలబ్రెటీ కంటెస్టెంట్స్ గా వెళ్లగా .. కామనర్స్ గా మాస్క్ మెన్ హరీశ్ , శ్రీజ , మర్యాద మనీష్ , జవాన్ పవన్ కల్యాణ్ , ప్రియా శెట్టి ఎంట్రీ ఇచ్చారు .
ఇప్పటికే వీరంతా సోషల్ మీడియాలో ప్రచారానికి కావాల్సిన ఏర్పాట్లు అన్ని చేసుకున్నారు . ఇన్ స్టాగ్రామ్ , ఎక్స్ ఖాతాలో వరుస పోస్టులతో హోరెత్తిస్తున్నారు. అయితే ఇలా బిగ్ బాస్ షో ప్రారంభం అయిందో లేదో అప్పుడే మెగా బ్రదర్ నాగబాబు ఏడో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన నటుడు భరణికి మద్దతు తెలుపుతూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు .
నాగబాబు మద్దతు
‘నాకు అత్యంత సన్నిహితుడైన భరణి శంకర్ బిగ్‌బాస్ 9 సీజన్‌లోకి అడుగుపెడుతున్న సందర్బంగా ఆయనకు నా శుభాకాంక్షలు. ఈ ప్రయాణం అతడికి విజయాన్ని, మంచి గుర్తింపుని తీసుకురావాలని కోరుకుంటున్నాను’ అంటా నాగబాబు ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు . నాగబాబు పోస్టుపై కొంతమంది నెటిజన్స్ సెటైర్స్ వేస్తున్నారు . ‘ నీ నోటితో అన్నావ్ గా .. ఇక త్వరగానే బయటకు వచ్చేస్తాడులే ’, ‘ నాలుగు వారాల్లో వచ్చేస్తాడు ’, ‘ భరణిని గెలిపించాలని జనసైనిక్స్ కి నాగబాబు టాస్క్ ఇచ్చాడు ’ అంటూ ట్రోల్ చేస్తున్నారు . మరికొంతమంది భరణికి మద్దతుగా పోస్టులు పెట్టారు .
నెటిజన్ల ప్రతిస్పందన
ఇక భరణి విషయానికొస్తే .. అప్పట్లో చిలసౌ స్రవంతి సీరియల్‌తో ఫేమస్ అయ్యాడు . ఆ తర్వాత పలు సినిమాల్లో ప్రతినాయక పాత్రలు కూడా చేశారు. బాహుబలి , ఆవిరి, ధీర, క్రేజీ అంకుల్స్ తదితర చిత్రాల్లో నటించాడు . గతకొంతకాలంగా అటు వెండితెరపై కానీ , ఇటు బుల్లితెరపై కానీ భరణికి సరైన అవకాశాలు రావడం లేదు . బిగ్ బాస్ 9 గుర్తింపు వస్తే .. అవకాశాలు వస్తాయనే ఆశతో హౌస్ లోకి వెళ్లాడు . మరి భరణి ఎన్నిరోజులు హౌస్ లో ఉంటాడో చూడాలి .
నాగబాబు మద్దతుతో భరణి బిగ్ బాస్ ప్రయాణం ఎలా సాగుతుందో చూడాలి. నెటిజన్ల ప్రతిస్పందనలు ఆసక్తికరంగా ఉన్నాయి. భరణికి ఈ షో ద్వారా మంచి అవకాశాలు లభిస్తాయని ఆశిద్దాం.


