
బిగ్ బాస్ 9 ఐదు రోజులు పూర్తయ్యాయి. వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున హౌస్‌మేట్స్‌తో సరదాగా మాట్లాడుతూనే కెప్టెన్ సంజనకు గట్టి ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రోమోలో చూపించిన విషయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
Key Points
బిగ్ బాస్ 9లో కెప్టెన్ సంజనకు నాగార్జున గట్టి ప్రశ్నలు
సంజన-ఫ్లోరా మధ్య విభేదాలు, ఫ్రీ బర్డ్ వ్యాఖ్య వివాదం
హౌస్ మేట్స్ మధ్య గొడవలు, నాగార్జున తనదైన శైలిలో కౌంటర్లు
తొలి వారం ఎలిమినేషన్ గురించి సోషల్ మీడియాలో ఉత్కంఠ
నాగార్జున ప్రశ్నలకు సంజన సమాధానాలు?
బిగ్‌బాస్ 9లో ఐదు రోజులు విజయవంతంగా పూర్తయింది. అలానే వీకెండ్ వచ్చేసింది. దీంతో హోస్ట్ నాగార్జున.. హౌస్‌మేట్స్ ముందుకు వచ్చేశారు. ఓవైపు అందరినీ సరదాగా నవ్విస్తూనే మరోవైపు తనదైన స్టైల్లో కౌంటర్స్ వేశారు. ఈసారి కెప్టెన్ సంజనకి కాస్త గట్టిగానే పంచులు పడ్డాయి. అందుకు సంబంధించిన ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు.
తొలివారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అనే కన్ఫ్యూజన్ సోషల్ మీడియాలో ప్రస్తుతం నడుస్తోంది. మరోవైపు శనివారం ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందా అనేది ప్రోమోతో కాస్త క్లారిటీ ఇచ్చారు. వస్తూవస్తూనే అందరిని పలకరించిన నాగార్జున.. రాము రాథోడ్ బట్టలు ఉతకడం గురించి, ఇమ్మాన్యుయేల్.. హరీశ్‌ని గుండంకుల్ అనడం గురించి పంచులు వేశారు. అలానే సంజన.. ఫ్లోరా రిలేషన్ గురించి కల్పించుకోవడంపైన స్పందించారు.
సంజన-ఫ్లోరా మధ్య గొడవ
రాము రాథోడ్‌కి తన రిలేషన్ టాపిక్ గురించి చెబుతుంటే మధ్యలో వచ్చిన సంజన.. తనని ఫ్రీ బర్డ్ అనడం అస్సలు నచ్చలేదని ఫ్లోరా, నాగార్జునకు కంప్లైంట్ చేసింది. తను చెబుతున్నప్పుడు సంజన మధ్యలో దూరడం కరెక్ట్ కాదనేది ఫ్లోరా వాదన. కానీ సంజన మాత్రం ప్రపంచంలో ఎక్కడైనా సరే ఫ్రీ బర్డ్ అనడం తప్పెలా అవుతుందని అడిగింది. కెప్టెన్ అయిన తర్వాత సంజన.. తనకు కాఫీ ఇవ్వొద్దని హౌస్‌మేట్స్‌తో చెప్పిందని ఫ్లోరా ఆవేదన వ్యక్తం చేసింది.
బిగ్ బాస్ 9లో తొలి వారం ఎలిమినేషన్
అయితే కాఫీ టాపిక్కే రాలేదని సంజన చెప్పింది గానీ మిగతా టీమ్ మేట్స్ మాత్రం సంజన అలానే అనిందని క్లారిటీ ఇచ్చేశారు. బిగ్ బాస్ ఏదీ ఇవ్వకూడదని మిమ్మల్ని మందలించినప్పుడు రాముకి టీ ఇవ్వాలని మీరు ఎలా డిసైడ్ చేశారు? అని సంజనని నాగ్ అడిగాడు. ఇలా అడిగిన అన్ని ప్రశ్నలకు సంజన ఎలాంటి సంజాయిషీ ఇస్తుందో చూడాలి?
బిగ్ బాస్ 9 ప్రోమోలో చూపించిన సంఘటనలు ఆసక్తికరంగా ఉన్నాయి. సంజన ఎలాంటి సమాధానాలు ఇస్తుందో తెలుసుకోవడానికి మనం వేచి చూడాల్సిందే. వీకెండ్ ఎపిసోడ్‌ని ఎదురుచూద్దాం.


