|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Bigg Boss 9: ఒక్క నవ్వుతో దెయ్యమే జడుసుకునే చేసిన రీతూ..

Published: 05-11-2025, 8:55 AM
Bigg Boss 9: ఒక్క నవ్వుతో దెయ్యమే జడుసుకునే చేసిన రీతూ..

బిగ్‌బాస్ 9 హౌస్‌లో దెయ్యాల టాస్క్ అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. రీతూ, తానూజలు ఈ టాస్క్‌లో పాల్గొనగా, రీతూ తన భయాన్ని పక్కనపెట్టి దెయ్యంలా నవ్వింది. గతంలో సోహైల్ లాగే రీతూ కూడా ఈ టాస్క్ తో చర్చనీయాంశంగా మారింది. కెప్టెన్సీ కంటెండర్ల కోసం సీక్రెట్ టాస్క్‌లు కూడా జరుగుతున్నాయి.

Key Points

1

బిగ్‌బాస్ 9లో దెయ్యాల టాస్క్ హౌస్‌మేట్స్‌ను భయపెట్టింది.

2

రీతూ మొదట భయపడినా, చివరికి దెయ్యం నవ్వు నవ్వింది.

4

సుమన్, దివ్య సీక్రెట్ టాస్కులు పూర్తి చేస్తూ కెప్టెన్సీకి పోటీ పడుతున్నారు.

రీతూ దెయ్యాల టాస్క్ లో ఏం చేసింది?

బిగ్‌బాస్‌ ( Bigg Boss Telugu 9 ) హౌస్‌ కొన్నిసార్లు దెయ్యాలకొంపలానూ మారిపోతుంటుంది. ఏమాటకామాట.. దెయ్యం అనగానే అందరికీ గుర్తొచ్చేది సోహైల్‌! భయమనేది మా ఇంటావంటా లేదన్నట్లుగా బిల్డప్‌ ఇచ్చి చీకటి గదిలోకి వెళ్లాడు. తీరా అక్కడ చిన్న వెలుతురు లేకపోగా వింత శబ్ధాలు, ఫ్లాష్‌ లైట్లలో దెయ్యం ఆకారాలు చూసి మామూలుగా జడుసుకోలేదు. ఇప్పుడదే టాస్క్‌ తెలుగు బిగ్‌బాస్‌ తొమ్మిదో సీజన్‌లోనూ రిపీట్‌ అవుతోంది.

గతంలో సోహైల్ ప్రతాపం.. ఇప్పుడు రీతూ?

ఆడపులి.. ఈ మేరకు ప్రోమో కూడా వదిలారు. తనూజ భయంభయంగానే ఆ గదిలోకి వెళ్లి తనకిచ్చిన టాస్క్‌ పూర్తి చేసింది. తర్వాత రీతూ వంతు వచ్చింది. లోపల జాగ్రత్త.. అని సంజనా ధైర్యం చెప్తుంటే.. ఆడపులి ఇక్కడ అని బిల్డప్‌ ఇచ్చింది. తీరా లోపలకు వెళ్లాక ఆ దెయ్యం కాళ్లు పట్టుకోవడమే తక్కువ అన్నట్లుగా మారింది. ఇలా చేస్తే నేను బయటకు పోతా.. అన్న ప్లీజ్‌.. ప్లీజ్‌.. అంటూ వేడుకుంటూనే ఉంది. చివర్లో మాత్రం దెయ్యంలా ఓ నవ్వు నవ్వింది. ఆ నవ్వుకు దెయ్యాలే జడుసుకుని పారిపోవడం ఖాయం! ఈ గేమ్‌లో తనూజ గెలిచినట్లు తెలుస్తోంది. ఇక సుమన్‌, దివ్య ఎవరికీ అనుమానం రాకుండా సీక్రెట్‌ టాస్కులు పూర్తి చేస్తున్నారు. మరి చివరకు ఎవరు కెప్టెన్సీ కంటెండర్లవుతారో చూడాలి!

కెప్టెన్సీ రేసులో ఎవరు? సీక్రెట్ టాస్కులు!

రీతూ తన నవ్వుతో దెయ్యాల టాస్క్‌కు కొత్త ట్విస్ట్ ఇచ్చింది. ఈ భయంకరమైన ఆటలో ఎవరు విజేతగా నిలిచారు, కెప్టెన్సీ కంటెండర్ల జాబితాలో ఎవరు చేరతారో తెలియాలంటే పూర్తి వివరాలు చూడాల్సిందే!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.