|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Bigg Boss Telugu 9: అలాంటి వాళ్ళు కప్ గెలిచినట్లు చరిత్రలో లేదు, ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరిదంటే ?

Published: 06-12-2025, 1:48 PM
Bigg Boss Telugu 9: అలాంటి వాళ్ళు కప్ గెలిచినట్లు చరిత్రలో లేదు, ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరిదంటే ?
  • బిగ్ బాస్ తెలుగు 9 చివరి దశకు చేరుకుంది, ప్రస్తుతం హౌస్‌లో 8 మంది సభ్యులు ఉన్నారు.
  • నాగార్జున వీకెండ్ ఎపిసోడ్‌లో టాస్క్ గొడవలపై రివ్యూ చేసి, భరణి, సుమన్ శెట్టిలను అభినందించారు.
  • కళ్యాణ్ ‘టికెట్ టు ఫినాలే’ గెలుచుకుని తొలి ఫైనలిస్ట్‌గా నిలిచారు.
  • ఎంటర్టైనర్స్ చరిత్రలో గెలవకపోయినా, ఈసారి తాను కప్ గెలుచుకుంటానని ఇమ్మాన్యుయేల్ ధీమా వ్యక్తం చేశారు.

కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ తెలుగు 9 చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం హౌస్‌లో 8 మంది సభ్యులుండగా, టాప్ 5 కోసం ఉత్కంఠ నెలకొంది. నాగార్జున వీకెండ్ రివ్యూ, కళ్యాణ్ టికెట్ టు ఫినాలే విజయం, అలాగే ఇమ్మాన్యుయేల్ కప్ గెలుచుకోవడంపై ధీమా వ్యాఖ్యలు వంటి ముఖ్యాంశాలు ఈ వారం హైలైట్‌గా నిలిచాయి.

నాగార్జున వీకెండ్ రివ్యూ: టాస్క్ గొడవలపై వివరణ

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు 9 చివరి దశకు చేరుకుంది. ఇక హౌస్ లో మరో వారం మాత్రమే ఆట మిగిలి ఉంది. ప్రస్తుతం హౌస్ లో 8 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో టాప్ 5 కి చేరుకునేది ఎవరు అనే ఉత్కంఠ నెలకొంది. కళ్యాణ్, తనూజ, ఇమ్మాన్యుయేల్ లాంటి వారు టాప్ 5 లో కన్ఫర్మ్ అని అభిమానులు నమ్ముతున్నారు.

బిగ్ బాస్ హౌస్ లో 90వ రోజు వీకెండ్ శనివారం కావడంతో నాగార్జున డయాస్ పైకి వచ్చారు. ఏఈ వారం జరిగిన పరిణామాలపై రివ్యూ చేశారు. భరణి, రీతూకి మధ్య జరిగిన టాస్క్ లో.. భరణి ఒక ఆకారం ట్రైయాంగిల్ కాదని గొడవ చేసిన సంగతి తెలిసిందే. దానిపై నాగార్జున రివ్యూ చేశారు. అసలు ట్రైయాంగిల్ అంటే ఏంటి అని భరణి, సంజనలని అడిగారు. అది జస్ట్ తయారు చేసేటప్పుడు చిన్న మిస్టేక్ జరిగింది అని.. అది ట్రైయాంగిల్ అని నాగార్జున తెలిపారు.

కళ్యాణ్ టికెట్ టు ఫినాలే: తొలి ఫైనలిస్ట్

టాస్క్ బాగా ఆడిన భరణి, సుమన్ శెట్టి లని నాగార్జున అభినందించారు. అదే విధంగా తొలి ఫైనలిస్ట్ గా టికెట్ టు ఫినాలే గెలుచుకున్న కళ్యాణ్ ని కూడా అభినందించారు. ఆ తర్వాత నాగార్జున ఒక్కొక్కరిని పిలిచి బిగ్ బాస్ టైటిల్ ఇచ్చి.. దానిని గెలుచుకునేందుకు నీవు ఎందుకు అర్హుడివి అనేది చెప్పాలి అని అడిగారు.

వాళ్ళు చెప్పిన సమాధానం విని ఇతర సభ్యులు థమ్స్ అప్ లేదా డౌన్ ఇవ్వాలి. ఇమ్మాన్యుయేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను హౌస్ లోకి అడుగుపెట్టేటప్పుడు బాగా ఎంటర్టైన్ చేస్తే సులభంగా కప్ గెలవచ్చు అనుకున్నా. కానీ స్టేజ్ పై ఉండి నవ్వించడం వేరు.. హౌస్ లో ఈ కోపాలు, భాదలు, ఏడుపులు ఇన్ని ఎమోషన్స్ మధ్య ఉండి నవ్వించడం వేరు అని తెలుసుకున్నా.

ఇమ్మాన్యుయేల్ ధీమా: ఈసారి కప్ నాదే!

అయినప్పటికీ సక్సెస్ ఫుల్ గా నవ్వించగలిగాను. ఇంతవరకు బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఇంతవరకు ఎంటర్టైన్ చేసే వాళ్ళు గెలవలేదు. ఈసారి మాత్రం కప్ నాదే అని బలంగా నమ్ముతున్నట్లు ఇమ్మాన్యుయేల్ కామెంట్స్ చేశారు. ఇమ్మాన్యుయేల్ చెప్పిన దానికి అందరూ ఏకీభవిస్తూ థమ్స్ అప్ ఇచ్చారు.

బిగ్ బాస్ తెలుగు 9 టైటిల్ పోరు రసవత్తరంగా మారింది. కళ్యాణ్ ఫైనల్ లో ఉండగా, ఇమ్మాన్యుయేల్ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. చరిత్రను తిరగరాస్తూ ఈసారి కప్ ఎవరు గెలుచుకుంటారో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.