|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బిగ్ బాస్ ఓటింగ్‌ టాప్‌లో సీరియల్ హీరోయిన్.. అట్టడుగున కొరియోగ్రాఫర్.. మొదటి వారం ఎలిమినేషన్‌‌కి దగ్గరిగా ఆ ఇద్దరు!

Published: 11-09-2025, 12:27 AM
బిగ్ బాస్ ఓటింగ్‌ టాప్‌లో సీరియల్ హీరోయిన్.. అట్టడుగున కొరియోగ్రాఫర్.. మొదటి వారం ఎలిమినేషన్‌‌కి దగ్గరిగా ఆ ఇద్దరు!

బిగ్ బాస్ తెలుగు 9 షో ప్రారంభమైంది. మొదటి వారం నామినేషన్స్ తర్వాత ఓటింగ్ ప్రక్రియ జరిగింది. ఈ ఓటింగ్‌లో సీరియల్ హీరోయిన్ తనూజ గౌడ టాప్‌లో ఉండగా, కొందరు సభ్యులు ఎలిమినేషన్‌కు దగ్గరగా ఉన్నారు.

Key Points

1

ముద్దమందారం హీరోయిన్ తనూజ గౌడ టాప్ ఓటింగ్‌లో!

2

కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ అట్టడుగున!

4

బిగ్ బాస్ తెలుగు 9 లో ఉత్కంఠభరిత పోటీ!

బిగ్ బాస్ తెలుగు 9 మొదటి వారం ఓటింగ్

బిగ్ బాస్ తెలుగు 9 రియాలిటీ షో గ్రాండ్‌గా సెప్టెంబర్ 7న ప్రారంభమైంది. బిగ్ బాస్ 9 తెలుగు హౌజ్‌లోకి 9 మంది సెలబ్రిటీలు, ఆరుగురు కామనర్స్‌తో కలిపి మొత్తంగా 15 మంది ఇంటి సభ్యులుగా అడుగుపెట్టారు. వీరిలో సెలబ్రిటీలుగా తనూజ గౌడ (తనూజ పుట్టస్వామి), ఫ్లోరా సైని, ఇమ్మాన్యుయెల్, భరణి శంకర్, రీతూ చౌదరి, రాము రాథోడ్, సంజన గల్రాని, శ్రేష్టి వర్మ, సుమన్ శెట్టి ఉన్నారు.

అలాగే, బిగ్ బాస్ తెలుగు 9 అగ్ని పరీక్ష ద్వారా ఆరుగురు సెలెక్ట్ అయ్యారు. వారిలో హరిష్ హరిత, సోల్జర్ కల్యాణ్ పడాల, డిమోన్ పవన్, శ్రీజ దమ్ము, ప్రియా శెట్టి, మర్యాద మనీష్ ఉన్నారు. ఇక మొదటి వారం వీరందరికి నామినేషన్స్ ప్రక్రియ నిర్వహించారు. పేరుకు మొదటి వారం అయిన బాగానే వాడీ వేడీగా బిగ్ బాస్ తెలుగు 9 ఫస్ట్ వీక్ నామినేషన్స్ జరిగాయి.

అయితే, ఈ నామినేషన్స్‌ను కేవలం సెలబ్రిటీల్లో మాత్రమే చేయాలని బిగ్ బాస్ రూల్ పెట్టాడు. సెలబ్రిటీలు టెనెంట్స్‌గా, కామనర్స్ ఓనర్స్‌గా ఉంటున్న విషయం తెలిసిందే. కాబట్టి, ఎవరు సరిగా పని చేయట్లేదో, రెంట్ లేని టెనెంట్‌గా ఉండే అర్హత ఎవరికి లేదో చెబుతూ నామినేట్ చేయాల్సిందిగా బిగ్ బాస్ తెలిపాడు. దాంతో సెలబ్రిటీల్లో 8 మంది నామినేట్ అయ్యారు.

టాప్‌లో తనూజ, అట్టడుగున శ్రేష్టి

తర్వాత కొన్ని ట్విస్టులతో కామనర్స్ నుంచి డిమోన్ పవన్ మొదటి వారం నామినేట్ అయ్యాడు. అలా మొత్తంగా బిగ్ బాస్ 9 తెలుగు మొదటి వారం 9 మంది నామినేట్ అయ్యారు. వీరికి ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయ్యాయి. సెప్టెంబర్ 10న నామినేషన్స్ అనంతరం బిగ్ బాస్ తెలుగు 9 మొదటి వారం ఓటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది.

ఈ ఓటింగ్‌లో ముద్ద మందారం సీరియల్ హీరోయిన్ తనూజ గౌడ టాప్ 1లో దూసుకుపోతోంది. తనూజకు 5,727 ఓట్లతో 23.57 శాతం ఓటింగ్ నమోదు అయింది. ఆమె తర్వాత సైలెంట్‌గా ఉంటున్న కమెడియన్ సుమన్ శెట్టి రెండో స్థానంలో దూసుకుపోతున్నాడు. సుమన్‌కు 5,290 ఓట్లతో 21.77 శాతం ఓటింగ్ పడింది.

అలాగే, వరుసగా మూడో స్థానంలో ఇమ్మాన్యుయెల్ 16.83 శాతం (4,090 ఓట్లు), 4వ ప్లేసులో డీమోన్ పవన్ 10.18 శాతం (2,474 ఓట్లు), ఐదో స్థానంలో సంజన గల్రాని 8.6 శాతం (2,089 ఓట్లు), 6వ ప్లేసులో రాము రాథోడ్ 7.35 శాతం (1,786 ఓట్లు), 7వ స్థానంలో రీతూ చౌదరి 6.66 శాతం (1,619 ఓట్లు) ఓటింగ్ నమోదు అయింది.

ఎలిమినేషన్‌కు దగ్గరగా ఎవరు?

ఇక చివరి రెండు స్థానాల్లో హీరోయిన్ ఫ్లోరా సైనీ, కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ ఉన్నారు. ఫ్లోరా 2.89 శాతం ఓటింగ్, 701 ఓట్లతో 8వ స్థానం దక్కించుకోగా, శ్రేష్టి 2.14 శాతం ఓటింగ్, 519 ఓట్లతో అట్టడుగున 9వ ప్లేసులో నిలిచింది. అంటే, మొదటి వారం ఎలిమినేషన్‌కు దగ్గరిగా ఫ్లోరా, శ్రేష్టి ఇద్దరు ఉన్నారు.

ఈ వారం పూర్తయ్యేసరికి ఇలాగే ఓటింగ్ కొనసాగితే వీరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. లేదా పర్ఫామెన్స్ బాగుండి ఓట్లు పడితే ఓటింగ్ మారే ఛాన్స్ కూడా ఉంది.

మొదటి వారం ఓటింగ్ ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. తనూజ గౌడకు అత్యధిక ఓట్లు రాగా, ఫ్లోరా మరియు శ్రేష్టి ఎలిమినేషన్‌కు దగ్గరగా ఉన్నారు. వచ్చే వారం ఏం జరుగుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.