
బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ తొమ్మిదో వారం ఉత్కంఠగా సాగుతోంది. మిడ్ వీక్‌కు చేరుకున్న ఈ వారం ఓటింగ్‌లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ముగ్గురు కంటెస్టెంట్స్‌కు ఎలిమినేషన్ గండం పొంచి ఉంది. మరి ఎవరు సేఫ్ అవుతారు, ఎవరు హౌస్ వీడతారో తెలుసుకోవాలంటే, ఈ కథనాన్ని చదవండి.
Key Points
బిగ్ బాస్ తెలుగు 9వ వారం మిడ్ వీక్‌కు చేరుకోగా, ఓటింగ్‌లో అనూహ్య మార్పులు వచ్చాయి.
ఈ వారం ఓటింగ్‌లో సీరియల్ హీరోయిన్ తనుజ పుట్టస్వామి రెండో స్థానానికి పడిపోగా, కల్యాణ్ పడాల టాప్‌లోకి వచ్చారు.
సుమన్ శెట్టి, రాము రాథోడ్, సాయి శ్రీనివాస్‌కు ఎలిమినేషన్ గండం పొంచి ఉంది.
గేమ్‌లో ప్రభావం చూపలేకపోతున్న సాయి శ్రీనివాస్ ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
బిగ్ బాస్ 9వ వారం ఓటింగ్‌లో అనూహ్య మార్పులు
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ దెయ్యాలు, అరుపులు, టాస్క్‌లతో జోరుగా సాగుతోంది. ఇక బిగ్ బాస్ తెలుగు 9 తొమ్మిదో వారం మిడ్ వీక్‌కు వచ్చేసింది. అయితే, ఈ మిడ్ వీక్ బిగ్ బాస్ ఓటింగ్‌లో స్థానాలు తారుమారు అయిపోయాయి. ముగ్గురికి ఎలిమినేషన్ గండం ఉండనుంది. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ కానున్నారో ఇక్కడ తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ తొమ్మిదో వారం మధ్యలోకి వచ్చేసింది. హౌజ్‌లో దెయ్యాలు, బిగ్ బాస్ టాస్క్‌లు, ఫోన్ కాల్స్‌తో ఆడుకోవడాలు, అరుపులు, వాగ్వాదాలతో జోరుగా సాగుతోంది ఈ సీజన్. అయితే, బిగ్ బాస్ 9 తెలుగు తొమ్మిదో వారం మిడ్ వీక్ రానే వచ్చింది. ఈ వారం కూడా ఒకరు ఎలిమినేట్ కానున్నారు.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 9 లో 14 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వారికి బిగ్ బాస్ 9 తెలుగు 9వ వారం నామినేషన్స్ నిర్వహించారు. ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స్‌లో ఏడుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు.
ఎలిమినేషన్ గండంలో ముగ్గురు కంటెస్టెంట్స్
ఎప్పుడు బిగ్ బాస్ ఓటింగ్ లో టాప్ 1లో వచ్చే సీరియల్ హీరోయిన్ తనూజ పుట్టస్వామి ఈ వారం మాత్రం రెండో ప్లేసులోకి వెళ్లిపోయింది. టాప్ 1లోకి కల్యాణ్ పడాల వచ్చేశాడు. అతను బిగ్ బాస్ ఈ వారం ఓటింగ్‌లో 27.26 శాతం ఓటింగ్, 15,637 ఓట్లతో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు.
చివరివి అయిన టాప్ 6, 7 స్థానాల్లో వరుసగా తెలుగు కమెడియన్ సుమన్ శెట్టి (10.53 శాతం ఓటింగ్, 6,037 ఓట్లు), ఫోక్ సింగర్ రాము రాథోడ్ (5.52 శాతం ఓటింగ్, 3,164
ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు?
ఓట్లు) ఉన్నారు. వీరిలో చివరి మూడు స్థానాల్లో ఉన్న సాయి శ్రీనివాస్, సుమన్ శెట్టి, రాము రాథోడ్‌కు ఎలిమినేషన్ గండం ఉంది. ఈ ముగ్గురిలో ఎవరైనా ఈ వారం బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది.
కాబట్టి వీకెండ్ వచ్చేసరికి సుమన్ శెట్టి సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక గేమ్ పరంగా పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోతున్న నటుడు సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలా రాము రాథోడ్, సాయి శ్రీనివాస్ ఇద్దరికి ఎక్కువగా ఈ వారం బిగ్ బాస్‌లో ఎలిమినేషన్ గండం ఉందని చెప్పొచ్చు.
బిగ్ బాస్ తెలుగు 9వ వారం ఎలిమినేషన్ ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. ఓటింగ్‌లో వచ్చిన మార్పులు, కంటెస్టెంట్స్ ప్రదర్శన ఆధారంగా సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీకెండ్ ఎపిసోడ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


