|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బిగ్‌బాస్‌ విన్నర్‌ ఇంటిపై కాల్పులు.. ఎన్‌కౌంటర్‌లో నిందితుడు అరెస్ట్‌

Published: 22-08-2025, 12:11 AM
బిగ్‌బాస్‌ విన్నర్‌ ఇంటిపై కాల్పులు.. ఎన్‌కౌంటర్‌లో నిందితుడు అరెస్ట్‌

హిందీ బిగ్ బాస్ ఓటీటీ విజేత ఎల్విష్ యాదవ్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కానీ, పోలీసులు ఎన్‌కౌంటర్‌లో ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు.

Key Points

1

హిందీ బిగ్ బాస్ ఓటీటీ విజేత ఎల్విష్ యాదవ్ ఇంటిపై కాల్పులు జరిగాయి.

2

సుమారు 24 బుల్లెట్లు ఇంటిలోకి దూసుకెళ్లాయి.

4

నిందితుడు నీరజ్ ఫరీద్ పురియా ముఠాతో సంబంధం కలిగి ఉన్నాడని పోలీసులు తెలిపారు.

ఎల్విష్ యాదవ్ ఇంటిపై కాల్పులు

హిందీ బిగ్‌బాస్‌ ఓటీటీ సీజన్‌-2 విజేత ఎల్విష్‌ యాదవ్‌ (Elvish Yadav) ఇంటిపై కొద్దిరోజుల క్రితం గుర్తు తెలియని ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. సుమారు 24 బుల్లెట్లు ఆయన ఇంటిలోకి దూసుకెళ్లాయి.  ఆ సమయంలో ఎల్విష్‌ యాదవ్‌ ఇంట్లో లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే, తాజాగా ఆ కాల్పులకు తెగబడిన వారిలో ఒకరిపై పోలీసులు ఎన్‌కౌంటర్‌ జరిపారు.

ఎన్‌కౌంటర్‌లో నిందితుడి అరెస్ట్

గురుగ్రామ్‌లో ఉన్న ఎల్విష్‌ యాదవ్‌ ఇంటిపై కాల్పులకు పాల్పడింది ఇషాంత్ అలియాస్ ఇషు గాంధీ (19)గా పోలీసులు గుర్తించారు. ఫరీదాబాద్‌లోని జవహర్ కాలనీకి చెందిన నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో అతని సమాచారం అందడంతో అతని కదలికలపై నిఘా పెట్టారు. నీరజ్ ఫరీద్ పురియా ముఠాతో అతనికి సంబంధం ఉందని పోలీసులు గుర్తించారు. ఆ గ్యాంగ్‌లోని కొందరిని కలిసేందుకు ఇషాంత్‌ వెళ్తుండగా పోలీసులు వెంబడించారు.

నీరజ్ ఫరీద్ పురియా ముఠాతో సంబంధం

దీంతో పోలీసు బృందంపై ఆటోమేటిక్ పిస్టల్‌తో ఇషాంత్‌ కాల్పులు జరిపాడు. ఆ సమయంలో పోలీసుల టీమ్‌ కూడా అతని కాలిపై గన్‌తో కాల్చడంతో కిందపడిపోయాడు. గాయాలతో ఉన్న ఇషాంత్‌ను అరెస్ట్‌ చేసి ఆసుపత్రికి తరలించారు. ఆపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నారు.

పోలీసుల ఎన్‌కౌంటర్‌లో నిందితుడి అరెస్ట్‌తో ఈ కేసుకు ఒక మలుపు వచ్చింది. ఇషాంత్‌కు సంబంధించిన ముఠా సభ్యుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.