
📌 Key Points
- వరుణ్ ధావన్ మెట్రో రైలు హ్యాండిల్స్‌పై వ్యాయామాలు చేస్తూ వీడియో వైరల్.
- మెట్రో ఆస్తులకు నష్టం కలిగితే జరిమానా లేదా జైలు శిక్ష విధిస్తామని మెట్రో రైల్వేస్ హెచ్చరిక.
- సెలబ్రిటీలు చేసే పనులను యువత అనుసరించే ప్రమాదం ఉందని నెటిజన్ల అభిప్రాయం.
- ప్రభుత్వ ఆస్తులను ఉపయోగించేటప్పుడు బాధ్యతగా ఉండాలని నెటిజన్ల సూచన.
బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ మెట్రో రైలులో చేసిన పనికి మెట్రో అధికారులు సీరియస్ అయ్యారు. ఆయన మెట్రో హ్యాండిల్స్‌పై వ్యాయామాలు చేస్తూ కనిపించడంతో ఇది వివాదానికి దారితీసింది. దీనిపై అధికారులు ఎలా స్పందించారో చూద్దాం.
వరుణ్ ధావన్ మెట్రోలో ఏం చేశారంటే?
Bollywood:మెట్రో రైలు అంటే ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే వాహనం.. ఎంతో మంది ప్రతి రోజు మెట్రోలో ప్రయాణిస్తూ వుంటారు. కానీ మన బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ (Varun Dhawan) కు మాత్రం అది జిమ్ సెంటర్‌లా అనిపించినట్లుంది..మెట్రో కోచ్‌లో ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన హ్యాండిల్స్‌ను పట్టుకుని ఆయన పుల్-అప్స్ తీస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతోంది. ఇంత పెద్ద హీరో ఇలా చేయటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. బాధ్యత అనేది సామాన్య ప్రజల నుండి హీరోల వరకు అందరికి వుండాలి. ఇక ఈ విన్యాసాల పట్ల మహా ముంబై మెట్రో సీరియస్‌గా స్పందిస్తూ అందరికీ ఒక బహిరంగ హెచ్చరిక జారీ చేసింది. అసలు ఏం జరిగిందంటే..
సినిమా ప్రమోషన్లలో భాగంగానో లేదా సరదాగానో వరుణ్ ధావన్ మెట్రో హ్యాండిల్స్‌ను జిమ్ బార్లలా వాడుతూ కసరత్తులు చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో మెట్రో అధికారులు రంగంలోకి దిగారు. మెట్రో రైల్వేస్ వారు మెట్రో ఆస్తులకు ఇబ్బంది కలిగించినా లేదా ప్రయాణికులకు అసౌకర్యం కలిగించినా భారీ జరిమానాలు ఉంటాయని స్పష్టం చేశారు. ఒకవేళ పరిస్థితి తీవ్రంగా ఉంటే జైలు శిక్ష కూడా తప్పదని హెచ్చరించారు. నియమాలు అందరికీ ఒకటేనని, హీరోలు కూడా వీటికి అతీతులు కారని అధికారులు తేల్చి చెప్పారు.
ఈ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు మిశ్రమంగా స్పందించినప్పటికీ, మెజారిటీ ప్రజలు మెట్రో అధికారుల నిర్ణయాన్ని స్వాగతించారు. సెలబ్రిటీలను మిలియన్ల మంది ఫాలో అవుతుంటారని, వారు ఇలాంటి పనులు చేస్తే యువత తప్పుగా వారినే అనుసరించే అవకాశం ఉందని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ఇలాంటి విన్యాసాలు చేయడం వల్ల ప్రభుత్వ ఆస్తులు దెబ్బతినడమే కాకుండా, తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని వారు అభిప్రాయపడ్డారు. సెలబ్రిటీలు ఆదర్శంగా ఉండాలని కోరుతూ మెట్రో అధికారుల ధైర్యాన్ని మెచ్చుకున్నారు నెటిజన్స్.
మెట్రో అధికారుల సీరియస్ హెచ్చరిక!
చివరిగా చెప్పేదేంటంటే, మెట్రో అనేది మనందరి సౌకర్యం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజా ఆస్తి. అక్కడ చేసే ప్రతి పని పౌర బాధ్యతతో కూడి ఉండాలి. వరుణ్ ధావన్ లాంటి అగ్ర నటుడికి ఈ విషయం తెలియదని కాదు, కానీ సరదాగా చేసే ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు చట్టపరమైన ఇబ్బందులకు దారితీస్తాయి. నియమాలను గౌరవించడం అనేది మన సమాజ లక్షణం. కాబట్టి ప్రయాణాల్లో సరదాలు హద్దు దాటకుండా ఉంటేనే అందరికీ క్షేమం.
వరుణ్ ధావన్ సినిమాల విషయానికి వస్తే.. వరుణ్ ధావన్ ఎవరో కాదు ప్రముఖ దర్శకుడు డేవిడ్ ధావన్ కుమారుడు. చివరిగా సన్నీ సంస్కారికి తులసీ కుమారి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన.. ఇక ఇప్పుడు బార్డర్ 2 సినిమాతో జనవరి 23న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
This video should have come with a disclaimer like the ones in your action movies, @Varun_dvn – Do Not Try This On Maha Mumbai Metro
నెటిజన్ల స్పందన ఎలా ఉంది?
We get it, it is cool to hang out with friends inside our metros but those grab handles are not for hanging.
Acts like these are punishable… pic.twitter.com/XiCP8OF8wT
— Maha Mumbai Metro Operation Corporation Ltd (@MMMOCL_Official) January 26, 2026
మెట్రో మనందరి సౌకర్యం కోసం ఉద్దేశించబడిన ప్రజా ఆస్తి. కాబట్టి, దానిని గౌరవించడం మన బాధ్యత. సెలబ్రిటీలు సైతం బాధ్యతగా మెలగాలని గుర్తుంచుకోవాలి.


