|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Bomb Movie Review: రెండు ఊళ్ళను కలిపిన మరణం

Published: 19-10-2025, 7:46 AM
Bomb Movie Review: రెండు ఊళ్ళను కలిపిన మరణం

ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న తమిళ చిత్రం ‘బాంబ్’ రివ్యూతో మీ ముందుకు వచ్చాం. ఇది అంచనాలకు అందని ఒక వినూత్న కథాంశం. రెండుగా విడిపోయిన గ్రామాలను ఒక మరణం ఎలా కలిపిందనేది ఈ సినిమాలోని ప్రధానాంశం. దీపావళికి చూడదగిన అద్భుతమైన చిత్రం ఇది.

Key Points

1

'బాంబ్' తమిళ చిత్రం ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్‌ అవుతోంది.

2

ఇది క్రైమ్ థ్రిల్లర్ కాదు, ప్రేక్షకుల అంచనాలకు అందని అద్భుతమైన కథాంశం.

4

దీపావళికి తప్పకుండా చూడదగిన, ఆహ్లాదకరమైన ఓటీటీ సినిమా.

‘బాంబ్’ సినిమా: అంచనాలకు అందని కథాంశం

ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్‌ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతున్న వాటిలో తమిళ చిత్రం ‘బాంబ్‌’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం. ఆలోచన… ఓ అణువంత ఆలోచన కూడా పరమాణువంత ఫలితాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. ఇక ఇదే ఆలోచనకు సృజనాత్మకత తోడైతే వెండితెరకు ప్రేక్షకులు పూర్తిగా కట్టుబడిపోతారు. అదే పంథాలో విడుదలైన సినిమా ‘బాంబ్‌’(Bomb Movie Review). ఈ టైటిల్‌ చూసి ఇదేదో ఫక్తు క్రైమ్‌ థ్రిల్లర్‌ అనుకునేరు! అస్సలు కానే కాదు. ఈ సినిమా ప్రేక్షకుడి అంచనాలకు ఏమాత్రం అందదు. అందుకే ఈ సినిమా ఆలోచన ఓ అద్భుతం. మణికందన్, అభిషేక్‌తోపాటు విశాల్‌ వెంకట్‌ అందించిన ఈ కథను విశాల్‌ వెంకట్‌ దర్శకత్వం వహించి దృశ్య కావ్యంగా మలిచిన విధానం అభినందనీయం. అంతలా ఈ ‘బాంబు’లో ఏముందో ఓసారి చూద్దాం.

రెండు ఊళ్లను కలిపిన అద్భుత మరణం

కాలకమ్మాయిపట్టి అనే ఊరు పెద్ద గాలివాన సమయంలో ఓ బండ పగలడం వల్ల కాలపట్టి, కమ్మాయిపట్టి అని రెండు గ్రామాలుగా విడిపోతుంది. బండ పగిలి ఒకటి చిన్న ముక్కగా, మరొకటి పెద్ద ముక్కగా… రెండు వేరు వేరు ప్రాంతాలలో పడడం వల్ల ఆ ఊరులోని జనాల మధ్య భేదాభ్రిపాయాలు రగిలి రెండు ఊళ్ళుగా విడిపోతారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఆ ఊరు ముక్కలవడంతో ఊరిలో పాటించే కట్టుబాట్లతో పాటు జరగబోయే పండగ పబ్బాలు కూడా కళ తప్పుతాయి.

దీపావళికి తప్పక చూడాల్సిన చిత్రం

ఊరు కలిసున్నప్పటి నుండి ఉంటున్న కదిరవన్‌ అనే వ్యక్తి రెండుగా విడిపోయిన ఊరుని చూసి బాధతో ఉన్నట్టుండి చని΄ోతాడు. కదిరవన్‌నే అంటిపెట్టుకుని ఉండే స్నేహితుడైన మణిముత్తు మాత్రం తను చని΄ోలేదనే వాదిస్తుంటాడు. దానికి తోడు చని΄ోయిన కదిరవన్‌ శరీరం నుండి అ΄ానవాయువు వింత వింత శబ్దాలతో ఇంకా వస్తూనే ఉంటుంది. ఇంతలో కదిరవన్‌ శరీరాన్ని ఊరు మధ్యలో ఉన్న ఓ కుర్చీలో శవంగా కూర్చోపెడతారు. చని΄ోయిన కదిరవన్‌ శరీరం విడి΄ోయిన రెండు గ్రామాలను ఎలా కలుపుతుందనేది మాత్రం ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమ్‌ అవుతున్న ‘బాంబ్‌’ సినిమాలోనే చూడాలి. రాబోయే దీ΄ావళికి చెవులు దద్దరిల్లే శబ్దాలతో ఎన్నో బాంబులు మన చెవులను అదరగొడతాయి. కానీ ఈ సినిమా బాంబు మాత్రం మీ అంచనాలకు అందకుండా ఆహ్లాదపరుస్తుంది. కాబట్టి మీ దీ΄ావళి బాంబులతో ΄ాటు ఈ ‘బాంబు’ను కూడా ఓసారి చూసేయండి. వర్త్‌ టు వాచ్‌ ఫర్‌ దిస్‌ దివాలి. – హరికృష్ణ ఇంటూరు

మొత్తం మీద ‘బాంబ్’ సినిమా ఒక వినూత్న అనుభూతిని పంచుతుంది. ఇది మీ అంచనాలకు అందకుండా ఆహ్లాదపరుస్తుంది. ఈ దీపావళికి బాణసంచాతో పాటు ఈ ‘బాంబు’ను కూడా ఓసారి చూసేయండి. వర్త్ టు వాచ్!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.