
📌 Key Points
- సన్నీ డియోల్ నటనకు నెటిజన్లు ఫిదా! దేశభక్తి ఉట్టిపడేలా అద్భుతమైన యాక్షన్ సీన్స్!!
- 1971 ఇండో-పాక్ యుద్ధ నేపథ్యం! గూస్ బంప్స్ తెప్పించే సన్నివేశాలతో ‘బోర్డర్ 2’ మూవీ!!
- ట్విట్టర్ లో సూపర్ హిట్ టాక్! ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్స్ సినిమాకు హైలైట్ అంటున్నారు నెటిజన్లు!!
- 1997లో వచ్చిన బోర్డర్ సినిమాకు సీక్వెల్! ఈ చిత్రం భారత త్రివిధ దళాలకు ఘన నివాళి!!
సన్నీ డియోల్ హీరోగా నటించిన ‘బోర్డర్ 2’ మూవీ విడుదలైంది. ఈ సినిమాకు సంబంధించిన ట్విట్టర్ రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా ఎలా ఉందో చూద్దాం!
ట్విట్టర్ లో ‘బోర్డర్ 2’ మూవీ రివ్యూ!
అనురాగ్ సింగ్ దర్శకత్వంలో 1971 నాటి ఇండో-పాక్ యుద్ధ నేపథ్యంలో రూపొందిన ‘బార్డర్ 2’ మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది. బ్రిలియంట్ మూవీ అని నెటిజన్లు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. సన్నీ డియోల్ యాక్టింగ్ వేరే లెవల్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
దేశభక్తి భావంతో గూస్ బంప్స్ తెప్పించే మూవీ.. మన భారత త్రివిధ దళాల సత్తాను చాటే సినిమా.. మొత్తంగా బ్రిలియంట్ ఫిల్మ్.. ఇదీ బోర్డర్ 2 మూవీపై నెటిజన్ల ట్విటర్ రివ్యూ. సన్నీ డియోల్ హీరోగా నటించిన ఈ వార్ యాక్షన్ డ్రామా అదిరిపోయిందనే కామెంట్లు వస్తున్నాయి. మూవీ సూపర్ అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
దేశభక్తి సినిమాలో సన్నీ డియోల్ అదరగొట్టాడు!
‘‘మాస్ కోసం ఒక పర్ఫెక్ట్ బిగ్-స్క్రీన్ ఎక్స్పీరియన్స్. ప్రామిస్ చేసినట్లుగా ఇది దేశభక్తి – భావోద్వేగం – యాక్షన్ – గూస్‌బంప్స్ ను సరిగ్గా అందిస్తుంది. శక్తివంతమైన డైలాగ్స్ & విజిల్ కొట్టే క్షణాలతో బోర్డర్ 2 వారసత్వాన్ని సజీవంగా ఉంచుతుంది’’ అని ఒక నెటిజెన్ అన్నారు.
‘బోర్డర్ 2’ మూవీకి సూపర్ హిట్ టాక్!
1997లో వచ్చిన బోర్డర్ సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు బోర్డర్ 2 రిలీజైంది. అప్పుడు జేపీ దత్తా డైరెక్షన్ లో వచ్చిన వార్ డ్రామా మూవీ బోర్డర్ మూవీ ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో ఐకానికి చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
బోర్డర్ 2 మూవీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.


