
బ్రహ్మముడి నవంబర్ 20 ఎపిసోడ్‌లో రాహుల్ పవర్స్ కోసం కావ్య, స్వప్నల మధ్య చిచ్చు పెడతాడు. ఆఫీస్‌లో రాజ్‌కు, కావ్యకు మధ్య అధికారంపై శృతితో వాగ్వాదం జరుగుతుంది. మరోవైపు ఇంట్లో అపర్ణ, సుభాష్ పెళ్లి చూపుల సందడిలో కళావతి, అక్క మధ్య గొడవతో ఆసక్తికరంగా మారింది.
Key Points
రాహుల్ కుట్రతో ఆఫీస్‌కు వచ్చిన స్వప్న, కావ్య పనితీరు చూస్తుంది.
కావ్యపై స్వప్న కోపం, ఆఫీస్‌లో శృతితో వాగ్వాదం.
రాజ్, కావ్య చేతుల్లోని అధికారాలు లాక్కోవడానికి రాహుల్ పక్కా స్కెచ్.
ఇంట్లో అపర్ణ, సుభాష్ పెళ్లి చూపుల హడావిడి, కళావతితో గొడవ.
రాహుల్ కుట్రలు: కావ్య, స్వప్న మధ్య చిచ్చు
బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 20 ఎపిసోడ్‌లో రాహుల్ ఆఫీస్‌కు వెళ్తాడు. ఫైల్స్ అన్ని రాజ్ చూశాడని, రాహుల్‌ను కేవలం సంతకం మాత్రం పెట్టమంటుంది శ్రుతి. డిజైన్స్ కూడా కావ్య చూసిందని మేనేజర్ చెబుతాడు. దాంతో స్వప్నను ఆఫీస్‌కు వచ్చేలా చేసిన రాహుల్ అదంతా చూసేలా చేస్తాడు. దాంతో స్వప్వ వెళ్లి కావ్యతో గొడవ పడుతుంది.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రాహుల్ ఆఫీస్‌కు వెళ్తాడు. కానీ, అక్కడ అన్ని ఫైల్స్ రాజ్ ముందే చూసి ఉంటాడు. కేవలం రాహుల్‌ను మాత్రం సైన్ చేయమని శ్రుతి చెబుతుంది. అంటే నేను ఏ ఫైల్ చూడాల్సిన అవసరం లేదా అని రాహుల్ అంటాడు.
తర్వాత మేనేజర్ దగ్గరికి వెళ్లి డిజైన్స్‌లో కరెక్షన్స్ చెప్పానుగా ఏమైంది అని రాహుల్ అడుగుతాడు. కావ్య మేడమ్ మొత్తం చూసి ఎలాంటి కరెక్షన్స్ అవసరం లేదు. క్లైంట్స్‌కు అలాగే నచ్చాయని చెప్పారు. మాన్యుఫాక్చరింగ్‌కు కూడా పంపించామని మేనేజర్ చెబుతాడు. దాంతో రాహుల్ వెళ్లి నా చేతికి పవర్స్ రావాలంటే స్వప్నకు తెలియాల్సిందే అని కాల్ చేస్తాడు.
అధికారాలు లాక్కోవడానికి రాహుల్ ప్లాన్
భోజనం పేరు చెప్పి స్వప్న ఆఫీస్‌కు లంచ్ క్యారేజ్ తీసుకొచ్చేలా చేస్తాడు రాహుల్. మరోవైపు అపర్ణ, సుభష్ పెళ్లి చూపుల హడావిడి నడుస్తుంటుంది. సుభాష్ వాళ్లు వస్తారు. మావిచిగురు సినిమాలోని పాటతో పెళ్లి చూపుల తంతు కానిస్తారు. మరోవైపు ఆఫీస్‌లో రాహుల్‌కు స్వప్న వడ్డిస్తుంది. రాహుల్ మారడం గురించి స్వప్న ఎమోషనల్‌గా చెబుతుంది.
మీ సైన్ కావాలి అని శ్రుతి అంటుంది. ఈ ఫైల్ కూడా నేను చూడక్కర్లేదా అని రాహుల్ అంటే.. చెప్పానుగా సర్ మీరు ఏ ఫైల్ స్టడీ చేయనక్కర్లేదు. అన్ని ఫైల్స్ రాజ్ సర్ చెక్ చేశారు అని శ్రుతి చెబుతుంది. అలా అయితే ఎలా, రేపు ఏదైనా తప్పు జరిగితే రాజ్, కావ్యకు నేను ఏం సమాధానం చెప్పాలని రాహుల్ అంటాడు. అవన్నీ మేము చూసుకుంటాం కదా సర్. మీరు హ్యాపీగా టైమ్ పాస్ చేసి వెళ్లండి అని శ్రుతి అంటుంది.
టైమ్ పాస్ చేయడమేంటీ. ఇది మన కంపెనీ అని రాహుల్ అంటాడు. సర్ రాజ్ సర్ చేయమన్నారు, చెప్పమన్నారు చెబుతున్నాం అని శ్రుతి అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్. బాధ్యతలు ఇచ్చి కేవలం సైన్ చేయమని ఎలా అంటారు అని శ్రుతితో స్వప్న గొడవ పడుతుంది. మేము ఉద్యోగులం. రాజ్ సర్ ఇంట్లో ఉండే ఫైల్స్ అన్ని చూస్తున్నారు అని శ్రుతి చెబుతుంది.
ఇంట్లో పెళ్లి చూపులు: కళావతి గొడవ
తర్వాత మేనేజర్ వచ్చి కూడా డిజైన్స్ కరెక్షన్స్ అన్ని కావ్య మేడమ్ చేస్తారు. మీ దాకా ఏది రాదు. మీరు జస్ట్ సైన్ చేస్తే చాలు అని మేనేజర్ అని వెళ్లిపోతాడు. పవర్స్ వాళ్ల చేతిలో పెట్టుకుని పెన్ నీకు ఇస్తే ఏంటీ. ఎక్కడ తేల్చుకోవాలో అక్కడే తేల్చుకుంటా అని స్వప్న వెళ్లిపోతుంది. ఇదే ఆవేశం మెయింటేన్ చేయు. అప్పుడేగా నేను అనుకుంది జరుగుతుంది అని రాహుల్ అనుకుంటాడు.
మరోవైపు కట్నం గురించి రుద్రాణి మాట్లాడుతుంది. అంతా రుద్రాణిని తిడతారు. ఏ యావరేజ్ అపర్ణను లేచి నడవమని ఆర్డర్ వేస్తుంది రుద్రాణి. నేను లేవను, పెళ్లి కొడుకు చెల్లి, గోడ మీద బల్లి. ఛాన్స్ దొరికింది కదా అని రెచ్చిపోకు అని అపర్ణ అంటుంది. ఇంతలో స్వప్న వస్తుంది.
ఈ ఎపిసోడ్‌లో రాహుల్ తన ప్లాన్స్‌తో కావ్య, స్వప్నలకు కొత్త సవాళ్లు విసరగా, ఇంట్లో పెళ్లి చూపుల నేపథ్యంలో కళావతి గొడవలు ఆసక్తి రేపాయి. రాబోయే ఎపిసోడ్‌లలో ఎలాంటి మలుపులు వస్తాయో చూడాలి.


