
బ్రహ్మముడి సీరియల్‌లో ఆగస్టు 15న ప్రసారమైన 801వ ఎపిసోడ్‌లో రుద్రాణి, యామిని, రాజ్ ప్రధాన పాత్రలు పోషించాయి. వరలక్ష్మీ వ్రతం నేపథ్యంలో వారి ప్రయత్నాలు, పన్నాగాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి.
Key Points
రుద్రాణి కావ్య గర్భం గురించి కొత్త ప్లాన్ వేస్తుంది.
వరలక్ష్మీ వ్రతంలో రాజ్ పాల్గొనడానికి ఇందిరాదేవి ప్రయత్నిస్తుంది.
యామిని, రాజ్ కళావతిని పొందేందుకు ప్రయత్నిస్తారు.
రేవతి కొడుకు స్వరాజ్, రాజ్‌ను ఇంటికి రప్పించడంలో కీలక పాత్ర పోషిస్తాడు.
రుద్రాణి కొత్త పన్నాగం
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే శుక్రవారం (ఆగస్టు 15) 801వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఇంట్లో వరలక్ష్మీ వ్రతం కోసం రాజ్ ను రప్పించడం, అటు యామినికి రుద్రాణి ఫోన్ చేసి కావ్య ప్రెగ్నెన్సీ గురించి చెప్పడం, ఇద్దరూ కొత్త ప్లాన్ వేయడంలాంటి సీన్స్ కనిపిస్తాయి.
స్వరాజ్ ద్వారా రాజ్‌ను రప్పించే ప్లాన్
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ రేవతితో అపర్ణ మాట్లాడే సీన్ తోనే మొదలవుతుంది. స్వరాజ్ లాంటి కొడుకు ఉండటం మీ అదృష్టం అని రేవతితో అపర్ణ అంటుంది. ఫోన్ పెట్టేసిన తర్వాత రాజ్ ను ఇంటికి రప్పించడానికి స్వరాజ్ మంచి అవకాశం అని ఇందిరాదేవి, అపర్ణ అనుకుంటారు. కానీ స్వరాజ్ అడ్రెస్ రాజ్ కు తెలియదు కదా అని అపర్ణ అంటుంది. దీంతో నాకు తెలుసు అని నోరు జారిన ఇందిరాదేవి తర్వాత కవర్ చేసుకుంటుంది.
యామినికి రుద్రాణి ఫోన్.. కొత్త ప్లాన్
మరోవైపు యామినికి రుద్రాణి ఫోన్ చేసి కావ్య ప్రెగ్నెంట్ అనే విషయం చెబుతుంది. దీంతో యామిని ఎంతో ఆనందంతో ఈ విషయాన్ని బావకు చెప్పి తనవైపు తిప్పుకుంటానని అంటుంది. కానీ రుద్రాణి తొందరపడొద్దని వారిస్తుంది. ఆమెకు కొత్త ప్లాన్ చెబుతుంది.
కావ్య కడుపుతో ఉన్న విషయం నువ్వు చెప్పించడం కంటే కావ్య నోటితోనే చెప్పించాలని అంటుంది. అప్పూ ప్రెగ్నెంట్ అని ఇంట్లో వరలక్ష్మీ వ్రతం చేయిస్తున్నారని, అప్పుడు ధాన్యలక్ష్మిని రెచ్చగొట్టి కావ్యపైకి ఉసిగొల్పితే ఆమె ఎమోషనలైపోయి తాను ప్రెగ్నెంట్ అనే విషయం చెబుతుందని అంటుంది. ప్లాన్ బాగుంది.. వర్కౌట్ చేయమని యామిని అంటుంది.
వరలక్ష్మీ వ్రతం
అటు రాజ్ కు ఇందిరాదేవి ఫోన్ చేస్తుంది. ఏం చేస్తున్నావని అడిగితే.. నీ మనవరాలిని ఎలా గెలుచుకోవాలా అని అటుఇటు తిరుగుతూ ఆలోచిస్తున్నానని అంటాడు. ఆ అవకాశం ఇప్పుడు వచ్చిందని, ఇంట్లో వరలక్ష్మీ వ్రతం చేయిస్తున్నారని, నువ్వు రేవతి కొడుకు స్వరాజ్ ను తీసుకొని ఇంటికి రమ్మని చెబుతుంది. దీంతో రాజ్ చాలా సంతోషిస్తాడు.
అదే సమయంలో యామిని అతని మాటలు విని అతని దగ్గరికి వస్తుంది. కళావతికి దగ్గరయ్యే మరో అవకాశా తనకు దక్కిందని యామినితో రాజ్ అంటాడు. ఇంకా ఎన్నాళ్లు బావ ఇలా అవకాశాల కోసం చూస్తావు.. పర్మినెంట్ గా ఆమెను సొంతం చేసుకోవా అని అడుగుతుంది. అంతేకాదు కళావతికి ఆ ఇల్లు వదిలి ఇక్కడికి వచ్చే ఇష్టం లేకే నీ ప్రేమను రిజెక్ట చేసిందేమో అని అంటుంది. అలా అయితే తానే అక్కడికి వెళ్లి ఉండటానికి కూడా సిద్ధమని, అదే తేల్చుకుంటానని రాజ్ అంటాడు.
కావ్యకు మరోసారి క్లాస్ పీకిన అపర్ణ
ఇటు ఇంట్లో కావ్య వంట చేయడం చూసి అపర్ణ మరోసారి మండిపడుతుంది. పనులు చేయొద్దని చెప్పాను కదా అంటుంది. దేవుడుకి నైవేద్యం చేస్తున్నానని, ఇదేమీ పని కాదని కావ్య చెబుతుంది. దేవుడిపై భక్తి ఉంటే వంట కాదు పూజలు చేయమని అపర్ణ అంటుంది.
అప్పూతోపాటు నువ్వు కూడా వరలక్ష్మీ వ్రతంలో కూర్చోవాలని అనడంతో కావ్య షాక్ తింటుంది. భర్తతో అక్షింతలు వేయించుకోకుండా ఎలా అని అడుగుతంది. అవన్నీ తాము చూసుకుంటామని, ముందు వెళ్లి రెడీ అవ్వమని కావ్యను పంపిస్తారు అపర్ణ, ఇందిరాదేవి.
ధాన్యలక్ష్మిని రెచ్చగొట్టడానికి ట్రై చేసిన రుద్రాణి
రాజ్ మరియు యామిని ప్రయత్నాలు
ధాన్యలక్ష్మిని రెచ్చగొట్టే తన ప్లాన్ ను రుద్రాణి మొదలుపెడుతుంది. పూజ దగ్గర ఏర్పాట్లు చేస్తున్న ధాన్యలక్ష్మి దగ్గరికి వచ్చి కిచెన్ దగ్గరికి తీసుకెళ్తుంది రుద్రాణి. అక్కడ అప్పూ వంట చేస్తుండటం చూసి ఆమెను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తుంది. చూశావా.. నీ కోడలు కడుపుతో ఉన్నా ఆమెతోనే పని చేయిస్తున్నారు.. కావ్య కావాలనే ఇలా చేస్తోంది..
అప్పూ కడుపుతో ఉందని తెలిసిన తర్వాతే కావ్య ఇంట్లో పని చేయదని అపర్ణ చెప్పింది.. అంటే కావాలనే చెల్లిపై అసూయతోనే ఇలా చేస్తున్నట్లు కదా.. తన కంటే ముందు ఆమె ప్రెగ్నెంట్ అయిందన్న అక్కసుతోనే కావ్య ఇలా చేస్తుందని రుద్రాణి ఏవేవో చెబుతుంది. అయినా ధాన్యలక్ష్మి మాత్రం సహనం కోల్పోదు. ఇప్పుడేంటి నీ మాటలు విని నేను కావ్యతో వెళ్లి గొడవ పెట్టుకోవాలి.. అంత టైమ్, ఓపిక లేదు అని ధాన్యం అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
పూజ కోసం రెడీ అవుతున్న కావ్య.. తన కడుపులో బిడ్డతో మాట్లాడుతూ నీ గురించి నాన్నకు చెప్పలేకపోతున్నానని, తనను క్షమించాలని అంటుంది. అప్పుడే కనకం వస్తుంది. నువ్వు ఎప్పుడు వచ్చావని అడిగితే.. వరలక్ష్మీ వ్రతం అని తెలిసి వచ్చానని అంటుంది. అంటే మీరందరూ ముందే ప్లాన్ చేసుకున్నారా అని తల్లిని కావ్య నిలదీస్తుంది.
నీతోనూ పూజ చేయించి, అల్లుడితో నీపై అక్షింతలు వేయించే పని కూడా తామే చేస్తామని అనడంతో ఆమెపై కావ్య మండిపడుతుంది. మళ్లీ ఏం ప్లాన్ చేశారని, ఇలాంటివి చేయొద్దని వారిస్తుంది. అదంతా తాము చూసుకుంటామని, నువ్వు వెళ్లి పూజలో కూర్చో అని చెప్పి పంపిస్తుంది.
అటు స్వరాజ్ ను తీసుకొని ఇంటికి వస్తాడు రాజ్. అతన్ని చూడగానే ఏమీ తెలియనట్లు షాక్ తిన్నట్లుగా నటించాలని అపర్ణకు చెబుతుంది ఇందిరాదేవి. ఇంట్లో ఏంటీ హడావిడి అని రాజ్ అడుగుతాడు. వరలక్ష్మీ వ్రతం చేస్తున్నామని అనడంతో అందరూ చేస్తున్నారా, అయితే కళావతి కూడా చేస్తుందా అని రాజ్ అంటాడు. అందుకే కదా నిన్ను పిలిపించింది అని ధాన్యలక్ష్మి నోరు జారుతుంది.
ఏదోలా అందరూ కవర్ చేస్తారు. అటు కావ్య రెడీ అయి కిందికి దిగి వస్తుండటంతో రాజ్ ఆమెను అలా చూస్తుండిపోతాడు. అంతటితో ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది. తన ప్లాన్ వర్కౌట్ కాకపోవడంతో స్వరాజ్ అస్త్రంగా కావ్య ప్రెగ్నెన్సీని బయటపెట్టడానికి రుద్రాణి మరో ప్లాన్ వేసినట్లు రేపటి ఎపిసోడ్ ప్రోమోలో చూపించారు.
చివరిగా, రుద్రాణి ప్లాన్‌లోని ట్విస్టులు, రాజ్, యామిని ప్రయత్నాలు, మరియు రేవతి కొడుకు పాత్ర ఈ ఎపిసోడ్‌ను ఆసక్తికరంగా మార్చాయి. కథ ఎలా సాగుతుందో వేచి చూడాలి.


