|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్రహ్మముడి ఆగస్ట్ 1 ఎపిసోడ్: స్వరాజ్ ఈ ఇంటి బిడ్డే అని చెప్పిన ఇందిరాదేవి.. అందరూ షాక్.. రుద్రాణితో ఆడుకున్న బుడ్డోడు

Published: 31-07-2025, 9:47 PM
బ్రహ్మముడి ఆగస్ట్ 1 ఎపిసోడ్: స్వరాజ్ ఈ ఇంటి బిడ్డే అని చెప్పిన ఇందిరాదేవి.. అందరూ షాక్.. రుద్రాణితో ఆడుకున్న బుడ్డోడు

ఆగస్టు 1న ప్రసారమైన బ్రహ్మముడి ఎపిసోడ్‌లో, ఇందిరాదేవి స్వరాజ్ గురించి ఒక షాకింగ్ వార్తను వెల్లడించింది. రుద్రాణి స్వరాజ్‌తో ఆడుకుంటుంది. కావ్య, రాజ్ ప్రేమకథ కూడా ఆసక్తికరంగా సాగుతోంది.

Key Points

1

ఇందిరాదేవి స్వరాజ్ గురించి షాకింగ్ వార్త చెప్పింది!

2

రుద్రాణి స్వరాజ్‌తో ఆడుకున్న విధానం ఆసక్తికరంగా ఉంది.

4

బ్రహ్మముడి సీరియల్ ట్విస్టులతో ఉత్కంఠను పెంచుతోంది.

ఇందిరాదేవి షాకింగ్ వెల్లడి

బ్రహ్మముడి సీరియల్ ఈరోజు (ఆగస్ట్ 1) 789వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. దుగ్గిరాల ఇంట్లో రేవతి కొడుకు మెల్లగా అందరికీ దగ్గరవుతుంటాడు. అదే సమయంలో వాడు ఎవడో ఇందిరా దేవి చెప్పేస్తుంది. అయితే అనుకోకుండా ఆమె నోరు జారడం, దానిని కవర్ చేయడానికి కావ్య తంటాలు పడటంలాంటి సీన్లతో ఈ ఎపిసోడ్ అంతా రక్తి కట్టింది.

బ్రహ్మముడి సీరియల్ శుక్రవారం (ఆగస్ట్ 1) ఎపిసోడ్ కావ్య కు రాజ్ ప్రపోజ్ చేయబోతుండగా మొదలైంది. నిన్ను నిన్ను అని అంటుండగా ప్రకాష్ వస్తాడు. దీంతో రాజ్ కంగారు పడుతూ వెళ్లిపోతాడు. వాడు నీ భర్తే కదా మళ్లీ ఇదేంటని అడుగుతాడు. ఆయనకు గతం గుర్తు లేదు కదా.. మీరు ఇలా మరచిపోయి ఆయన ముందు ఈ విషయం చెప్పారంటే ఇక అంతే అని కావ్య అంటుంది.

అటు స్వరాజ్ అపర్ణ దగ్గరికి పడుకోవడానికి వెళ్తాడు. తనకు కథ చెప్పాలంటాడు. ఆమె రాజు, ఏడు చేపల కథ మొదలుపెట్టేసరికి అది చిన్నప్పటి నుంచీ వింటున్నానని, వేరే ఏదైనా చెప్పాలని ఆట పట్టిస్తాడు. ఆమె ఓ భయపెట్టే కథ చెప్పి అతన్ని నిద్ర పుచ్చుతుంది.

మరుసటి రోజు ఉదయం మొక్కలు నీళ్లు పడుతుంటాడు స్వరాజ్. అతన్ని పైనుంచి చూస్తూ అసలు వీడు ఎవడు? ఒకవేళ తప్పి పోయి ఉంటే అక్కడే పోలీసులకు అప్పగించి ఉండొచ్చు కదా? ఇంటి వారసుడిలా చూసుకుంటున్నారు? వీడెవడో వాన్నే అడిగి తెలుసుకుందామంటూ స్వరాజ్ దగ్గరికి వెళ్తుంది రుద్రాణి . అయితే స్వరాజ్ మాత్రం ఆమెతో ఆడుకుంటాడు.

రుద్రాణి మరియు స్వరాజ్ మధ్య ఆటలు

మొదట చాక్లెట్ ఇచ్చి మచ్చిక చేసుకోవాలని చూస్తుంది. చాక్లెట్ తీసుకున్న తర్వాత రుద్రాణి అడిగిన ప్రశ్నలకు అతడు సరిగా సమాధానం చెప్పడు. దీంతో రుద్రాణి ఆ పిల్లాడిని తిడుతుంది. స్వరాజ్ కోపంతో తన చేతుల్లో ఉన్న నీళ్ల పైపుతో ఆమెను తడిపేస్తాడు. రుద్రాణి అతనిపై చేయి చేసుకోబోగా.. అపర్ణ వచ్చి ఆమెను తిట్టి పంపిస్తుంది.

అటు రాజ్ వచ్చి ప్రపోజ్ చేస్తాడంటూ కావ్య అతనికి ఇష్టమైన రంగు చీర కట్టుకొని ముస్తాబవుతూ ఉంటుంది. ఈలోపు ఇందిరాదేవి అక్కడికి వస్తుంది. ఏంటి మనవరాలా అంతలా ముస్తాబవుతున్నావ్.. మా మనవడితో కలిసి ఎక్కడికైనా వెళ్తున్నావా అని అడుతుంది. లేదు అమ్మమ్మ.. ఆయన ఇవాళ నాకు ప్రపోజ్ చేస్తా అన్నారు, ఆయన అలా చేయగానే నేను ఓకే చెప్పేద్దామని అనుకుంటున్నాను అని కావ్య చెబుతుంది.

అప్పుడే అక్కడికి అపర్ణ కూడా స్వరాజ్ తో కలిసి వస్తుంది. ఇప్పటికైనా గుడ్ న్యూస్ చెప్పావు.. నా కల నెరవేరబోతోంది.. చాలా సంతోషంగా ఉంది అని అంటుంది. ఈ విషయం ముందే చెబితే క్వింటాలు కొబ్బరికాయలు చెప్పేదాన్ని కదా అనగానే.. ఎందుకు అని ఇందిరాదేవి అంటుంది. నీ తలపై కొట్టడానికంటూ స్వరాజ్ గడుసుగా అంటాడు. తనకు టిఫిన్ పెట్టమని అడుగుతాడు.

దీంతో అపర్ణ అతన్ని తీసుకొని వెళ్లిపోతుంది. ఆ ఇద్దరినీ చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందని ఇందిరాదేవి కావ్యతో అంటుంది. ఇప్పుడే ఇంత ప్రేమగా చూసుంకుంటుందంటే రేపు అతన్ని తన మనవడిగా అంగీకరిస్తే ఇంకెంత బాగా చూసుకుంటుందో, దేవుడి దయ వల్ల వీళ్లు త్వరగా కలిసిపోవాలని ఆమె అంటుంది.

కావ్య మరియు రాజ్ ప్రేమకథ

అటు ఆ స్వరాజ్.. రేవతి కొడుకు అని తెలుసుకొని కల్యాణ్ షాక్ తింటాడు. ఈ విషయం పెద్దమ్మకు తెలిస్తే ఇంకా ఏమైనా ఉందా అంటూ అప్పూతో అంటాడు. దీంతో ఆమె జరిగిన విషయం చెబుతుంది. అతడు గుడిలో తప్పిపోలేదని, అలా కావ్య అక్క, రాజ్ బావ చేశారని అంటుంది. మొన్న బర్త్ డే పార్టీకి వచ్చి కలిసిపోవాలని రేవతి చూసిందని, కానీ అత్తయ్య అవమానించి పంపడంతో ఇలా ముందుగా ఆమె కొడుకుని అత్తయ్యకు దగ్గర చేయాలని చూస్తున్నారని చెబుతుంది. అయినా కల్యాణ్ కంగారు పడతాడు.

వాడు రేవతి అక్క కొడుకని తెలియక నిన్నంతా వాడితోనే ఉన్నానని, ఈ విషయం తెలిస్తే నేను కూడా మీ ప్లాన్ లో భాగమని పెద్దమ్మ అనుకుంటుందని అంటాడు. అయితే స్వరాజ్ ను తిరిగి పంపించడంలో నీ సాయం కావాలని, అత్తయ్యకు ఏదో ఒకటి చెప్పి తన వెంట రాకుండా చేయాలని కల్యాణ్ ను అప్పూ అడుగుతంది. అతడు మాత్రం ఇందులో తనను ఇరికించొద్దంటూ వెళ్లిపోతాడు.

అందరూ టిఫిన్ చేస్తూ ఉంటారు. అక్కడికి స్వరాజ్ వచ్చి తన కుర్చీలో కూర్చున్న కల్యాణ్ వైపు సీరియస్ గా చూస్తాడు. ఏంట్రా బుడ్డోడా అలా చూస్తున్నావంటాడు. నువ్వు నా కుర్చీ కబ్జా చేశావని అతడు అనగానే అతడు షాక్ తింటాడు. స్వరాజ్ కు సుభాష్ కూడా సపోర్ట్ చేస్తాడు. ఎక్కడ కేసు వేద్దామని అడుగుతాడు. దీంతో కల్యాణ్ భయపడి వద్దురా బాబు.. నీ చెయిర్ లో నువ్వు కూర్చో అని లేస్తాడు.

అప్పుడే అక్కడికి అపర్ణ, ఇందిరా దేవి రాగానే.. నీ ఫ్రెండ్ మమ్మల్ని రెండు నిమిషాల పాటు భయపెట్టాడు.. వీడు చాలా ఇంటెలిజెంట్ అని అపర్ణతో ప్రకాష్ అంటాడు. వాడు ఇంటెలిజెంట్ రా మరి, ఈ ఇంటి బిడ్డ కదా అని ఇందిరాదేవి అనడంతో అందరూ షాక్ తింటారు. వెంటనే కావ్య కవర్ చేస్తూ.. అత్తయ్య ఫ్రెండ్ కాబట్టి అమ్మమ్మ అలా అన్నదని అంటుంది. అయినా రుద్రాణిలో మాత్రం అనుమానం మొదలవుతుంది. వీడికి, ఈ ఇంట్లో వాళ్లకు ఏమైనా సంబంధం ఉందా అని ఆలోచిస్తుండగా.. ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

బ్రహ్మముడి సీరియల్‌లోని ట్విస్టులు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. స్వరాజ్‌ నిజస్వరూపం తెలియడం, కావ్య, రాజ్ ప్రేమకథ ఎలా సాగుతుందో చూడటానికి మరిన్ని ఎపిసోడ్ల కోసం ఎదురు చూద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.