
బ్రహ్మముడి సీరియల్ 805వ ఎపిసోడ్ లో అనేక ట్విస్టులున్నాయి. రుద్రాణి రాజ్ కు కావ్య గర్భవతి అని చెప్పడం, రామ్ కళావతిని ప్రశ్నించడం వంటివి ఈ ఎపిసోడ్ హైలైట్స్. రాజ్ ఏం చేస్తాడో చూడాలి.
Key Points
రుద్రాణి రాజ్ కు కావ్య గర్భవతి అని చెప్పింది.
రామ్ కళావతిని నిలదీశాడు.
రాజ్ అమెరికా వెళ్ళే నాటకం ఆడాడు.
కావ్య గర్భవతి అనే వార్త
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 805వ ఎపిసోడ్ ఎన్నో ట్విస్టులతో సాగిపోయింది. ఈ సీరియల్ ను ఓ కీలకమైన మలుపు తిప్పేందుకు ఈ ఎపిసోడ్ బీజం వేసింది. కావ్య గురించి రాజ్ అసలు నిజం తెలుసుకునే టైమ్ వచ్చేసింది. ఇక ఆ తర్వాత ఏం జరగనుందో అన్న ఆసక్తిని ప్రేక్షకుల్లో రేపింది.
బ్రహ్మముడి సీరియల్ బుధవారం (ఆగస్టు 20) ఎపిసోడ్ కావ్య దగ్గరికి వెళ్లి ధాన్యలక్ష్మి క్షమాపణ అడగడంతో మొదలవుతుంది. నీ గురించి నిజం తెలియక నానా మాటలు అన్నానని, తనను క్షమించమని కావ్య ను అడుగుతుంది. పెద్దవారు, తెలియక అన్నారు.. మీరు క్షమాపణ అడగడం ఏంటని కావ్య అంటుంది. నీది చాలా గొప్ప మనసు కావ్య అని కూడా ప్రశంసిస్తుంది.
కానీ నీ పరిస్థితి ఎవరికీ రావద్దని, నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసి భర్త, ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఇలా మధనపడటం చూస్తే చాలా బాధేస్తోందని అంటుంది. నిన్ను అనరాని మాటలు అన్నందుకు తనకు ఏ శిక్ష వేసినా భరిస్తానని ధాన్యలక్ష్మి అనడంతో.. అప్పూని ఎలా చూస్తున్నారో తననూ అలా చూడమని కావ్య అంటుంది. దీంతో ఆమెను ధాన్యలక్ష్మి దగ్గరికి తీసుకుంటుంది.
వాళ్లను అలా చూసి రుద్రాణి ఓర్వలేకపోతుంది. ఏదో అనుకుంటే మరేదో అయిందని కుళ్లుకుంటుంది. మనం ఎన్ని చేసినా చివరికి కావ్యకే మంచి జరుగుతోందని రాహుల్ అంటాడు. ఇక లాభం లేదు.. రాజ్ కు కావ్య ప్రెగ్నెంట్ అనే విషయం చెప్పమని యామినిని అడగాల్సిందే. ఆమెకే ఫోన్ చేస్తానని రుద్రాణి అంటుంది.
అటు కావ్య తనను ఎందుకు రిజెక్ట్ చేసిందో తెలుసుకోవాలంటే తాను ఓ నాటకం ఆడాల్సిందే అని రాజ్ తనలో తాను అనుకుంటాడు. అమెరికా వెళ్లిపోతున్నట్లు చెబితే ఆమె పరుగెత్తుకుంటూ వస్తుందని, అప్పుడు తనను రిజెక్ట్ చేయడానికి కారణమేంటో నిలదీస్తానని తనకు తాను చెప్పుకుంటాడు. వెంటనే తన ఫ్రెండ్ కు ఫోన్ చేసి అమెరికాకు ఓ టికెట్ బుక్ చేయమని చెబుతాడు. పాస్‌పోర్ట్, వీసా కావాలి కదా అని ఆ ఫ్రెండ్ అనడంతో.. అది నిజంగా వెళ్లే వారికి, తనలా డ్రామా ఆడేవారికి కాదని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు.
రామ్ మరియు కళావతి మధ్య తగాదా
అటు యామినికి రుద్రాణి ఫోన్ చేసి కావ్యను ధాన్యలక్ష్మి క్షమించిన విషయం చెబుతుంది. దీంతో ఆమె షాక్ తింటుంది. ఇక లాభం లేదని, రాజ్ కు కావ్య ప్రెగ్నెన్సీ విషయం చెప్పమని అంటుంది. ఆ విషయం కావ్య నోటితోనే చెప్పించాలని అన్నారు కదా.. మళ్లీ ఇప్పుడు నన్ను చెప్పమంటున్నారేంటి అని యామిని అడుగుతుంది. దానికి సమయం లేదు.. ఆలోపు రాజ్ కు అసలు విషయం తెలిసి వాళ్లు కలిసిపోతే ఎప్పటికీ విడదీయలేమని రుద్రాణి అనడంతో యామిని సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది.
రాజ్ కు అసలు నిజం చెప్పడానికి యామిని వెళ్తుండగా.. అతని ఫోన్ కు ఓ మెసేజ్ వస్తుంది. అది చూసి బావ అమెరికా వెళ్లడానికి టికెట్ బుక్ చేసుకున్నాడేంటని అనుకుంటుంది. అప్పుడే అతడు రావడంతో తనకు చెప్పకుండా ఎందుకు వెళ్తున్నావని నిలదీస్తుంది. అటు యామిని తల్లిదండ్రులు కూడా రాజ్ ను నిలదీస్తారు. తనది డ్రామా అని చెబితే కావ్యకు అసలు విషయం తెలిసిపోతుందని అనుకున్న రాజ్.. నిజంగానే తాను వెళ్లిపోతున్నానని, కావ్య తన ప్రేమను రిజెక్ట్ చేసిన తర్వాత ఇక ఇక్కడ ఉండటం అనవసరమని అంటాడు.
కావ్యను ఇరికించిన రుద్రాణి
రాజ్ అమెరికా వెళ్తున్న విషయం రుద్రాణికి యామిని ఫోన్ చేసి చెబుతుంది. దీంతో ఆమె ఇంట్లో రచ్చ చేస్తుంది. అందరి ముందే కావ్యను ఇరికిస్తుంది. నీవల్లే రాజ్ ఇప్పుడు దూరంగా అమెరికాకు వెళ్లిపోతున్నాడని చెబుతుంది. దీంతో అందరూ షాక్ తింటారు. మళ్లీ ఏం జరిగిందని కావ్యను నిలదీస్తారు. నిన్న ఆయన మరోసారి పెళ్లి ప్రస్తావని తెస్తే.. తాను ఇంట్లో నుంచి దూరంగా వెళ్లిపోతానని అన్నట్లు కావ్య చెబుతుంది.
రాజ్ యొక్క నాటకం
రాజ్‌ను ఆపమని కావ్యపై ఒత్తిడి
రాజ్ ఎవరి మాటా వినడని, నువ్వు మాత్రమే అతన్ని ఆపగలవని కావ్యతో అంటారు ఇంట్లో వాళ్లు. అందరూ ఆమెనే నిందిస్తూ వెంటనే వెళ్లి రాజ్ ను ఆపాలని ఒత్తిడి చేస్తారు. కానీ తాను ఏం చెప్పి తనను ఆపాలి.. ప్రెగ్నెంట్ అని ఎలా చెప్పను.. అతడు దూరంగా వెళ్లినా.. అక్కడైనా పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడన్న ఆనందంతో ఉంటాను.. ఈ నిజం తాను బతికున్నంత కాలం తనకు చెప్పను అని కావ్య స్పష్టం చేసి వెళ్లిపోతుంది.
ఇక లాభం లేదు.. కావ్య అసలు విషయం చెప్పదు.. ఇలా వదిలేస్తే రాజ్ వెళ్లిపోతాడు.. తామే అతనికి కావ్య గురించి చెప్పేద్దాం పద అంటూ అపర్ణ, ఇందిరా బయలుదేరుతారు. రాజ్ అమెరికా వెళ్లిపోతున్నాడు.. తర్వాత యామినిని కూడా అక్కడికే పంపించేస్తే ఈ సామ్రాజ్యాన్ని తామే ఏలుకోవచ్చని రాహుల్ తో రుద్రాణి అంటుంది.
అటు రాజ్ అమెరికా వెళ్లడానికి సిద్ధమవుతాడు. యామిని, ఆమె తల్లిదండ్రులు వారిస్తున్నా వినడు. కావ్య కోసం ఎదురుచూస్తుంటాడు. ఈలోపు రుద్రాణి అక్కడికి వచ్చి రాజ్ కు కావ్య ప్రెగ్నెంట్ అనే విషయం చెబుతుంది. దీంతో రాజ్ షాక్ తింటాడు. అంతలో కావ్య కూడా వచ్చి మీకో విషయం చెప్పాలని అనగానే నువ్వు ప్రెగ్నెంటా అని ఆమెను నిలదీస్తాడు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
చివరికి కావ్య ప్రెగ్నెన్సీ విషయం రాజ్ కి తెలిసిపోతుందా? ఈ ట్విస్ట్ తో బ్రహ్మముడి సీరియల్ మరింత ఆసక్తికరంగా మారింది.


