
బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 23 ఎపిసోడ్ లో అనేక ఉత్కంఠభరిత సంఘటనలు చోటుచేసుకున్నాయి. రాజ్‌ను యామిని మద్యపానం చేయించడం, రామ్ రోడ్డు మీద పడటం, కావ్య గర్భం వంటివి ఈ ఎపిసోడ్‌లో ప్రధానంగా చూపించారు.
Key Points
రాజ్‌ను యామిని తాగుడుకు బానిసను చేస్తుంది.
రామ్ రోడ్డు మీద పడుకున్నాడు.
ఇందిరాదేవి, అపర్ణ కావ్యను ఓదారుస్తారు.
యామిని యొక్క కుట్ర
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కావ్య ప్రెగ్నెంట్ అని తెలియడంతో రాజ్ బాధపడుతుంటాడు. మరోవైపు కావ్య కూడా ఏడుస్తూ ఉంటుంది. వాళ్లిద్దరు మధ్య జరిగింది ఒకరికొకరు గుర్తు చేసుకుంటారు. మరోవైపు నాకు మాత్రం చాలా రిలాక్స్‌డ్‌గా ఉందని రాహుల్‌తో రుద్రాణి అంటుంది. కానీ, ఇంట్లో వాళ్లు నిన్ను అంటుంటే గిల్టీగా ఉందని రాహుల్ అంటాడు.
దున్నపోతు మీద వాన పడినట్లు దులిపేసుకోవాలని రుద్రాణి అంటుంది. రాజ్ ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి రాడు. ఇక ఆస్తిని దక్కించుకోడానికి ప్లాన్ వేయాలి. రాజ్ ఇంటికి రాడు. రాజ్ వస్తే కావ్య కడుపుకు కారణం ఎవరో చెప్పాలి. కావ్య చచ్చిన చెప్పదు. ఇక ఆస్తి మనకే అని రుద్రాణి అంటుంది. మరుసటి రోజు ఉదయం కావ్య దగ్గరికి ఇందిరాదేవి, అపర్ణ వెళ్తారు.
ఇందులో నీ తప్పేం లేదని ఇద్దరు కావ్యను ఓదార్చుతారు. ఇద్దరు తినమంటారు. నాకు ఆకలి ఎలా వేస్తుందని కావ్య అంటుంది. నీ కడుపులో ఉన్న బిడ్డకోసం ఆకలి వేస్తుంది. నీకు పుట్టబోయే బిడ్డకోసం తినాలి. వాడి వారసుడి కోసం తినాలి అని ఇందిరాదేవి అంటుంది. దాంతో ఆయన మీద కోపంతో నా బిడ్డను ఎందుకు పస్తులు ఉంచాలి అని గబగబా తింటుంది కావ్య.
కానీ, ఆగి జరిగింది తలుచుకుని ఏడుస్తుంది కావ్య. మరోవైపు రాజ్‌ను టిఫిన్ చేయమంటే తినకుండా వెళ్లిపోతాడు. యామిని వెళ్లి మాట్లాడుతుంది. కళావతి జ్ఞాపకాల నుంచి ఎలా దూరంగా వెళ్లిపోవాలో తెలియట్లేదు అని రాజ్ అంటాడు. అందుకే నీ బాధ పోగొట్టేందుకు నేను ఒకటి తీసుకొచ్చాను అని చెప్పిన యామిని మందు బాటిల్ ముందు పెడుతుంది.
రామ్ యొక్క దుస్థితి
నీ బాధ పోవడానికి ఇప్పుడు ఇదే మంచిది బావ.. కమాన్ తాగు అని యామిని అంటుంది. రాజ్ ఆలోచిస్తుంటే.. కళావతిని గుర్తు చేసుకో. నిన్ను మోసం చేసింది అని రెచ్చగొడుతుంది యామిని. దాంతో రాజ్ గబగబ మందు తాగుతాడు. ప్రేమించిన రాజ్‌కు కళావతిని దూరం చేయడానికి తాగుడు అలవాటు చేస్తుంది యామిని.
నేనేం తప్పు చేశాను. అంతలా ప్రేమిస్తే ఇంతలా మోసం చేస్తారా అని బాధనంతా కక్కుతాడు రాజ్. నా బాధనంతా ఎవరికి చెప్పుకోవాలో నాకు తెలియగా మదనపడుతున్నా. కళవతి ఐ హేట్ యూ.. ఐ హేట్ యూ.. అని కింద పడిపోతే యామిని పట్టుకుంటుంది. రాజ్ బాధ చూసి యామిని నవ్వుతుంది. కావ్యపై కోపంగా అరిచి అరిచి యామిని ఒళ్లో పడుకుంటాడు రాజ్.
మందు మనల్ని ఇలా దగ్గర చేస్తుందంటే నేను దీనికి ఎప్పుడో బానిసను చేసేదాన్ని బావ అని యామిని అనుకుంటుంది. రోడ్డు మీద మందు బాటిల్ పట్టుకుని తాగుతూ తూలుతూ పాటలు పాడుకుంటూ వెళ్తాడు. బైక్‌కు అడ్డం వచ్చి వాడినే తిట్టి పంపిస్తాడు రాజ్. తర్వాత రోడ్డు మీదే చెప్పులను దిండుగా పెట్టుకుని మందు బాటిల్ పక్కన పెట్టుకుని పడుకుంటాడు రాజ్ .
కావ్య యొక్క గర్భం
అప్పుడే కారులో వెళ్తున్న కావ్య వాళ్లకు రాజ్ కనిపిస్తాడు. రోడ్డు మీద ఎవరో పడుకున్నారని డ్రైవర్ అంటే.. వాడికి బుద్ధి చెప్పొస్తానని వెళ్లి కావ్య తిడుతుంది. రాజ్‌ను చూసి షాక్ అయిపోతుంది. కళావతి గారు మీరా. నన్ను ఇలా కూడా బతకనివ్వరా. ఏకంగా బెడ్ రూమ్‌లోకి వచ్చారు. కారుతో గుద్ది చంపేస్తారా అని రాజ్ అంటాడు. కళావతి గారు నా మనసు ముక్కలైంది. మీరే ముక్కలు చేశారు అని తన బాధను చెప్పుకుంటాడు.
రోడ్డు మీద వెళ్లేవాళ్లను ఊరికే తిడతాడు రాజ్. ముందు ఇంటికి వెళ్దాం పదండి అని కావ్య అంటే రాజ్ రానంటాడు. మీరు మోసం చేసిన నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీరు తోడుగా లేకున్నా ఈ మందు తోడుగా ఉందని కావ్య ముందే గడగడ మందు తాగుతాడు రాజ్. కావ్య ఆపిన ఆపడు. రోడ్డు మీద పడిపోతాడు రాజ్. ఇంటికివెళ్దామంటే నాకు ఇక్కడే బాగుంది. నాకు నిద్ర వస్తుంది అని రోడ్డు మీదే పడుకుండిపోతాడు రాజ్.
డ్రైవర్‌ను పిలిచి రాజ్‌ను కారులోకి ఎక్కిస్తుంది కావ్య. కారు వెనుక సీట్‌లో రాజ్‌ను ఒళ్లో పడుకోబెట్టుకుని తీసుకెళ్తుంది కావ్య. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ఈ ఎపిసోడ్ రాజ్, రామ్ మరియు కావ్య జీవితాలలో కీలక మలుపును సూచిస్తుంది. యామిని కుట్రలు ఎంతవరకు విజయవంతమవుతాయో, రాజ్ తన బాధ నుండి బయటపడగలడా అనేది ఆసక్తికరంగా ఉంది.


