|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్రహ్మముడి నవంబర్ 8 ఎపిసోడ్: రుద్రాణితో రంజిత్ 2 కోట్ల డీల్- కుయిలి ఇంట్లో సీక్రెట్ కెమెరా పెట్టిన కావ్య-కోర్టుకు రాహుల్

Published: 07-11-2025, 10:40 PM
బ్రహ్మముడి నవంబర్ 8 ఎపిసోడ్: రుద్రాణితో రంజిత్ 2 కోట్ల డీల్- కుయిలి ఇంట్లో సీక్రెట్ కెమెరా పెట్టిన కావ్య-కోర్టుకు రాహుల్

బ్రహ్మముడి నవంబర్ 8 ఎపిసోడ్‌లో కుయిలి హత్య కేసులో రాహుల్ అరెస్ట్ అయ్యాడు. రంజిత్ రుద్రాణితో 2 కోట్ల డీల్ కుదుర్చుకోగా, కావ్య సీక్రెట్ కెమెరా ద్వారా నిజం బయటపెట్టాలని చూస్తుంది. కోర్టుకు రాహుల్ వెళ్ళడంతో ఉత్కంఠ నెలకొంది.

Key Points

1

కుయిలి హత్య కేసులో రాహుల్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్లారు.

2

రాహుల్‌ను కాపాడటానికి రుద్రాణితో కుయిలి భర్త రంజిత్ 2 కోట్ల డీల్ చేసుకున్నాడు.

4

రాహుల్ జస్ట్ తోసేశానని చెప్పినా, కోర్టులో తేల్చుకోమని పోలీసులు తీసుకెళ్లారు.

కుయిలి హత్య కేసులో రాహుల్ అరెస్ట్

బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 8 ఎపిసోడ్‌లో కుయిలిని రాహుల్ హత్య చేశాడని పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు. రాహుల్ మళ్లీ మోసం చేశాడని స్వప్న బాధపడుతుంది. రుద్రాణికి కుయిలి భర్త రంజిత్ కాల్ చేసి 2 కోట్ల డీల్ మాట్లాడుకుంటాడు. కుయిలి ఇంట్లో కావ్య ముందే సీక్రెట్ కెమెరా పెట్టిందని రాజ్ చెబుతాడు.

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కుయిలి ఇన్సిడెంట్ తర్వాత మరుసటి రోజు ఉదయం రాహుల్ డల్‌గా ఉంటే రాజ్ అడుగుతాడు. జరిగింది మర్చిపోకపోతే భవిష్యత్తుపై భయం ఉండదుగా అని స్వప్న సెటైర్ వేస్తుంది. కిచెన్‌లో కావ్యతో రాజ్ రొమాన్స్ చేస్తాడు. ఖాలీగా ఉండేబదులు ఆఫీస్‌లో పని చేసుకోవచ్చుగా అని రాహుల్‌తో అంటుంది ఇందిరాదేవి.

నీకు కుయిలి తెలుసా, నీకు కుయిలికి గొడవ జరిగిందా, కొట్టావా లేదా అని ఎస్సై అడిగితే.. తెలుసు, గొడవ జరిగింది. కానీ నేను జస్ట్ తోసేసాను అంతే. దానికే ఎలా చనిపోతుందని రాహుల్ అంటాడు. అయితే, కోర్టులో తేల్చుకో. ఇతను నిర్దోషి అయితే జడ్జ్ గారే వదిలేస్తారు అని రాహుల్‌ను అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్తారు. వాడు ఒక మనిషి ప్రాణం తీస్తాడనుకోలేదు. ఎలా కాపాడమంటావ్ అని రుద్రాణితో ఇందిరాదేవి అంటుంది.

రుద్రాణితో రంజిత్ 2 కోట్ల డీల్

వాడు మారాడని సంతోషించాలో, చంపాడని బాధపడాలో తెలియట్లేదు అని అపర్ణ అంటుంది. కాసేపు ఎవరు మాట్లాడకండి. కళావతి పదా అని రాజ్ అంటాడు. రాత్రి ఈ విషయం చెప్పలేదు. వీడిని ఎలా బయటకు తీసుకురావాలని రుద్రాణి ఆలోచిస్తుంది. మరోవైపు స్వప్న వెళ్లి ఏడుస్తుంటే కావ్య, రాజ్ ఓదారుస్తారు. ఇంకోసారి నేను మోసపోయినందుకు బాధపడుతున్నాను అని స్వప్న అంటుంది.

బెదిరించడానికి కాదు. డీల్ మాట్లాడటానికి చేశాను. నేను కూడా మీలాంటి వాన్నే. మీవాడు నా భార్యను చంపుతున్న వీడియో నా దగ్గర ఉంది. దాంతో మీవాడికి శిక్ష పడుతుంది. దానివల్ల నాకు లాభం లేదు. కానీ, మనిద్దరం లాభం పొందే డీల్ ఒకటి ఉందని రంజిత్ అంటాడు. కోర్టులో ఆ వీడియో చూపించకుండా ఉండేందుకు నీకు ఎంత కావాలి అని రుద్రాణి అడుగుతుంది.

నాకు మీరు రెండు కోట్లు ఇస్తే మీ కొడుకు నిర్దోషిలా బయటకొస్తాడు. ఈరోజు మీ వాడిని కోర్టులో ప్రవేశపట్టనున్నారు. ఈలోపు డిసైడ్ అవ్వండి అని రంజిత్ చెప్పి కాల్ కట్ చేస్తాడు. రుద్రాణి కిందకు అరుస్తు వస్తుంది. రాహుల్ అరెస్ట్ అయినందుకు పిచ్చి పట్టిందా అని ప్రకాశం అంటాడు. అవును, వాడికోసం పిచ్చి ప్రయత్నాలు అన్ని చేస్తున్నాను అని రుద్రాణి అంటుంది.

కావ్య సీక్రెట్ కెమెరా ప్లాన్

నిందలు వేసింది చాలు అత్త ఆపు. వాడికి డబ్బు ఇస్తే అమ్మాయిని రాహుల్ చంపినట్లే అని ఒప్పుకున్నట్లేగా. ఎప్పుడు సపోర్ట్ చేయని కళావతి కూడా రాహుల్ చంపలేదని నమ్ముతుంది. కన్న కొడుకును నువ్వు నమ్మట్లేదు. మేము వాడిని శిక్ష పడకుండా బయటకు తీసుకొద్దామని చూస్తున్నాం అని రాజ్ అంటాడు. రాహుల్ బయటపడాలంటే సాక్ష్యాలు కావాలి. మీరు రాకపోయిన ఆ రంజిత్‌ను కలిసి ఒప్పించి రాహుల్‌ను బయటకు తీసుకొస్తాను అని రుద్రాణి వెళ్లిపోతుంది.

స్వప్న అత్త రాహుల్‌ను కలిసి మాట్లాడేటప్పుడు నువ్వు కూడా పక్కనే ఉండు. రాహుల్‌ను బయటపడేసే సాక్ష్యం నేను తీసుకొస్తా అని రాజ్ అంటాడు. మేము వచ్చేవరకు రంజిత్‌ను అక్కడే ఉండేలా చూడమని కావ్య అంటుంది. అసలు మీ దగ్గర ఏం సాక్ష్యాలు ఉన్నాయని ఇదంతా చేస్తున్నారు అని అపర్ణ, సుభాష్ అడుగుతారు.

మొత్తానికి, బ్రహ్మముడి సీరియల్‌లో రాహుల్ అరెస్ట్, 2 కోట్ల డీల్, సీక్రెట్ కెమెరా వంటి కీలక మలుపులు చోటుచేసుకున్నాయి. రాహుల్ నిర్దోషిగా బయటపడతాడా లేదా అనేది తెలుసుకోవాలంటే రాబోయే ఎపిసోడ్‌లు చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.