
బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 5వ తేదీ ఎపిసోడ్ లో ఆసక్తికరమైన ట్విస్టులు ఉన్నాయి. కావ్య రాజ్ ప్రేమను తిరస్కరించి అతన్ని అవమానిస్తుంది. అపర్ణ ఆగ్రహంతో కావ్యను కొట్టడానికి ప్రయత్నిస్తుంది. రాజ్ కి మరో ప్రమాదం జరుగుతుందా?
Key Points
రాజ్ ప్రేమను కావ్య తిరస్కరించింది.
అపర్ణ కావ్యను కొట్టబోయింది.
కావ్య రాజ్‌ను దారుణంగా అవమానించింది.
కావ్య ప్రేమను తిరస్కరించింది
బ్రహ్మముడి సీరియల్ ప్రతి ఎపిసోడ్ ఎంతో ఆసక్తి రేపేలా సాగుతోంది. తాజాగా మంగళవారం (ఆగస్ట్ 5) 792వ ఎపిసోడ్ లో కొన్ని ఊహించిన ఘటనలు జరిగాయి. రాజ్ ప్రేమను తిరస్కరించడమే కాదు.. అతన్ని దారుణంగా అవమానిస్తుంది కావ్య. ఆ తర్వాత ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం.
రాజ్ ప్రపోజల్ ను కావ్య తిరస్కరించే సీన్ తో బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (ఆగస్ట్ 5) ఎపిసోడ్ ప్రారంభమవుతుంది. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని కావ్య తెగేసి చెబుతుంది. ఎందుకు ఇష్టం లేదని ఇంట్లో వాళ్లు అడుగుతారు. ఆయన ఇష్టపడితే నేనూ ఇష్టపడాలా? తాళి కడతా అంటే తల వంచుకొని కట్టించుకోవాలా అని అంటుంది. ఆమెను అపర్ణ , ఇందిరాదేవి మందలించబోతే.. రాజ్ జోక్యం చేసుకుంటాడు.
ఇది తనకు, కళావతికి మధ్య సమస్య అని.. దీనిని తామే పరిష్కరించుకుంటామని రాజ్ అంటాడు. మీరు బలవంతం చేసి తనను ఒప్పించడం ఇష్టం లేదని స్పష్టం చేస్తాడు. ఎవరూ మాట్లాడొద్దని అంటాడు. ఇది మీ లైఫ్.. దీనిపై నిర్ణయం తీసుకునే హక్కు మీకే ఉందని కావ్యతో రాజ్ అంటాడు. మీరు ఒప్పుకోకుండా మీ ఇంటికే రాను.. మీ జీవితంలోకి ఎందుకొస్తాని చెబుతాడు.
తనపై ఇష్టం లేకుండా వెంట పడుతున్నా ఎందుకు మౌనంగా ఉన్నారని, ఆఫీసులో తనను ఎండీ స్థానంలో కూర్చోబెట్టేంత నమ్మకం ఎలా వచ్చిందని కావ్యను అడుగుతాడు రాజ్. తాను కేవలం ఓ ఫ్రెండ్ గా భావించే అలా చేశానని, మీరు అర్థం చేసుకుంటారని అనుకున్నాను కానీ.. ఇలా మీరూ అందరిలాంటి మగవాళ్లే అని ఊహించలేపోయానని కావ్య అంటుంది. మీతో చనువుగా ఉన్నంత మాత్రాన ఇలా ఇంటికి వచ్చి నా వాళ్ల ముందు ఇలా అడిగే హక్కు మీకు ఎవరిచ్చారని రాజ్ ను నిలదీస్తుంది.
దీంతో రాజ్ షాక్ తింటాడు. మీరు కొత్తగా మాట్లాడుతున్నారని, మీ మనసులో ఏదో ఉందని, అదేంటో చెప్పాలని అడుగుతాడు. కానీ కావ్య మాత్రం నాతో తిరగమని నేను అడిగానా? మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లుగా నటించానా? అసలు నేనేం చేశానని ఇవాళ నా ఇంట్లో వాళ్ల మధ్య ఇలా చెడ్డదాన్ని చేస్తున్నారు? మీరే వచ్చారు.. మీరే సాయం చేస్తారన్నారు.. అన్నీ మీరే ఊహించేసుకొని ఇప్పుడు వచ్చి మాట్లాడతారా? ఏదో గతం గుర్తు లేదని దగ్గరికి తీసుకుంటే నాకు బాగా బుద్ధి చెప్పారని కావ్య అనడంతో అపర్ణ ఆమెను కొట్టడానికి చేయెత్తుంది. దీంతో రాజ్ అడ్డుకుంటాడు.
వద్దమ్మా అంటూ వారిస్తాడు. కావ్య మాత్రం బాగుందత్తయ్యా.. బయటి వ్యక్తి కోసం మీరు నాపైనే చేయెత్తెతారా అని అంటుంది. మీరు ఆవిడకు కొడుకు, ఆవిడకు మనవడిగా ఇంటికి వస్తే సరే కానీ మరోసారి ఇలాంటివి చేయొద్దంటూ వెళ్లిపోతుంది. బెడ్ రూమ్ లోకి వెళ్లి ఏడుస్తూ కూర్చొంటుంది.
అపర్ణ, కావ్య మధ్య గొడవ
కావ్య.. రాజ్ ప్రపోజల్ ను రిజెక్ట్ చేసిన విషయాన్ని యామినికి ఫోన్ చేసి చెబుతుంది రుద్రాణి. ఆ విషయం విని యామిని సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అసలు నమ్మలేకపోతున్నానని, ఇంత షార్ట్ టైమ్ లో ఇంత గుడ్ న్యూస్ వినాల్సి వస్తుందని తాను ఊహించలేదని యామిని అంటుంది. తాను కూడా కావ్య అలా మాట్లాడటం చూసి షాక్ తిన్నట్లు రుద్రాణి చెబుతుంది. ఇక బావను తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తానని యామని అంటుంది.
అయితే మీరు ఓ పని చేసి పెట్టాలని రుద్రాణిని అడుగుతుంది. కావ్యను అంత తేలిగ్గా తీసుకోవడానికి లేదని, ఇన్నాళ్లూ రామ్ గారు అంటూ బావ వెంట పడుతూ ఆయన ఎప్పుడు ప్రపోజ్ చేస్తారని ఎదురు చూసిందని, ఇప్పుడిలా మాట్లాడిందంటూ ఏదో బలమైన కారణమే ఉందని యామిని అంటుంది. అదేంటో కనిపెట్టాలని రుద్రాణికి చెబుతుంది. ఆమె సరే అంటుంది.
ఆ తర్వాత తన తల్లిదండ్రులను పిలిచి ఈ ఆనందాన్ని షేర్ చేసుకుంటుంది. బావ కావ్యకు ప్రపోజ్ చేశాడని, ఆమె రిజెక్ట్ చేయడమే కాకుండా బావను హర్ట్ చేసేలా మాట్లాడిందని చెబుతుంది. వాళ్లు కూడా ఆనంద పడతారు. ఇక బావను, తనను ఒక్కటి చేయడానికి మీరు కూడా సపోర్ట్ చేయాలని ఆమె అంటుంది.
రాహుల్‌తో గుడ్ న్యూస్ షేర్ చేసుకున్న రుద్రాణి
అటు దుగ్గిరాల ఇంట్లో రుద్రాణి కూడా సంతోషిస్తూ ఉంటుంది. అప్పుడే రాహుల్ ఆమె దగ్గరికి పూర్తిగా ఢీలా పడిపోతూ వస్తాడు. ఆ బాబు ఎవరో కనిపెట్టలేకపోయానని, అప్పూ మధ్యలోనే మిస్ అయిందని జరిగిన విషయం చెబుతాడు. నువ్వు ఫాలో అవుతున్న విషయం దానికి తెలిసిపోయి ఉంటుందని, పోనీలే వదిలెయ్ అని రుద్రాణి అంటుంది. తిడతావేమో అనుకుంటే ఇలా సింపుల్ గా తీసేసావేంటి మమ్మి అని రాహుల్ షాక్ తింటాడు. దీంతో ఇంట్లో రాజ్ ప్రేమను కావ్య రిజెక్ట్ చేసిన విషయాన్ని షేర్ చేస్తుంది రుద్రాణి. అది విని రాహుల్ కూడా ఆనందిస్తాడు.
రాజ్‌కు ప్రమాదం
ఫ్యామిలీ ఎందుకు లేదని నిలదీసిన స్వరాజ్
అటు అప్పూ వెళ్లి స్వరాజ్ ను రేవతి, జగదీశ్ లకు అప్పగించి వెళ్లిపోతుంది. ఆ తర్వాత తాను గుడిలో తప్పిపోయానా అని తల్లిని అడుగుతాడు స్వరాజ్. తాను తప్పిపోవడం బాగుందని, తన ఫ్రెండ్ ఇంట్లో బాగా ఎంజాయ్ చేశానంటాడు. తాను ఎంత అల్లరి చేసినా ఎవరూ ఏమీ అనలేదని, తన ఫ్రెండ్ తనను ఓ మనవడిలా చూసుకుందని స్వరాజ్ అంటాడు. మనకు కూడా అలాంటి ఫ్యామిలీ ఉంటే బాగుంటుందని, ఎందుకు లేదని అడుగుతాడు. దీంతో తాను చేసిన తప్పుకు నీకు అమ్మమ్మ లేకుండా పోయిందని అంటూ ఏడుస్తూ వెళ్లిపోతుంది.
రాజ్‌ను ఓదార్చిన అపర్ణ, ఇందిరాదేవి
అటు రాజ్ బాధపడుతూ ఉంటాడు. అతన్ని చూసి అపర్ణ, ఇందిరాదేవి వెళ్లి ఓదారుస్తారు. తనే జీవితం అనుకున్నానని, ఇలా చేస్తుందని ఊహించలేకపోయానని రాజ్ అంటాడు. తాను కోమాలో నుంచి వచ్చిన తర్వాత మొదట యామినిని చూశానని, వాళ్లు ఎంత ప్రేమ చూపించినా తనకు ఎలాంటి ఫీలింగ్ కలగలేదంటాడు.
అదే కావ్యను చూడగానే ఏదో జన్మజన్మల బంధం ఉన్నట్లుగా అనిపించిందంటాడు. కావ్య కూడా నిన్ను ఇష్టపడిందని, కానీ ఇప్పుడెందుకు ఇలా చేస్తుందో అర్థం కావడం లేదని అపర్ణ, ఇందిర చెబుతారు. ఎప్పటికైనా ఒక్కటవుతారని ధైర్యం చెబుతారు. అక్కడితో ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాతి ఎపిసోడ్ లో రాజ్ కు మరోసారి ప్రమాదం జరిగినట్లు ప్రోమోలో చూపించారు.
బ్రహ్మముడి సీరియల్ లోని తీవ్ర ఘట్టాలతో ఈ ఎపిసోడ్ ముగిసింది. రాజ్, కావ్య మధ్య సంఘర్షణ, మరియు అపర్ణ ప్రతిస్పందన ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రాజ్ భవిష్యత్తు ఏమిటి అనేది ఆసక్తికరంగా ఉంది.


