|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్రహ్మముడి ఆగస్ట్ 8 ఎపిసోడ్: బిడ్డ కోసం ఆస్పత్రికి కావ్య- ఫాలో అయిన రాజ్- కళావతి ప్రెగ్నెంట్ అని నిజం తెలుసుకున్న రాజ్

Published: 08-08-2025, 10:11 PM
బ్రహ్మముడి ఆగస్ట్ 8 ఎపిసోడ్: బిడ్డ కోసం ఆస్పత్రికి కావ్య- ఫాలో అయిన రాజ్- కళావతి ప్రెగ్నెంట్ అని నిజం తెలుసుకున్న రాజ్

బ్రహ్మముడి సీరియల్ లోని ఆగస్ట్ 8వ తేదీ ఎపిసోడ్ లో కావ్య బిడ్డ కోసం ఆస్పత్రికి వెళుతుంది. రాజ్ ఆమెను అనుసరిస్తాడు. ఈ క్రమంలో కళావతి గర్భవతి అనే విషయం వెలుగులోకి వస్తుంది.

Key Points

1

కావ్య, బిడ్డ కోసం ఆస్పత్రికి వెళుతుంది.

2

రాజ్, కావ్యను ఫాలో అవుతాడు.

4

రాజ్ మరియు కళావతి మధ్య సంబంధం మరింత బలపడుతుంది.

కావ్య ఆస్పత్రికి వెళుతుంది

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో లవ్ యాక్సెప్ట్ చేయకుండా మా బావను ఎందుకు ఇబ్బందిపెడుతున్నావ్. కారణం ఏంటీ. బావకు ఏం జరగలేదు. ఒకవేళ ఏదైనా అయి బావ ప్రాణాలు పోయింటే అని యామిని అంటుంది. దాంతో యామిని ని ఒక్కటి లాగి పెట్టి కొడుతుంది.

ఆయన గురించి ఇలాంటి మాటలు మాట్లాడితే ఒప్పుకోను. ఆయన ఎక్కడున్న క్షేమంగా ఉండాలి అని కావ్య అంటుంది. మరి అలాంటప్పుడు పెళ్లి ఎందుకు చేసుకోవట్లేదు. చూశావా బావ నీ మీద ప్రేమ ఉన్నట్లు ఎలా నటిస్తుందో. ప్రేమిస్తున్నట్లు నటించి అబ్బాయిలను తిప్పుకోవడం ఈ మధ్య ఆడవాళ్లకు ప్యాషన్ అయిపోయింది. పద బావ. నిన్ను నెత్తిన పెట్టి చూసుకుంటాను అని చేయి పట్టుకుని నడుస్తుంది యామిని.

కానీ, రాజ్ రాడు. నాకు నమ్మకం ఉంది కాబట్టే ఇంత దూరం ప్రయాణించాను. కళావతి నన్ను ఒప్పుకోడానికి ఏం కారణం ఉందో నాకు తెలియదు కానీ, ఇంత మంది ప్రేమను మాత్రం దూరం చేసుకోలేను. అమ్మతో కాసేపు మాట్లాడి వస్తా అని రాజ్ అంటాడు. దాంతో యామిని వెళ్లిపోతుంది. వెనుక కావ్య వెళ్లిపోతుంది. ఇలాంటి పిచ్చి పనులు ఇంకోసారి చేయకురా అని సుభాష్ అంటాడు.

హలో యామిని అని కావ్య అనేసరికి యామిని ఆగిపోతుంది. తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్నావ్. ఆయన నీకు ఎప్పటికీ సొంతం కారు. ఎన్నో ప్లాన్స్ చేశావ్. కానీ, ఏమైంది. మా ఇద్దరి మధ్య బ్రహ్మముడి. ఏదో ఒకరోజు నేను ఆయనకు నిజం చెప్పే సమయం వస్తుంది. అప్పుడు నువ్ ఆడిన డ్రామాలు బయటపెడతాను అని కావ్య అంటుంది. అదంతా జరిగేదాకా చూసేంత పిచ్చిదాన్నా. బావ నాకు సొంతం కాకుంటే ఇంకెవరికి సొంతం కానివ్వను అని యామిని వెళ్లిపోతుంది.

రాజ్ యొక్క అనుసరణ

మరోవైపు రాజ్ గురించి మాట్లాడుకుంటారు. నిన్న నా కొడుకు మా అమ్మకు దగ్గరయ్యాడు. ఈరోజు నా తమ్ముడు నాకు దగ్గరయ్యాడు. మనం కోరుకుంది జరుగుతుందని అనిపిస్తుందండి అని జగదీశ్‌తో రేవతి అంటుంది. త్వరలో వాళ్లు నిన్ను ఇంటికి రానిస్తారని జగదీశ్ అంటాడు. మరోవైపు రాజ్ వైపు కోపంగా ఇందిరాదేవి, అపర్ణ చూస్తారు.

సిగ్గు లేదారా, మా పరువు అంతా తీసేశావ్ అని ఇందిరాదేవి అంటే కొడుకువని కూడా చూడను పిచ్చి కొట్టుడుకొడతాను అని అపర్ణ అంటుంది. నువ్ చేసిన పనులన్నింటితో పోలిస్తే ఈ రెజెక్షన్ పెద్ద సమస్యనా అని అపర్ణ అంటుంది. ఇంకా మీ తిట్ల పురాణం ఆపి క్షమించండి అని రాజ్ అంటాడు. ఇప్పుడు జరిగిన చెడులో కూడా మంచి ఉంది. దీనివల్లే కళావతిలో నాపై ప్రేమ ఉందని తెలిసింది. మేమిద్దరం విడిపోం అని రాజ్ అంటాడు.

రాజ్ వెళ్లొస్తాను అంటుండగా కావ్య వస్తుంది. మీకు నా మీద ప్రేమ ఉందని తెలుసు. కానీ, నా ప్రపోజ్ రెజెక్ట్ చేశానంటే పెద్ద కారణం ఉందని తెలుస్తోంది. అదేంటో తెలుసుకుంటాను. ఎంత పెద్ద సమస్య అని సాల్వ్ చేస్తాను. మీ ప్రేమ ఇవాళ చూశాను. ఇక నేను వెళ్లిపోను. మీ మనసులో నా మీద ప్రేమ ఉందని నిరూపిస్తాను అని రాజ్ వెళ్లిపోతాడు.

కళావతి గర్భం గురించి నిజం బయటపడుతుంది

మరోవైపు యామిని డల్‌గా ఉంటే రాజ్ వచ్చి అడుగుతాడు. నా బాధ అంతా నీ గురించే. కళావతి నిన్ను పట్టించుకోవట్లేదు. నిన్ను చాలా చీప్‌గా చూస్తుంది. తనకోసం ఎందుకు ఇంత పిచ్చోడిలా అయిపోతున్నావ్ అని యామిని అంటుంది. కళావతి గారికి నా మీద సముద్రం అంతా ప్రేమ ఉంది. అది ఇందాక తన మాటల్లో చూశాను. నన్ను రెజెక్ట్ చేయడానికి పెద్ద కారణం ఉండి ఉంటుంది. నా మీద ప్రేమను ఏదో ఆపుతుంది అని రాజ్ అంటాడు.

ఆ కారణం తెలుసుకుంటాను. ఆ కళావతి ని అస్సలు వదులుకోను అని రాజ్ అనేసి వెళ్లిపోతాడు. దాంతో యామిని ఇరిటేట్ అవుతుంది. మరుసటి రోజు ఉదయం హాస్పిటల్‌కు బిడ్డ ఉందో లేదో కన్ఫర్మేషన్ కోసం వెళ్తున్నట్లు అపర్ణతో చెబుతుంది కావ్య. చెకప్ కోసం వెళ్తున్నా అని అంటుంది. కావ్య హాస్పిటల్‌కు వెళ్లడం రాజ్ చూసి ఫాలో అవుతాడు.

హాస్పిటల్‌లో డాక్టర్‌తో కావ్య మాట్లాడుతుంది. చెకప్ చేసిన డాక్టర్ కంగారు పడాల్సింది ఏం లేదు. బేబీ హెల్తీగానే ఉంది. కంగ్రాట్స్ అని డాక్టర్ అంటుంది. ఆ మాటలు విన్న రాజ్‌కు కావ్య ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసిపోతుంది. దాంతో అక్కడే రాజ్ తట్టుకోలేక కుప్పకూలిపోతాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

రాజ్ కళావతి గర్భవతి అని తెలుసుకున్న తరువాత వారి సంబంధంలో కొత్త మలుపు ఏర్పడుతుంది. ఈ ట్విస్ట్ తో బ్రహ్మముడి సీరియల్ మరింత ఆసక్తికరంగా మారుతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.