
📌 Key Points
- అంజలి పాప మిస్సింగ్ కేసులో తండ్రిపై అప్పుకు అనుమానం.
- రాజ్, కావ్యలను రౌడీల నుండి ఎస్సై కాపాడతాడు.
- రాహుల్ మోసం బయటపడటంతో సుభాష్ అతన్ని చెంపదెబ్బ కొట్టాడు.
- కావ్య సమస్యకు గురూజీ చికిత్స అందిస్తాడు.
బ్రహ్మముడి డిసెంబర్ 12 ఎపిసోడ్‌లో ఉత్కంఠ భరిత సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. అంజలి పాప మిస్సింగ్ కేసులో తండ్రిపై అనుమానం పెరుగుతుంది. రాజ్, కావ్యలు ప్రమాదం నుంచి బయటపడతారు. రాహుల్ మోసం బయటపడగా, సుభాష్ అతన్ని చెంపదెబ్బ కొట్టాడు. కావ్య సమస్య గురూజీ ద్వారా వెలుగులోకి వచ్చింది.
పాప కేసులో తండ్రి అనుమానం, రాజ్-కావ్య పలాయనం
బ్రహ్మముడి సీరియల్ డిసెంబర్ 12 ఎపిసోడ్‌లో అంజలి పాప మిస్సింగ్ కేసులో తండ్రే నిందితుడు అని అప్పుకు అనుమానం వస్తుంది. రాజ్, కావ్యలను మురుగన్ నుంచి ఎస్సై కాపాడుతాడు. రాజ్ క్లయింట్స్‌ను తనవైపుకు తిప్పుకున్నాడని రాహుల్‌ను చెంపదెబ్బ కొడతాడు సుభాష్. స్వప్న సాక్ష్యంగా నిలుస్తుంది. కావ్య సమస్య బయటపడుతుంది.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో పోలీస్ స్టేషన్ నుంచి రేణుక వెళ్తుంటే తన భర్త వస్తాడు. రేణు క భర్తతో మీ పాప బతికే ఉందని అప్పు చెబుతుంది. దాంతో రేణుక భర్త షాక్ అవుతాడు. మీరేంటీ షాక్ అవుతున్నారు. బతికే ఉందంటే ఒక చిన్న క్లూ దొరికింది. మీ ఆవిడ సూసైడ్ చేసుకుంటే మీరేంటీ తాపిగా వచ్చారు అని అప్పు అంటుంది.
మరోవైపు ఎలాగైనా తప్పించుకోవాలని రాజ్, కావ్య అనుకుంటారు. రాజ్ వెనుక ఉన్న బీర్ సీసా తీసుకుని పగులగొట్టి తాళ్లు కోస్తాడు. ఇంతలో రౌడీలు వచ్చి పెన్‌డ్రైవ్ ఎక్కడ అని అడుగుతారు. ప్యాంట్ పాకెట్‌లో ఉందని, దగ్గరికి రమ్మని చెప్పిన రాజ్ రౌడీలను కొడతాడు. కట్లు విప్పేసుకున్న రాజ్ రౌడీలను చితకబాదుతాడు. కావ్య కట్లు విప్పుతాడు.
రాహుల్ మోసం, సుభాష్ ఆగ్రహం
రాజ్, కావ్య పారిపోతుంటే గన్ పట్టుకుని రౌడీ గ్యాంగ్ బాస్ మురుగన్ ఎంట్రీ ఇస్తాడు. పెన్‌డ్రైవ్ గురించి అడిగితే మా దగ్గర ఏం లేదు, మా భార్యకు ట్రీట్‌మెంట్ ఇవ్వాలి, చనిపోయిన వాడికి మాకు సంబంధం లేదు అని రాజ్ చెబుతాడు. కానీ, మురుగన్ వినడు. కాల్చి చంపేస్తానంటాడు. చంపేయమని చోటు, మోటు అంటారు. ఇంతలో ఎస్సై వచ్చి మురుగన్‌కు గన్ పెడతాడు.
రాహుల్ మన క్లయింట్స్‌తో మాట్లాడి తనతో బిజినెస్ డీల్ చేసుకున్నారు. అంతేకాకుండా కావ్య వేసిన డిజైన్స్‌నే తన డిజైన్స్‌గా చూపించి అగ్రిమెంట్ చేయించుకున్నారు అని శ్రుతి చెబుతుంది. రాహుల్ అంత వెన్నుపోటు పొడుస్తాడని నేను అనుకోవట్లేదు. వాడికి అంత ధైర్యం లేదని సుభాష్ అంటాడు. మీ ఫ్యామిలీ మెంబర్ కాబట్టి ఎక్కువగా చెప్పట్లేదు. కావ్య మేడమ్ డిజైన్స్, రాహుల్ చూపించిన డిజైన్స్ మీకు పంపిస్తానని కాల్ కట్ చేస్తుంది శ్రుతి.
ఆ డిజైన్స్ చూసి సుభాష్ షాక్ అవుతాడు. రాహుల్ తప్పు చేశాడు, వెన్నుపోటు పొడిచాడు. వీడిని అస్సలు విడిచిపెట్టకూడదు అని సుభాష్ అనుకుంటాడు. మరోవైపు కావ్యకు గురూజీ ట్రీట్‌మెంట్ చేస్తాడు. గురూజీ అయోమయంగా చూస్తాడు. మరోవైపు రాహుల్ తన డిజైన్స్‌ను, స్వప్న మోడలింగ్‌ను ఇంట్లోవాళ్లకు చూపిస్తాడు. అది చూసి అంతా మెచ్చుకుంటారు.
కావ్య సమస్యపై గురూజీ చికిత్స
కావ్యకు వచ్చిన ఆలోచన రాహుల్ డిజైనర్‌కు వచ్చిందేమో అని రుద్రాణి అంటుంది. మమ్మీ ఆపు మావయ్య ఎక్కడో పొరపాటు పడి కంపెనీ పరువు పోతుందని చేయి చేసుకున్నారు. తండ్రి స్థానంలో ఉండి ఓ దెబ్బ కొట్టారనుకుంటాను. రెండు డిజైన్స్ ఒకేలా ఎలా ఉన్నాయో తెలియట్లేదు. నేను కష్టపడి వేయించాను. మీరు ఏ శిక్ష వేసిన అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని వెళ్లిపోతాడు రాహుల్.
ఏం పర్ఫామెన్స్‌రా. అంతా నమ్మేశారు. ఇక నీకు తిరుగులేదు అని రుద్రాణి అనుకుంటుంది. మరోవైపు కావ్యకు చేసిన వారం రోజుల చికిత్సకు 99 శాతం ఫలితం వచ్చినట్లే అని గురూజీ చెబుతాడు. దాంతో రాజ్ సంతోషిస్తాడు.
బ్రహ్మముడి నేటి ఎపిసోడ్ అనేక మలుపులతో ఆసక్తికరంగా సాగింది. అనుమానాలు, ద్రోహాలు, ప్రమాదాలు, ప్రేమ కలగలిసి ప్రేక్షకులను అలరించాయి. తదుపరి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూడాలి.


