|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: నీకు మూడోసారి పెళ్లి అవసరమా- జ్యోత్స్నతో కార్తీక్- కార్తీక్ మాటలకు పారిజాతం ఎలివేషన్

Updated: 11-12-2025, 12:47 AM
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: నీకు మూడోసారి పెళ్లి అవసరమా- జ్యోత్స్నతో కార్తీక్- కార్తీక్ మాటలకు పారిజాతం ఎలివేషన్
  • దీపను అన్నందుకు జ్యోత్స్నకు గట్టిగా బుద్ధి చెప్పిన కార్తీక్.
  • రెండు పెళ్లిళ్లు చెడిపోయిన జ్యోత్స్నకు మూడో పెళ్లి అవసరమా అని కార్తీక్ ప్రశ్న.
  • కుటుంబాల కోసం తలవంచానే తప్ప ఇష్టంతో పెళ్లి చేసుకోలేదని కార్తీక్ వెల్లడి.
  • కార్తీక్ మాటలకు ముగ్ధురాలై, జీవిత సత్యాలు పలికిన పారిజాతం.

కార్తీక దీపం 2 సీరియల్ నేటి ఎపిసోడ్‌లో కార్తీక్, జ్యోత్స్నల మధ్య వాగ్వాదం జరిగింది. దీపను కించపరిచినందుకు జ్యోత్స్నను కార్తీక్ నిలదీశాడు. మూడో పెళ్లి గురించి ప్రశ్నిస్తూ, దీపను సమర్థించాడు. కార్తీక్ మాటలకు పారిజాతం ఎలివేషన్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.

కార్తీక్, జ్యోత్స్న మధ్య వాగ్వాదం

కార్తీక దీపం 2 సీరియల్ డిసెంబర్ 11 ఎపిసోడ్‌లో దీపను అన్నందుకు జ్యోత్స్నకు గట్టిగా బుద్ధి చెబుతాడు కార్తీక్. రెండు పెళ్లిళ్లు చెడిపోయిన నీకు మూడోసారి పెళ్లికి ఒప్పుకోవడం అవసరమా అని చాలా అంటాడు కార్తీక్. ఆ కార్తీక్ మాటలకు ఫిదా అయిన పారిజాతం ఎలివేషన్ ఇస్తుంది. దీప భర్త అవడం అదృష్టమంటుంది.

కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో దీపకు కార్తీక్ రెండో భర్త అని నీచంగా మాట్లాడితే సమిత్ర కొట్టబోతుంది. కానీ, కార్తీక్ ఆపుతాడు. మాటకు మాటతో సమాధానం చెప్పాలంటాడు కార్తీక్. భర్త చనిపోయి, పిల్లలుంటే రెండో పెళ్లి గురించి ఎందుకు మాట్లాడరు. అలాంటి పరిస్థితే మన చెల్లికో, తల్లికో వస్తుంది. ఊహ తెలియనప్పుడే ఎవడో పెళ్లి చేసుకుని తల్లి చేసి పారిపోయాడను కార్తీక్ చెబుతాడు.

దీప నన్ను రెండో పెళ్లి చేసుకుంది. దానివల్ల నీకు వచ్చే నష్టం ఏంటీ. దీపను నేను పెళ్లి చేసుకోకున్న నిన్ను పెళ్లి చేసుకునేవాన్ని కాదు. కుటుంబాల కోసం తలవంచాను తప్ప ఇష్టంతో కాదు. ఆ అయిష్టం పెళ్లి వరకు రాదని నాకు తెలుసు. దీప వల్ల నీకు ఎలాంటి నష్టం జరగలేదు. నీకు నాతో ఎంగేజ్‌మెంట్ జరిగి ఆగిపోయింది. గౌతమ్‌ తో కూడా అగిపోయిందని కార్తీక్ చురకలు వేస్తాడు.

దీపను సమర్థించిన కార్తీక్

ఇప్పుడు రెండు పెళ్లిల్లు ఆగిపోయిన నీకు మూడో పెళ్లి అవసరమా.. అని నేను అనను. జనం కూడా నీ విషయంలో ఇలాగే అనుకుంటారుగా. అలా అనుకుంటారని ఇక్కడే ఆగిపోతావా. పెళ్లి చేసుకోకుండా ఇదే ఇంట్లో ఉండిపోతావా. రెండు పెళ్లిళ్లు చెడిపోయిన నువ్వు మూడో పెళ్లికి ఒప్పుకున్నప్పుడు, రెండు పెళ్లిళ్లు చేసుకున్న నీ గ్రానీ తప్పు కనిపించనప్పుడు నా భార్య చేసుకుంటే తప్పేముందని ఇచ్చి పడేస్తాడు కార్తీక్.

తర్వాత అందరి మూడ్ మార్చి స్వీట్ ఇస్తాడు కార్తీక్. జ్యోత్స్న తినకుండా ఉంటే పారు నేను చెప్పింది ఏమైనా తప్పా అని కార్తీక్ అడుగుతాడు.లేదురా. తప్పేదైనా ఉందంటే అది జ్యోత్స్నదే. నువ్ తల్లి మనసు, భార్య మనసు కాదురా ఆడదాని మనసు అర్థం చేసుకున్నావ్. ఆ మాటకు వస్తే మనిషి మనసును అర్థం చేసుకున్నావ్. నువ్వు చెప్పినవన్నీ జీవిత సత్యాలే. దీపను పెళ్లి చేసుకున్నందుకు నువ్వు అదృష్టవంతుడివేరా అని ఎలివేషన్ ఇస్తుంది పారిజాతం.

పారిజాతం ఈ గులాబ్ జామూన్ కంటే నీ మాటలు చాలా తీయగా ఉన్నాయి. అప్పుడప్పుడు చాలా అద్భుతంగా మాట్లాడతావ్ అని శివ నారాయణ అంటే.. మీరు నన్ను మెచ్చుకున్నారా. అలా అయితే మీ చేత్తో స్వీట్ తినిపించండి అని పారిజాతం అంటుంది. దాంతో పారుకు శివ నారాయణ స్వీట్ తినిపిస్తాడు. అది కార్తీక్ ఫొటో తీస్తాడు. సుమిత్ర పక్కకు వెళ్లిపోతుంది.

కార్తీక్ మాటలకు పారిజాతం ప్రశంస

మన ఫుడ్ ట్రక్స్ వెళ్లి సూపర్‌వైజ్ చేయాలని శ్రీధర్ చెబుతాడు. నేను వెళ్లడమేంటీ అని ముందు ఒప్పుకోనని తర్వాత ఒప్పుకుంటాడు కాశీ. ఏదైనా సరే నా పర్మిషన్‌తో ఓకే చేయు. ఫుడ్ నేను చూశాను. సప్లై బాగా చూసుకో అని శ్రీధర్ చెబుతాడు. దాంతో కాశి వెళ్లిపోతాడు. మరోవైపు జ్యోత్స్న అన్నమాటలకు దీప ఏడుస్తుంటుంది. కార్తీక్ వచ్చి ఓదారుస్తాడు.

దీప హగ్ చేసుకుంటుంది. మరోసారి దీని గురించి ఎవరు మాట్లాడరు. ముందు ఫుడ్ ట్రక్ సక్సెస్ కానీ తర్వాత ఏం చేస్తానో చూడు అని కార్తీక్ అంటాడు. దీపకు గులాబ్ జామూన్ తినిపిస్తాడు కార్తీక్. మరోవైపు రోడ్డు మీద నిలబెట్టారని కాశీ ఫ్రస్టేట్ అవుతాడు. శ్రీధర్ కాల్ చేసి మిగిలిన ఫుడ్‌ను అనాథ శరణాలయాల్లో, గుడిలో పంచమని చెబుతాడు.

కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‌లో కార్తీక్, జ్యోత్స్నల మధ్య వాగ్వాదం రసవత్తరంగా మారింది. దీప పట్ల కార్తీక్కున్న అచంచలమైన ప్రేమ, అతని జీవిత సత్యాలు పారిజాతం మెప్పు పొందాయి. ఈ సంఘటన సీరియల్‌కు కొత్త మలుపునిచ్చింది.

Related News

కార్తీక దీపం 2: జ్యోత్స్న కుట్ర, శౌర్య కోరిక, శ్రీధర్ ఆగ్రహం – నేటి ఎపిసోడ్‌లో ఉత్కంఠ!
Illu Illalu Pillalu Today 13 డిసెంబర్ ఎపిసోడ్ : రామరాజు ముందు నోరు విప్పిన చందు, అమూల్య బలి, భర్తను బకరా చేసిన వల్లి
బ్రహ్మముడి డిసెంబర్ 12 ఎపిసోడ్: పాప కేసులో తండ్రే నిందితుడు- రాహుల్‌ను చెంపదెబ్బ కొట్టిన సుభాష్- బయటపడిన కావ్య సమస్య
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: అసమర్థుడివి, చేతకానితనం-కాశీపై స్వప్న మాటల దాడి-దీపపై కాంచన నిందలు-మధ్యలో ఇరుక్కున్న కార్తీక్
Gunde Ninda Gudi Gantalu Today డిసెంబర్ 11 ఎపిసోడ్ : మీనాని ఏడిపించేసిన అత్త, ప్రభావతి కి లెఫ్ట్ రైట్ వాయించిన శ్రుతి
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: నీకు మూడోసారి పెళ్లి అవసరమా- జ్యోత్స్నతో కార్తీక్- కార్తీక్ మాటలకు పారిజాతం ఎలివేషన్
Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.