|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్రహ్మముడి సీరియల్‌లో ఊహించని ట్విస్ట్: రౌడీలను దింపిన రుద్రాణి, షాక్ ఇచ్చిన మంత్రి!

Published: 08-02-2026, 11:35 PM
బ్రహ్మముడి సీరియల్‌లో ఊహించని ట్విస్ట్: రౌడీలను దింపిన రుద్రాణి, షాక్ ఇచ్చిన మంత్రి!
  • రౌడీల నుంచి రాజ్‌ను కాపాడిన మంత్రి ధర్మేంద్ర.. ఊహించని ట్విస్ట్!
  • కన్నబిడ్డను కాపాడుకోవడానికి కావ్య ప్రయత్నాలు.. ఉత్కంఠ!
  • రుద్రాణి బ్లాక్ మెయిల్‌తో భయపడిన నీలవేణి.. ఏం జరుగుతుందో?
  • ఆపరేషన్ సక్సెస్.. కానీ పాప పరిస్థితి ఇంకా విషమంగానే!

బ్రహ్మముడి సీరియల్ రోజురోజుకూ ఉత్కంఠగా మారుతోంది. రౌడీలు, బ్లాక్ మెయిల్‌లు, అనూహ్యమైన ట్విస్టులతో ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందామా!

రౌడీల నుంచి రాజ్‌ను కాపాడిన మంత్రి!

బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 9 ఎపిసోడ్‌లో హెడ్ నర్స్ నీలవేణికి కాల్ చేసిన రుద్రాణి తన రౌడీలను పాప దగ్గరికి పంపించాలని బ్లాక్ మెయిల్ చేస్తుంది. కానీ, నీలవేణి వెళ్లి రాజ్‌కు రౌడీల విషయం చెబుతుంది. వచ్చిన రౌడీలను కూడా నీలవేణి డైవర్ట్ చేస్తుంది. రౌడీలు రాజ్‌ను కత్తితో పొడవబోతుంటే మంత్రి కాపాడుతాడు.

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో ఎలాగైనా పాపను కాపాడమని హాస్పిటల్‌లో డాక్టర్‌తో అంటారు కావ్య, దుగ్గిరాల కుటుంబం. డాక్టర్ అనురాధ పాపను ఆపరేషన్‌కు తీసుకెళ్తుంది. కావ్య కన్నీళ్లు పెట్టుకుంటూ ఐసీయూ వరకు వెళ్తుంది. పాప తిరిగి రాకపోతే ఈ బిడ్డ కన్నతల్లికి ఏమని సమాధానం చెబుతామని భయపడుతుంది కావ్య.

ఇంతలో హెడ్ నర్స్ నీలవేణికి కాల్ చేస్తుంది రుద్రాణి. నీలవేణి భయపడుతుంది. నా మనుషులు హాస్పిటల్‌లోకి వస్తారు. వాళ్లను లోపలికి పంపించు అంతే. కాసేపట్లో డబ్బులు పడతాయ్ అని రుద్రాణి అంటుంది. నాకు ఏ డబ్బులు వద్దు పాపకు మళ్లీ ఏదో హానీ చేయబోతున్నారని నీలవేణి అంటుంది.

వాళ్లను హాస్పిటల్‌కు రానివ్వకుంటే నీ ఇంటికి వెళ్తారు. నీ పిల్లలు ఇంట్లోనే ఉన్నారనుకుంటా అని బ్లాక్ మెయిల్ చేస్తుంది రుద్రాణి. దాంతో సరే మీరు చెప్పిందే చేస్తాను అని నీలవేణి ఒప్పుకుంటుంది. కానీ, నీలవేణి బాగా ఆలోచిస్తుంది. వెళ్లి కావ్యతో మాట్లాడుతుంది నీలవేణి. కావ్య కోప్పడుతుంది.

కన్నబిడ్డతో ఇంటికి కావ్య.. కన్నీళ్లతో నిరీక్షణ!

ఇక్కడ నీలవేణి మినిస్టర్ ధర్మేంద్ర పేరు చెప్పడంతో రుద్రాణి అదృష్టం బాగుండి ఎస్కేప్ అవుతుంది. వాడు ఇంకా దిగజారుతున్నాడని రాజ్ అంటాడు. వాళ్లు చెప్పినట్లు చేయకపోతే నా పిల్లలను చంపాలని బెదిరిస్తున్నారని నీలవేణి అంటుంది. వాళ్లు చెప్పినట్లు మీరు చేయండి. పాపకు ఏం కాకుండా నేను చూసుకుంటాను అని రాజ్ అంటాడు.

దాంతో నీలవేణి వెళ్లిపోతుంది. ఇంట్లోవాళ్లను పంపిద్దామని రాజ్, కావ్య వెళ్తారు. ఇంతలో డాక్టర్ వచ్చి ఆపరేషన్ సక్సెస్‌ఫుల్‌గా జరిగింది అని చెప్పడంతో అంతా సంతోషిస్తారు. కానీ, పాప స్పృహలోకి వస్తే కానీ కండిషన్ ఏంటో చెప్పలేం. ఇంకో రెండు గంటలు గడిస్తే తెలిసిపోతుంది అని డాక్టర్ అనురాధ అంటుంది.

కన్నకూతురును చంపుకోవాలని ఎలా అనిపించిందో. ఇంతకు ఇంత అనుభవిస్తాడు అని కావ్య అంటుంది. మరోవైపు రౌడీలను పక్కకు పిలిచిన నీలవేణి పాప ఐసీయూలో ఉంది. వాళ్లంతా అక్కడే ఉన్నారు. వాళ్లు వెళ్లిపోయాక వెళ్లండి అని రౌడీలను డైవర్ట్ చేస్తుంది నీలవేణి. మరోవైపు ధర్మేంద్ర పరధ్యానంగా ఉంటే తులసి వచ్చి కావ్య గురించి మాట్లాడుతుంది.

కావ్య పాపకు ఆపరేషన్ మన హాస్పిటల్‌లోనే ఇవాళ జరుగుతుంది. కావ్య గొప్ప మనసు గురించి తులసి చెబుతుంది. మీరు హెల్ప్ చేసుంటే మనకు పుణ్యం దక్కేది అని చెప్పేసి తులసి వెళ్లిపోతుంది. ఇంతలో రుద్రాణి వచ్చి గుడ్ న్యూస్ అంటుంది. ఈరోజు నేను వేసిన ప్లాన్ వల్ల రాజ్ వాళ్లు మీ జీవితంలోకి శాశ్వతంగా రారు అని రుద్రాణి అంటుంది.

తల్లిని భయపెట్టిన రాహుల్.. అసలేం జరుగుతోంది?

దాంతో ఆవేశంగా రుద్రాణి చెంప చెల్లుమనిపిస్తాడు ధర్మేంద్ర. చంపేస్తాను నోరు తెరిస్తే. అక్కడ ఉంది ఎవరో కాదే నా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ. నా పాపను చంపాలనే ఆలోచన ఎలా వచ్చిందే. నా భార్య కోసం తప్పు చేశాను కానీ నా బిడ్డను చంపుకునే దుర్మార్గుడిని కాదు. ఫోన్ చేసి వాళ్లను ఆపమని చెప్పు అని ధర్మేంద్ర అంటాడు.

వాళ్లు ఇలాంటి పనులు చేసేటప్పుడు ఫోన్ స్విచ్ఛాఫ్ పెట్టుకుంటారు. లిఫ్ట్ చేయరు అని రుద్రాణి అంటుంది. దాంతో మరోసారి కొడతాడు మంత్రి. రాజ్‌కు కాల్ చేసిన నా మాట నమ్మరు. ఎలా ఆపాలి అని హాస్పిటల్‌కు కంగారుగా వెళ్తాడు ధర్మేంద్ర. మరోవైపు పాప లేని రూమ్‌లోకి రౌడీలను పంపిస్తుంది నీలవేణి. అక్కడ పాపకు బదులు బొమ్మ ఉంటుంది.

మరోవైపు హాస్పిటల్‌లో ఎంతోమంది పుట్టిన ఒక్క కావ్య అక్క బిడ్డనే కావాలని మార్చారు. ఎవరో మినిస్టర్‌తో ఈ తప్పు చేయించారని అనిపించట్లేదా అని అప్పు డౌట్ పడుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

బ్రహ్మముడి సీరియల్‌లో రోజుకో ట్విస్ట్ ఎదురుచూస్తూనే ఉంది. రాబోయే ఎపిసోడ్స్‌లో ఏం జరుగుతుందో చూడాలి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.