
బ్రహ్మముడి సీరియల్‌లోని ఈరోజు ఎపిసోడ్‌లో అపర్ణ తన కూతురు రేవతిని ఇంట్లోంచి గెంటేస్తుంది. రేవతి పెళ్లి వెనుక కథ, అపర్ణకు మనవడు నచ్చడం, యామిని యొక్క సహాయం వంటి సంఘటనలు ఈ ఎపిసోడ్‌లో చోటుచేసుకుంటాయి.
Key Points
అపర్ణ రేవతిని ఇంట్లోంచి గెంటేస్తుంది.
అపర్ణకు తన మనవడు స్వరాజ్ బాగా నచ్చుతాడు.
యామిని, కావ్యకు అప్పును కాపాడే ఐడియా ఇస్తుంది.
రేవతి తన పెళ్ళి వెనుక ఉన్న కారణాన్ని వెల్లడిస్తుంది.
అపర్ణ మరియు రేవతి మధ్య సంఘర్షణ
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కూతురు రేవతిని ఇంట్లోంచి గెంటేస్తుంది అపర్ణ. నా కూతురు చనిపోయి చాలా సేపు అయిందని సుభాష్ అంటాడు. దాంతో నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అని జగదీష్ అంటాడు. ఇంట్లోకి వెళ్లి వచ్చి ఆస్తి పేపర్స్ పడేస్తుంది అపర్ణ. మీ నాన్న నీకోసం కొన్న ఆస్తి, దీనికోసమే వాడు నిన్ను పెళ్లి చేసుకుని ఉంటాడు. మాకెందుకు అని పారేస్తుంది అపర్ణ.
వాటిని ఏరి తిరిగి సుభాష్ కాళ్ల కింద పెడుతుంది. ఈ ఆస్తితో నాకు పనిలేదు. ఏదో ఒక రోజు నా తప్పు లేదని మీరు పిలిచేవరకు ఈ ఇంటికి నేను అడుగు పెట్టను అని రేవతి అంటుంది. అది నేను బతికి ఉన్నంతవరకు జరగదు అని అపర్ణ అంటుంది. దాంతో రేవతి, జగదీష్ వెళ్లిపోతారు. అందుకే ఇలా దొంగతనంగా కలుస్తున్నానని కావ్యకు ఇందిరాదేవి చెబుతుంది.
అన్ని విషయాలు షేర్ చేసుకునే రేవతి గారు మరి పెళ్లి విషయం ఎందుకు చేసుకున్నారు అని కావ్య అడుగుతుంది. చెప్పలేక కాదు చెప్పే టైమ్ లేక. అలా ఆగమేఘాల మీద రేవతి ఎందుకు పెళ్లి చేసుకుందని ఆరా తీస్తే జగదీష్ తల్లి అనారోగ్యంతో మంచానపడేసరికి, తల్లి చివరి కోరిక కోసం ఆమె ముందు రేవతి పెళ్లి చేసుకుంది. కానీ, ఆ నిర్ణయమే రేవతి పాలిట శాపమైందని ఇందిరాదేవి అంటుంది.
అపర్ణకు మనవడు నచ్చడం
ఇన్ని తెలిసిన వాళ్ల కోపాల ముందు ఏం చెప్పలేకపోయాను అని ఇందిరాదేవి అంటుంది. ఆడపడుచుతో కన్నీళ్లు పెట్టించింది చాలు. రేవతి గారిని ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది అని కావ్య అంటే అప్పు గురించి అడుగుతుంది ఇందిరాదేవి. అదే పనిలో ఉన్నామని వెళ్తుంది కావ్య. మరోవైపు మనవడు స్వరాజ్ మాట్లాడిన మాటలను తలుచుకుంటూ మురిసిపోతుంది.
సుభాష్ వచ్చి అడిగితే జరిగింది చెబుతుంది. వాడు అచ్చం మన రాజ్ జిరాక్స్ కాపీలానే ఉన్నాడు. మన అబ్బాయి పోలికలను పునికిపుచ్చుకున్నట్లు ఉన్నాడు. మనింటి పిల్లాడిలా అనిపించాడు. ఇంకా వాడి పేరు స్వరాజ్ అని చెప్పాడు. చిచ్చరపిడుగులా ఉన్నాడు. నా మనసుకు వాడు బాగా నచ్చాడు. మళ్లీ వాడిని కలవాలని ఉంది అని సంతోషంగా చెబుతుంది అపర్ణ .
పెళ్లైన కొత్తలో ఇలా కనిపించావ్ ఇప్పుడు మళ్లీ ఇలా కనిపించావ్ అని సుభాష్ అంటాడు. మరోవైపు టెన్షన్ పడుతున్న కావ్యకు యామిని కాల్ చేసి నేను మంచి సింగర్ అవ్వాలనుకుంటున్నాను అని గాలి వానలో అనే పాట పాడుతుంది. నాకు నువ్ డబుల్ ధమాకా ఆఫర్ నువ్వే ఇచ్చావ్. నువ్ శీను దగ్గరికి వెళ్తే వాడు సరే అని చెప్పి నీ చెల్లెలి బయటకు వస్తుంది అనుకున్నావా అని యామిని అంటుంది.
యామిని యొక్క అప్పు పరిష్కారం
నువ్ శీనును వెతుక్కుంటు వెళ్లి అప్పును రెండు కేసుల్లో శిక్ష పడేసేలా చేశావ్. లంచం తీసుకున్నందుకు ఒకటి, ఇంకోటి సాక్షిని కిడ్నాప్ చేసినందుకు. ఇప్పుడు మా హీరోయిన్ ఏం చేస్తుంది అని యామిని అంటుంది. పిక్చర్ అబీ బాకీ హై. ఊహించని పని ఇంకేదో చేయబోతున్నాను. నేను ఒటమి ఎరగని కావ్యను. ఎలా కాపాడుకుంటానో చూడు. ఏ నిమిషానికి ఏం జరుగునో అనే పాట డౌన్‌లౌడ్ చేసి పెట్టుకో. నేను గెలిచాకా నీకు బాగా సూట్ అవుతుంది అని కావ్య అంటుంది.
రాజ్ ఆలోచిస్తుంటే యామిని చూస్తుంది. ఏమైందని అడుగుతుంది. అప్పు గురించి చెబుతాడు. మన చేతిల్లో లేని దానికి ఎందుకు అనవసరంగా టెన్షన్ పడటం. అమ్మ నిద్ర లేస్తే నేను కనిపించకపోతే కంగారుపడుతుంది అని యామిని అంటుంది. దాంతో ఏమన్నావ్ అని రాజ్ అడిగితే మళ్లీ చెబుతుంది. అలా యామిని తనకు తెలియకుండానే అప్పును కాపాడేందుకు రాజ్‌కు ఐడియా ఇస్తుంది.
అంటే, మనమంటే ఇష్టమైన వాళ్లకు మనం కనిపించకపోయినా ఏమైనా జరిగిన కంగారుపడతారు. శీను గాడు వాళ్ల అమ్మ ఎక్కడ బాధపడుతుందో అని కచ్చితంగా ఫోన్ చేస్తాడు. అప్పుడు ట్రేస్ చేసి శీనును పట్టుకోవచ్చు. అప్పును విడిపించొచ్చు అని రాజ్ ప్లాన్ వేస్తాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
చివరగా, రేవతి తన పెళ్ళి వెనుక ఉన్న కారణాలను వెల్లడిస్తుంది. అపర్ణ తన మనవడిని చూసి సంతోషిస్తుంది. యామిని తన తెలివితేటలతో అప్పు సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది.


